Trends

నెంబర్ వన్ చెస్ కింగ్… మనోడి నెక్స్ట్ టార్గెట్ అదే!

ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా నిలిచిన భారత గ్రాండ్ మాస్టర్ డి.గుకేష్ ఇప్పుడు మరో అరుదైన రికార్డుపై కన్నేశాడు. కేవలం వరల్డ్ టైటిల్ గెలిస్తే సరిపోదు, ప్రపంచ ర్యాంకింగ్స్‌లో కూడా నంబర్ వన్ కావాలని పట్టుదలగా ఉన్నాడు. గత 14 ఏళ్లుగా ఆ స్థానంలో పాతుకుపోయిన మాగ్నస్ కార్ల్‌సన్‌ను కిందకు దించి, ఆ సింహాసనాన్ని అధిష్టించడమే తన తదుపరి లక్ష్యం అని సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చాడు.

ప్రస్తుతం గుకేష్ ర్యాంకు పదిలో ఉంది. డింగ్ లిరెన్‌ను ఓడించి ఛాంపియన్ అయినా, 2025 ఏడాది అతనికి కాస్త ఒడిదుడుకులుగానే సాగింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కెరీర్ బెస్ట్ ర్యాంక్ మూడుకు చేరుకున్నా, తర్వాత వెనకబడ్డాడు. తాజాగా ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ, నంబర్ వన్ స్థానం కోసం నా శాయశక్తులా ప్రయత్నిస్తాను, ఫలితం ఏదైనా నా ప్రయత్నంలో లోపం ఉండదని చాలా మెచ్యూర్డ్ గా సమాధానం చెప్పాడు.

రాబోయే వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో తన తోటి భారతీయ ఆటగాడు ప్రజ్ఞానందాతో తలపడాలని ఉందని గుకేష్ మనసులో మాట బయటపెట్టాడు. ఇప్పటికే ప్రజ్ఞానందా 2026 కాండిడేట్స్ టోర్నీకి అర్హత సాధించాడు. ఒకవేళ కాండిడేట్స్ టోర్నీలో ప్రజ్ఞానందా గెలిస్తే, టైటిల్ పోరులో ఇద్దరు భారతీయులే తలపడే అద్భుత దృశ్యం మనం చూడొచ్చు.

ఇదిలా ఉంటే కాండిడేట్స్ ఎంపిక విధానంపై ఇప్పుడు పెద్ద రచ్చ జరుగుతోంది. అమెరికన్ ప్లేయర్ హికారు నకమురా అర్హత సాధించడానికి చిన్న చిన్న టోర్నీలు ఆడాల్సి వచ్చింది. దీనిపై కార్ల్‌సన్ ఫిడే (FIDE) తీరును తప్పుబట్టాడు. ప్రపంచంలోనే బెస్ట్ ప్లేయర్స్ అని తెలిసాక కూడా, ఇలా రూల్స్ పేరుతో చిన్న టోర్నీలు ఆడించడం పిచ్చితనమని మండిపడ్డాడు.

ఏది ఏమైనా భారతీయ చెస్ ఇప్పుడు గోల్డెన్ పీరియడ్‌లో ఉంది. ఒకపక్క గుకేష్ నంబర్ వన్ సీటు కోసం వేట మొదలుపెట్టడం, మరోపక్క ప్రజ్ఞానందా దూసుకురావడం చూస్తుంటే రాబోయే రోజుల్లో చెస్ ప్రపంచాన్ని భారతీయులే ఏలబోతున్నారని అర్థమవుతోంది. కార్ల్‌సన్ 14 ఏళ్ల సామ్రాజ్యాన్ని గుకేష్ ఎప్పుడు కూల్చేస్తాడో చూడాలి.

This post was last modified on December 9, 2025 9:42 am

Share

Recent Posts

చిరు ఓదెల… వాయిదా పడిన అభిమానుల కల

ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…

3 hours ago

చంద్రబాబు, పవన్ భేటీలో సీట్లు ఖరారయ్యాయా…?

మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…

3 hours ago

పోలీస్ కమిషనరేట్ గా రాజమండ్రి!

రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…

3 hours ago

రక్తపాతానికి దూరంగా నాని ప్రయాణం

హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…

3 hours ago

హనుమాన్ ఆశీర్వాదం భారీగా దక్కాలి

బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…

5 hours ago

విశ్వంభర తలుపులు తెరుచుకుంటున్నాయా

2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…

7 hours ago