హెచ్ఐవీ పై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ప్రభుత్వాలు సైతం దీనిపై చైతన్యం తీసుకువచ్చేందుకు శాయశక్తుల కృషి చేస్తూ హెచ్ఐవి వ్యాప్తి చెందకుండా చర్యలు చేపడుతున్నాయి. చాలా రాష్ట్రాల్లో ఇది దగ్గు ముఖం పట్టింది. బిహార్‌లోని ఒక జిల్లాలో మాత్రం హెచ్ఐవీ ఉధృతి పెరుగుతుంది. తాజా గణాంకాల ప్రకారం సీతామఢి జిల్లాలో హెచ్ఐవీ కేసుల సంఖ్య దాదాపు 8 వేలకు చేరింది. ఈ లెక్కలు అందరిని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేశాయి.
జిల్లాలో ఇప్పటి వరకు 7400–8000 మధ్య హెచ్ఐవీ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వీరిలో 18 ఏళ్ల లోపు 252 మంది అబ్బాయిలు, 135 మంది అమ్మాయిలు హెచ్ఐవీతో బాధపడుతున్నట్లు ఆరోగ్య రికార్డులు వెల్లడించాయి. పెద్దల్లో పురుషులు–మహిళల సంఖ్య దాదాపు సమానంగా ఉంది. ప్రతి నెల 40–60 కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లే కార్మికుల కారణంగానే వైరస్ వ్యాప్తి అధికమైందని వైద్యాధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం సీతామఢి ఏఆర్టీ సెంటర్‌లో ప్రతి నెల 5000 మంది రోగులకు ప్రభుత్వం ఉచిత మందులు అందిస్తోంది.
2022 నుండి ప్రతి సంవత్సరం దాదాపు 500 కొత్త కేసులు చేరుతున్నాయని సమాచారం. ఇదిలా ఉంటే, 2012 డిసెంబర్ నుండి 2025 డిసెంబర్ వరకు బిహార్ రాష్ట్రంలో మొత్తం 97,000 హెచ్ఐవీ కేసులు నమోదు కాగా, సీతామఢి జిల్లాలోనే 428 మంది పిల్లలు సహా 6707 మంది ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. హెచ్ఐవీ–ఎయిడ్స్‌పై ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ, జిల్లాలో కేసులు తగ్గకపోవడం ఆరోగ్య శాఖను ఆందోళనకు గురి చేస్తోంది.
ఈ అంశంపై స్థానిక అసిస్టెంట్ సివిల్ సర్జన్, హెచ్ఐవీ నోడల్ ఆఫీసర్ జే. జావేద్ మాట్లాడుతూ ఇది దగ్గుతో వచ్చే వ్యాధి కాదు, రక్త మార్పిడి లేదా ఒకే సూదితో ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల వ్యాపిస్తుంది అన్నారు. పాఠశాలలో హెచ్ఐవి గురించి బోధిస్తున్నట్లు తెలిపారు. ఇదే పరిస్థితి మరికొన్ని జిల్లాల్లో కూడా ఉందన్నారు. ప్రతి రోజు 250–300 మంది రోగులు మందులు తీసుకోవడానికి వస్తున్నారని ఆయన అన్నారు.
This post was last modified on December 11, 2025 1:44 pm
ఒకప్పుడు కలెక్షన్ కింగ్ గా తొంభై దశకంలో స్టార్ హీరోలకు బలమైన పోటీ ఇచ్చిన మోహన్ బాబుకి ఇప్పటికీ ఫాలోయింగ్…
ప్యారడైజ్ సెన్సార్ అయిపోయింది. ఊహించినట్టే ఏ సర్టిఫికెట్ వచ్చింది. 2 గంటల 54 నిమిషాల సవారి జాతి ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు…
చాలా రోజుల తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కనిపించారు. ప్రకృతి వైద్యం కోసం కేరళం వెళ్లి 20 రోజుల…
జపాన్‌తో మ్యాచ్ అంటే టీమిండియా సులభంగా గెలుస్తుందని అనుకున్నారు క్రికెట్ ఫ్యాన్స్. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తడి…
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలకమైన మేయర్ స్థానాలపై జనసేన పార్టీ గట్టి పట్టు సాధించాలని వ్యూహరచన చేస్తోంది. కూటమి…
ఓ పెద్ద సినిమా రిలీజవుతుంటే.. అందరూ ఎదురు చూసేది ట్రైలర్ కోసమే. కానీ ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న…