సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కానీ ఢిల్లీకి చెందిన ఒక వ్యక్తి మాత్రం తన తెలివితేటలతో ఒక స్కామర్‌ని బురిడీ కొట్టించి, అతన్ని ఏడ్పించాడు. దీనికి అతను వాడింది లేటెస్ట్ టెక్నాలజీ ChatGPT. తనకు ఫేస్బుక్‌లో పరిచయమైన ఒక కాలేజీ సీనియర్ పేరుతో ఒక స్కామర్ వల వేశాడు. తానొక ఐఏఎస్ ఆఫీసర్ అని, తన ఫ్రెండ్ సీఆర్పీఎఫ్ ఆఫీసర్ ట్రాన్స్‌ఫర్ అవుతున్నాడని, అందుకే ఫర్నిచర్ చౌకగా అమ్ముతున్నాడని నమ్మబలికాడు.
అయితే, ఆ మెసేజ్ చూడగానే ఢిల్లీ కుర్రాడికి డౌట్ వచ్చింది. వెంటనే తన సీనియర్‌కి వాట్సాప్‌లో మెసేజ్ చేసి కనుక్కోగా, అది ఫేక్ అని తేలింది. కానీ ఇతను అక్కడితో ఆగలేదు. స్కామర్‌కి బుద్ధి చెప్పాలనుకున్నాడు. ఫర్నిచర్ ఫోటోలు పంపి, వెంటనే డబ్బు పంపమని స్కామర్ ఒత్తిడి చేస్తుండటంతో, ఇతను ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. “చాట్‌జీపీటీ” సాయంతో ఒక ఫేక్ పేమెంట్ పోర్టల్ కోడ్ రాశాడు.
ఆ వెబ్‌సైట్ చూడటానికి అచ్చం పేమెంట్ గేట్‌వే లాగే ఉంటుంది కానీ, అసలు పని వేరే. ఎవరైనా ఆ లింక్ ఓపెన్ చేస్తే చాలు, వారి లొకేషన్, ఐపీ అడ్రస్, అంతెందుకు వాళ్ల ఫ్రంట్ కెమెరా నుంచి ఫోటో కూడా తీసుకునేలా సెటప్ చేశాడు. “డబ్బులు పంపడానికి ఈ లింక్‌లో క్యూఆర్ కోడ్ అప్‌లోడ్ చెయ్” అని స్కామర్‌కి పంపాడు. డబ్బు ఆశతో ఆ స్కామర్ లింక్ క్లిక్ చేయగానే.. అతని ఫోటో, లొకేషన్ మొత్తం ఈ కుర్రాడి చేతికి వచ్చేశాయి.
అంతే.. సీన్ రివర్స్ అయ్యింది. ఆ స్కామర్ ఫోటోను, అతని అడ్రస్‌ను తిరిగి అతనికే పంపి “నిన్ను పట్టేసుకున్నా” అని చెప్పాడు. దీంతో స్కామర్ గుండె ఆగినంత పనైంది. వెంటనే వేరు వేరు నంబర్ల నుంచి కాల్ చేసి, “ప్లీజ్ వదిలేయండి సార్.. ఇకపై ఇలాంటి పనులు చేయను, మానేస్తాను” అంటూ బతిమిలాడటం మొదలుపెట్టాడు. దొంగను పట్టుకుని, వాడినే భయపెట్టి ఆడుకోవడంలో కిక్కే వేరప్పా అని ఆ కుర్రాడు రెడిట్ లో తన అనుభవాన్ని పంచుకున్నాడు.
స్కామర్లు ఎంత తెలివైన వాళ్లయినా, టెక్నాలజీ తెలిసిన వాళ్ల దగ్గర పప్పులు ఉడకవని ఈ ఘటన నిరూపించింది. స్కామర్‌ని పోలీసులకు పట్టించకపోయినా, అతనికి జీవితంలో మర్చిపోలేని షాక్ ఇచ్చి వదిలేశాడు. “దొంగ దగ్గరే దొంగతనం చేస్తే ఆ మజానే వేరు” అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
This post was last modified on December 4, 2025 3:12 pm
రివ్యూస్, పబ్లిక్ టాక్ బాగున్నప్పటికీ ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయిన ఆంధ్రకింగ్ తాలూకా రెండో వారం నుంచి పికప్ ఆశిస్తున్నామని…
బహుశా బాలకృష్ణ కెరీర్ లోనే ఇది మొదటిసారని చెప్పొచ్చు. ఇంకో రెండు మూడు గంటల్లో షోలు ప్రారంభమవుతాయని అభిమానులు ఎదురు…
నిర్మాతలకు వచ్చే ఆర్థిక చిక్కులు పెద్ద రిలీజులను ఎంత ఇబ్బంది పెడతాయో అఖండ 2 విషయంలో చూస్తున్నాం. అయితే ఇలాంటి…
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…