విమర్శకుల నోళ్లు మూయించాలంటే విరాట్ కోహ్లీ బ్యాట్ మాట్లాడితే చాలు. రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో కింగ్ కోహ్లీ తన విశ్వరూపం చూపించాడు. “ఆట ఇప్పుడే మొదలైంది” అన్నట్లుగా ఆడి ఏకంగా తన 52వ వన్డే సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 37 ఏళ్ల వయసులో కూడా కుర్రాడిలా పరిగెడుతూ, బౌలర్లను ఉతికారేశాడు. 2016-19 నాటి వింటేజ్ కోహ్లీని తలపించిన ఈ ఇన్నింగ్స్ చూసి ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోయారు.
మ్యాచ్ ఆరంభంలోనే యశస్వి జైస్వాల్ ఔట్ అవ్వడంతో క్రీజులోకి వచ్చిన కోహ్లీ, మొదటి బంతి నుంచే అటాకింగ్ మోడ్‌లో ఉన్నాడు. 2027 వరల్డ్ కప్ ఆడతాడా లేదా అనే సందేహాలకు తన బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు. పవర్‌ప్లేలోనే బౌలర్లపై విరుచుకుపడి రెండు భారీ సిక్సర్లు బాదాడు. కెప్టెన్ రోహిత్ శర్మ (57) తో కలిసి 136 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి టీమ్‌ను పటిష్ట స్థితిలో నిలిపాడు. మిడిల్ ఓవర్లలో స్లో అవుతాడనే విమర్శలకు చెక్ పెడుతూ, స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు.
38వ ఓవర్లో జాన్సన్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత కోహ్లీ సెలబ్రేషన్ చూస్తే గూస్‌బంప్స్ రావాల్సిందే. గట్టిగా గర్జిస్తూ, ఆకాశం వైపు చూసి దండం పెట్టి, తన లక్కీ లాకెట్‌ని ముద్దాడాడు. ఈ సమయంలో ఒక వీరాభిమాని మైదానంలోకి దూసుకొచ్చి కాస్త టెన్షన్ పెట్టాడు. కోహ్లీ కాళ్లకు నమస్కరించడం హైలైట్. అయితే అతను కోహ్లీని గట్టిగా పట్టుకునే ప్రయత్నం చేశాడు. ఇక కోహ్లీ అతన్ని లేపి పంపించే లోపే సెక్యూరిటీ సిబ్బంది వచ్చి తీసుకెళ్లారు. ధోని సొంతగడ్డ రాంచీలో కోహ్లీకి ఇది మూడో సెంచరీ కావడం విశేషం.
చివరికి 135 పరుగుల వద్ద బర్గర్ బౌలింగ్‌లో ఔట్ అయిన కోహ్లీ, అప్పటికే తన పని పూర్తి చేశాడు. 11 ఫోర్లు, 7 సిక్సర్లతో సఫారీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. టెస్టులు, టీ20లకు గుడ్ బై చెప్పిన తర్వాత కోహ్లీ ఫ్యూచర్‌పై ఎన్నో ఊహాగానాలు వచ్చాయి. గంభీర్, అగార్కర్ మీటింగ్ పెట్టి అతని భవిష్యత్తు డిసైడ్ చేస్తారనే వార్తలు వచ్చాయి. కానీ, ఈ సెంచరీతో కోహ్లీ తన స్థానం పదిలమేనని స్ట్రాంగ్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు.
గత నెల ఆస్ట్రేలియా సిరీస్‌లో రెండు డకౌట్ల తర్వాత విమర్శల పాలైన కోహ్లీ, సిడ్నీలో 74 పరుగులతో ఫామ్‌లోకి వచ్చాడు. ఇప్పుడు రాంచీలో సెంచరీతో తన సత్తా ఏంటో మరోసారి నిరూపించాడు. ఫిట్‌నెస్, ఫామ్ విషయంలో తనను ఎవరూ ప్రశ్నించలేరని ఈ ఇన్నింగ్స్‌తో క్లియర్ కట్ మెసేజ్ ఇచ్చాడు. 2027 వరల్డ్ కప్ రేసులో తాను ముందుంటానని చెప్పకనే చెప్పాడు.
This post was last modified on November 30, 2025 6:14 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…