చైనాలో అవినీతికి పాల్పడితే శిక్షలు ఎంత కఠినంగా ఉంటాయో మరోసారి రుజువైంది. భారీగా లంచం తీసుకున్న బై తియాన్‌హుయి అనే మాజీ బ్యాంకర్‌కు మంగళవారం ఉరిశిక్ష అమలు చేశారు. చైనా హువారోంగ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ అనే ప్రభుత్వ రంగ సంస్థలో జనరల్ మేనేజర్‌గా పనిచేసిన ఆయన, దాదాపు 156 మిలియన్ డాలర్లు, అంటే మన కరెన్సీలో సుమారు రూ. 1,300 కోట్లు లంచం తీసుకున్నట్లు కోర్టు నిర్ధారించింది.
2014 నుంచి 2018 మధ్య కాలంలో ప్రాజెక్టుల కొనుగోలు, ఫైనాన్సింగ్ విషయాల్లో కంపెనీలకు ఫేవర్ చేయడానికి ఆయన ఈ మొత్తం వసూలు చేశారు. సాధారణంగా చైనాలో అవినీతి కేసుల్లో మరణశిక్ష వేసినా, రెండేళ్ల తర్వాత దాన్ని యావజ్జీవ శిక్షగా మారుస్తుంటారు. కానీ ఈయన చేసిన నేరం “అత్యంత తీవ్రమైనది” కావడంతో, సుప్రీంకోర్టు ఎలాంటి మినహాయింపు ఇవ్వకుండా ఉరిశిక్షను ఖరారు చేసింది.
మరో షాకింగ్ విషయం ఏంటంటే, ఇదే సంస్థ (హువారోంగ్) మాజీ చైర్మన్ లాయ్ జియావోమిన్‌కు కూడా 2021లో ఉరిశిక్ష వేశారు. ఆయన ఏకంగా 253 మిలియన్ డాలర్లు లంచం తీసుకున్నారు. అధ్యక్షుడు జిన్ పింగ్ ప్రభుత్వం అవినీతిపై చేస్తున్న యుద్ధంలో ఈ సంస్థ అధికారులే ఎక్కువగా టార్గెట్ అవుతున్నారు.
మంగళవారం ఉదయం టియాంజిన్ నగరంలో బై తియాన్‌హుయికి శిక్ష అమలు చేశారు. అంతకుముందు చివరిసారిగా కుటుంబ సభ్యులను కలుసుకోవడానికి అనుమతి ఇచ్చారు. అయితే శిక్ష ఎలా అమలు చేశారన్నది (ఉరి లేదా విషపు ఇంజెక్షన్) మాత్రం అధికారులు బయటకు చెప్పలేదు. చైనాలో మరణశిక్షల సంఖ్య, వివరాలను “స్టేట్ సీక్రెట్”గా ఉంచుతారు.
చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఆర్థిక రంగంలో అవినీతిని ఏమాత్రం సహించడం లేదని క్లారిటీగా అర్ధమవుతోంది. ఇటీవల కాలంలో బ్యాంక్ ఆఫ్ చైనా మాజీ చైర్మన్, ఎవర్‌బ్రైట్ గ్రూప్ హెడ్ వంటి బడా బాబులకు కూడా జైలు శిక్షలు పడ్డాయి. అయితే కొందరు మాత్రం జిన్ పింగ్ తన రాజకీయ ప్రత్యర్థులను అడ్డు తొలగించుకోవడానికే ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శిస్తున్నారు.
This post was last modified on December 10, 2025 8:27 am
ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…
నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…
ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…
సహజంగా ఏ కేసులో అయినా.. నిందితులు లేదా అనుమానితులను పోలీసులు ప్రశ్నిస్తారు. ముందు మాటలతో.. తర్వాత తమదైన లాఠీ శైలితోనూ…
ఒక ఊరు నుంచి మరో ఊరుకు జాతీయ రహదారి(హైవే)పై ప్రయాణించే సమయంలో టోల్ గేట్లు దాటడం తప్పనిసరి. ఈ టోల్…