Trends

గూగుల్‌ను కుదిపేస్తున్న.. ‘మ‌ద‌ర్ ఆఫ్ సైతాన్‌’: ఏంటిది?

ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా గూగుల్‌ను కుదిపేస్తున్న అంశం.. ‘మ‌ద‌ర్ ఆఫ్ సైతాన్‌’. ఏంటిది? ఎందుకు? ఎలా ఆవిర్భ‌వించింది? దీనివెనుక ఎవ‌రు ఉన్నారు? ఇలా.. అనేక అంశాల‌ను నెటిజ‌న్లు తెగ‌వెతికేస్తున్నారు. దీనికి కార‌ణం.. దేశంలో గ‌త నాలుగు రోజులుగా తీవ్ర చ‌ర్చ‌కు.. భ‌యానికి కూడా దారి తీసిన ఎర్ర కోట కారు పేలుడు ఘ‌ట‌నే. ఈ ఘ‌ట‌న జ‌రిగి దాదాపు ఐదు రోజులు అయింది. అయినా.. దాని తాలూకు ప్రకంప‌న‌లు ఇంకా కొన‌సాగుతూనే ఉన్నాయి.

దీనికి కూడా కార‌ణం ఉంది. ఈ ఘ‌ట‌న‌కు సూత్ర ధారులు.. ఎవ‌రైనా పాత్ర ధారులు మాత్రం అత్యున్నత వైద్య విద్య‌ను చ‌దువుకున్న‌వారే కావ‌డం కార‌ణం. అంతేకాదు.. ఈ దాడుల‌కు మందుగుండు సామాగ్రిని త‌యారు చేసిన వైద్యులు.. అత్యంత ప్ర‌తిభావంతుల‌ని అధికారులు గుర్తించారు. ప్రొఫెస‌ర్లుగా, డీన్‌లు గా వారు వైద్య వృత్తిలో ఉన్నారు. అలాంటి వారు దేశానికి హాని త‌ల‌పెట్టేందుకు చేప‌ట్టిన ఆప‌రేష‌న్ పేరే.. ‘మ‌ద‌ర్ ఆఫ్ సైతాన్‌’.

భార‌త దేశాన్ని వీరు సైతాన్‌తో పోల్చార‌ని అధికారులు భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో దేశంలో ప‌లు చోట్ల విద్వంసాలు సృష్టించేందుకు అనేక ప్ర‌యోగాలు చేశారు. కీల‌క ర‌సాయ‌నాన్ని రూపొందించారు. దీనిని మ‌ద‌ర్ ఆఫ్ సైతాన్‌గా పిలుస్తున్న‌ట్టు అధికారులు భావిస్తున్నారు. దీనిని బ‌హిరంగ ప్ర‌దేశాలు.. ఆల‌యాలు, ఇత‌ర హిందూ సామాజిక వ‌ర్గం చేరుచుకునే ప్రాంతాల్లోని తాగు నీటిలో క‌ల‌ప‌డం ద్వారా సామూహిక హ‌న‌నాల‌కు ప‌క్కా ప్ర‌ణాళిక ర‌చించారు.

అదేవిధంగా దీనిని పేలుడు ప‌దార్థంగా కూడా వినియోగించుకోవ‌చ్చు. పేరెన్నిక‌గ‌న్న వైద్యులు, ప్ర‌స్తుతం ఉగ్ర‌ముఠాతో చేతులు క‌లిపినవారు.. తమకు ఉన్న జ్ఞానంతో ‘మదర్‌ ఆఫ్‌ సైతాన్‌’గా పిలిచే రసాయన సమ్మేళనాన్ని వాడేందుకు సిద్ధం చేశారు. వాస్త‌వానికి ‘ట్రైఅసిటోన్‌ ట్రైపెరాక్సైడ్ ‘ అనే ర‌సాయ‌నం అత్యంత ప్ర‌మాద‌క‌రం. దీనికి ర‌సాయన భాష‌లో ఎలాంటి పేరు ఉన్నా.. దీనిని మ‌ద‌ర్ఆఫ్ సైతాన్‌గా భావిస్తారు. డాక్టర్ల బృందం ఈ ర‌సాయ‌నాన్ని అమ్మోనియం నైట్రైట్‌తో కలిపి పేలుడు పదార్థాన్ని సిద్ధం చేసింది. దీనిని భ‌ద్ర‌తా బ‌ల‌గాలు స్వాధీనం చేసుకున్నాయి.

This post was last modified on November 16, 2025 4:14 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పెద్ద ప్రభాస్ రిటర్న్స్… టికెట్ ధరలు నార్మల్

నిన్న విడుదలైన ది రాజా సాబ్ అభిమానుల అంచనాలకు తగ్గట్టే సెంచరీతో ఓపెనింగ్స్ మొదలుపెట్టింది. నిర్మాత విశ్వప్రసాద్ సక్సెస్ మీట్…

2 minutes ago

శ్రీలీల కోరుకున్న బ్రేక్ దొరికిందా

సెన్సార్ ఇష్యూతో పాటు థియేటర్ల కొరత కారణంగా తమిళ మూవీ పరాశక్తి మన దగ్గర విడుదల కాలేదు. ఒక వారం…

38 minutes ago

ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయితే రచ్చే

రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…

2 hours ago

ప్రతిచోట చీపురు పట్టుకొని పవన్ ఊడవాలా?

పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…

4 hours ago

విమర్శకులను పనితీరుతో కొడుతున్న లోకేష్..!

తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…

6 hours ago

రండి.. కూర్చుని మాట్లాడుకుందాం: ఏపీకి రేవంత్ రెడ్డి పిలుపు

ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…

6 hours ago