కటక్‌లో జరిగిన టీ20 మ్యాచ్‌లో టీమిండియా 101 పరుగుల భారీ విజయం సాధించినా, సోషల్ మీడియాలో మాత్రం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌లపై విమర్శల వర్షం కురుస్తోంది. హార్దిక్ పాండ్యా (59 రన్స్) ఒంటిచేత్తో మ్యాచ్ గెలిపిస్తే, టాప్ ఆర్డర్ ఫెయిల్యూర్స్‌ను ఫ్యాన్స్ ఎత్తిచూపుతున్నారు. ముఖ్యంగా వీరిద్దరి పాత స్కోర్లను బయటకు తీసి మరీ నిలదీస్తున్నారు.
కొత్త కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్‌లో 12 పరుగులకే (11 బంతులు) ఔటయ్యాడు. అసలు సూర్య ఫామ్ చూస్తే ఎవరికైనా భయమేస్తుందని ఫ్యాన్స్ అంటున్నారు. గత 23 ఇన్నింగ్స్‌లలో సూర్య స్కోర్లు చూస్తే.. 20, 1, 39, 1, 12, 5, 0, 47, 7*, 2, 0, 14, 12, 0, 1, 4, 21, 75, 8, 29, 8, 26, 58*. ఒక మ్యాచ్‌లో 75 కొడితే, వరుసగా ఐదారు మ్యాచ్‌లలో సింగిల్ డిజిట్‌కే పరిమితం అవుతున్నాడు. “ఒకరోజు చెలరేగి ఆడితే, మరుసటి మ్యాచ్ లలో డకౌట్ అవుతాడు. ఇదొక క్లాసిక్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజీ” అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
గిల్ vs జైస్వాల్:
ఇక వైస్ కెప్టెన్ గిల్ పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఈ మ్యాచ్‌లో 4 పరుగులకే వెనుదిరిగాడు. గత 15 ఇన్నింగ్స్‌లలో గిల్ స్కోర్లు: 58, 13, 34, 39, 20, 10, 5, 47, 29, 4, 12, 37, 5, 15, 46. ఇందులో ఒక్కటి కూడా భారీ ఇన్నింగ్స్ లేదు, కనీసం నిలకడ లేదు. టీ20ల్లో మొదటి బంతి నుంచే అటాక్ చేసే యశస్వి జైస్వాల్‌ను పక్కనపెట్టి, గిల్‌ను ఆడించడం పెద్ద తప్పు అని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఓపెనింగ్ విషయంలో మనం వెనక్కి వెళ్తున్నామని విశ్లేషిస్తున్నారు.
గంభీర్ ఫేవరిజం?
సూర్యను కెప్టెన్‌గా, గిల్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేయడం వెనుక గంభీర్, అగార్కర్‌ల “ఫేవరిజం” ఉందని టాక్ నడుస్తోంది. శ్రేయస్ అయ్యర్, సంజు శాంసన్, జైస్వాల్‌లను కాదని గిల్‌కు పదవి ఇవ్వడం, హార్దిక్ పాండ్యాను కాదని సూర్యకు పగ్గాలు ఇవ్వడంపై ఫ్యాన్స్ ఆగ్రహంగా ఉన్నారు. మొత్తానికి హార్దిక్ పాండ్యా, బౌలర్ల పుణ్యమా అని టీమిండియా గెలిచింది కానీ, కెప్టెన్, వైస్ కెప్టెన్ తమ బ్యాట్‌తో సమాధానం చెప్పకపోతే ఈ ట్రోల్స్ ఆగేలా లేవు.
This post was last modified on December 10, 2025 2:26 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…