అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వాణిజ్య యుద్ధానికి తెరలేపారు. భారత్ సహా వియత్నాం, థాయిలాండ్ నుంచి వచ్చే బియ్యంపై అదనపు పన్నులు వేస్తానని హెచ్చరించారు. అయితే ఈ వార్నింగ్ చూసి మన ఎగుమతిదారులు ఏమాత్రం కంగారు పడటం లేదు. ట్రంప్ నిర్ణయం వల్ల ఇండియాకు పెద్దగా నష్టం ఉండదని, అసలు దెబ్బతినేది అమెరికా ప్రజలేనని వారు తేల్చి చెబుతున్నారు. అక్కడి బిర్యానీ ప్రియుల జేబులకు చిల్లు పడటం ఖాయమని అంటున్నారు.
గణాంకాలు చూస్తే.. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి అమెరికాకు దాదాపు 337 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 2800 కోట్లు) విలువైన బాస్మతి బియ్యం ఎగుమతి అయ్యింది. అదే సమయంలో నాన్ బాస్మతి బియ్యం ఎగుమతులు కేవలం 54 మిలియన్ డాలర్లు మాత్రమే. దీన్ని బట్టి చూస్తే అమెరికా మార్కెట్‌లో మన బాస్మతికి ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద మనం ఏటా దాదాపు 390 మిలియన్ డాలర్ల బియ్యాన్ని అమెరికాకు పంపిస్తున్నాం.
అసలు విషయం ఏంటంటే.. అమెరికాలో పండే బియ్యం మన బాస్మతికి సాటిరాదు. మన బాస్మతి వాసన, రుచి, ఆకృతి అక్కడ దొరకదు. అమెరికాలో ఉండే భారతీయులు, ఆసియా వాసులు బిర్యానీలు, పులావ్‌ల కోసం కచ్చితంగా ఇండియన్ బాస్మతినే వాడతారు. కాబట్టి ట్రంప్ పన్ను పెంచినా సరే, ఎక్కువ రేటు పెట్టి మరీ జనం కొంటారు తప్ప, వేరే బియ్యానికి మారరు. దీనివల్ల అంతిమంగా భారం పడేది కస్టమర్ల మీదే.
గతంలో పన్ను 10 శాతంగా ఉండేది, దాన్ని పెంచినప్పుడు కూడా ఎగుమతులు తగ్గలేదు. పెరిగిన ధరను వినియోగదారులే భరించారు. మన రైతులకు, వ్యాపారులకు రావాల్సిన లాభాలు యథావిధిగా వచ్చాయి. ఇప్పుడు కూడా అదే జరుగుతుందని ఎగుమతిదారులు నమ్మకంగా ఉన్నారు. మన బియ్యం అక్కడ “డంపింగ్” అవుతోందని ట్రంప్ ఆరోపిస్తున్నా, వాస్తవం మాత్రం వేరేలా ఉంది. మన రైస్ అక్కడి మార్కెట్‌లో ఒక స్పెషల్ బ్రాండ్.
భారత రైస్ ఇండస్ట్రీ చాలా బలంగా ఉందని, కేవలం అమెరికానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మనకు మార్కెట్ ఉందని నిపుణులు అంటున్నారు. ఒకవేళ అమెరికాలో డిమాండ్ తగ్గినా, వేరే దేశాలకు పంపించే సత్తా మనకు ఉంది. కాబట్టి ట్రంప్ ఎంత గట్టిగా అరిచినా, బాస్మతి ఘమఘమలు మాత్రం ఆగేలా లేవు.
This post was last modified on December 9, 2025 10:39 pm
రాజకీయంగా ప్రశాంతంగా ఉండే నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.. ఇప్పటి వరకు ఎవరినీ టార్గెట్ చేయలేదు. తన సతీమణి,…
తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. స్వప్నిస్తున్న తెలంగాణ విజన్ డాక్యుమెంటును తాజాగా మంగళవారం సాయంత్రం ఫ్యూచర్…
రకరకాల ప్రచారాలు, వదంతులు, డిస్కషన్లు, సోషల్ మీడియా తిట్లు, ఎన్నెన్నో కథలు వెరసి గత అయిదు రోజులుగా పెద్ద చర్చగా…
టెస్ట్ సిరీస్ ఓటమి బాధను మరిపిస్తూ వన్డే సిరీస్ గెలిచిన టీమిండియా, ఇప్పుడు టీ20లోనూ అదే జోరు కొనసాగించింది. కటక్లోని…
టెక్ ప్రపంచంలోనే ఒక సంచలన ప్రకటన వెలువడింది. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, భారత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.…
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా ఇవాళ సినీ ప్రముఖులు ఈ సమ్మేళనానికి విచ్చేసారు. అందులో పాల్గొన్న నిర్మాత అల్లు…