గత కొన్ని రోజులుగా ఆ వ్యాక్సిన్.. కరోనాపై ఇంత శాతం విజయవంతంగా పని చేస్తోందట.. ఈ వ్యాక్సిన్ ఇంత సక్సెస్‌ఫుల్‌గా ఉందట అని వార్తలు చూస్తూనే ఉన్నాం. ఆక్స్‌ఫర్డ్, ఆస్ట్రాజెనికా, ఫైజర్ లాంటి సంస్థలు తయారు చేసిన వ్యాక్సిన్‌లు 60 నుంచి 95 శాతం వరకు కరోనా వైరస్‌ను నియంత్రిస్తున్నట్లు అంతర్జాతీయంగా కథనాలు వచ్చాయి.
కాగా ఇప్పుడు అమెరికా సంస్థ మోడర్నా తయారు చేస్తున్న వ్యాక్సిన్ ప్రయోగ ఫలితాలు వెల్లడయ్యాయి. తీవ్ర స్థాయి కరోనా రోగులకు ఈ వ్యాక్సిన్ ఇవ్వగా అది నూటికి నూరు శాతం సానుకూల ఫలితాలు ఇచ్చినట్లుగా ఆ సంస్థ వెల్లడించింది. ఇది ప్రపంచానికి గొప్ప శుభవార్తే అని చెప్పాలి. ఐతే కానీ అందరికీ ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేస్తుందని సంబరపడాల్సిన పనైతే లేదు.
ముఖ్యంగా భారతీయులకు ఈ వ్యాక్సిన్ దక్కే అవకాశాలే లేవు. ఎందుకంటే ఈ వ్యాక్సిన్ ధర చాలా ఎక్కువ. మామూలుగా కరోనా వ్యాక్సిన్ డోస్ ప్రతి వ్యక్తికీ రెండుసార్లు వేయాల్సి ఉండగా.. మోడర్నా వ్యాక్సిన్ఒక్క డోస్ 32 నుంచి 37 డాలర్ల దాకా ఉండబోతున్నట్లు సమాచారం. వ్యాక్సిన్ తయారు చేస్తున్న అన్ని దేశాలతో సంప్రదింపులు జరుపుతున్న భారత ప్రభుత్వం.. మోడర్నాతో కూడా ఇంతకుముందే మాట్లాడింది. ఐతే వాళ్లు ఆ ధరకు తగ్గేది లేదనడంతో వారితో ఒప్పందం చేసుకోలేదు.
ఒక్క డోస్ కోసం అటు ఇటుగా రూ.2500, రెండు డోస్‌ల కోసం రూ.5 వేలు ఖర్చు చేయాలంటే కష్టమే. అంత ధరతో వ్యాక్సిన్ తెచ్చి సామాన్యులకు అందించడం ప్రభుత్వాలకు పెనుభారమే అవుతుంది. నిజానికి భారత్ ఈ ధరలో పది శాతానికి ఒక్క వ్యాక్సిన్ డోస్ కొనాలని చూస్తోంది. అస్ట్రాజెనికా వ్యాక్సిన్ ధర భారత్ కోరుకున్నట్లే 3-4 డాలర్ల మధ్య ఉండే అవకాశాలున్నాయి. ఇలా తక్కువ ధరకు వ్యాక్సిన్ ఇచ్చే సంస్థల వైపు భారత్ చూస్తోంది. దీంతో పాటుగా దేశీయంగా భారత్ బయోటెక్ సహా కొన్ని సంస్థలు కరోనా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ముమ్మర కృషి చేస్తున్న సంగతి తెలిసిందే.
This post was last modified on December 1, 2020 10:12 am
ప్రజా గాయకుడు గద్దర్ కు పద్మ అవార్డుల వ్యవహారంలో ఘాటు వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్… బీజేపీ,…
వైసీపీ కీలక నేత వేణుంబాక విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానంటూ ప్రకటించి కలకలం రేపారు కదా. ప్రకటించినట్లుగానే ఆయన తన…
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 నెలలు గడుస్తున్నా సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడం లేదని వైసీపీ నేతలు…
ఏపీలో కూటమి ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన తర్వాత.. రాష్ట్రానికి పోయిన పేరును తీసుకువచ్చేందుకు.. గత ప్రాభవం నిలబెట్టేందుకు కూటమి పార్టీలు…
అప్పుడెప్పుడో ఇంగ్లాండ్ మ్యాచ్ లో యువరాజ్ సింగ్ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టినట్టు బాక్సాఫీస్ వద్ద సంక్రాంతికి వస్తున్నాం…
గేమ్ ఛేంజర్ ఫలితం తేలిపోవడంతో మెగాభిమానుల దృష్టి ఆర్సి 16 వైపుకు వెళ్తోంది. తాజాగా మూడో షెడ్యూల్ మొదలుపెట్టిన దర్శకుడు…