47 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఎట్టకేలకు మహిళల వన్డే ప్రపంచకప్‌ను సాధించింది భారత్. 1973లో ప్రపంచకప్ ఆరంభం కాగా.. 1978 నుంచి మన జట్టు ఆ టోర్నీలో పోటీ పడుతోంది. 2005, 2017 ప్రపంచకప్‌ల్లో ఫైనల్ చేరినా కప్పు గెలవలేకపోయిన ఇండియా.. మూడో ప్రయత్నంలో తుదిపోరులో గెలిచింది. ఆదివారం దక్షిణాఫ్రికాపై అద్భుత విజయంతో కప్పును సొంతం చేసుకుంది. పురుషుల జట్టు ఐసీసీ ట్రోఫీ గెలిస్తే ఇండియా అంతా ఎలా సెలబ్రేట్ చేసుకుంటుందో.. అమ్మాయిల విజయంతో కూడా అలాగే సంబరాలు జరుగుతున్నాయి.
నిన్న రాత్రి దేశంలో ప్రతి క్రికెట్ అభిమానీ మ్యాచ్ చూసి ఉంటారనడంలో సందేహం లేదు. మనమ్మాయిలు కప్పు గెలిచినపుడు సంబరాలు మిన్నంటాయి. సమష్టి ప్రదర్శనతో ట్రోఫీ సాధించిన అమ్మాయిలపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌ను కూడా అందరూ కొనియాడుతున్నారు. ఐతే కప్పు అందుకున్న సమయంలో ఆమె ప్రవర్తించిన తీరు మాత్రం చాలామందికి నచ్చట్లేదు.
ప్రపంచకప్ ట్రోఫీని ఐసీసీ ఛైర్మన్ హోదాలో జై షా.. హర్మన్‌కు అందించాడు. ఆ సమయంలో ముందుగా జై షాకు షేక్ హ్యాండ్ ఇచ్చిన హర్మన్.. తర్వాత ఆశ్చర్యకరంగా అతడికి పాదాభివందనం చేయబోయింది. కానీ జై షానే ఆమెను వారించాడు. ఆ సమయంలో హర్మన్ అలా చేయాల్సిన అవసరమే లేదు. ఇంతకుముందు మహిళల్లో అయినా, పురుషుల్లో అయినా కప్పు గెలిచిన ఏ కెప్టెన్ ఇలా చేసి ఉండరు అంటే ఆశ్చర్యం లేదు. జై షాకు స్వతహాగా కొన్నేళ్ల ముందు వరకు క్రికెట్లో కానీ, క్రికెట్ అడ్మినిస్ట్రేషన్లో కానీ ఏమీ అనుభం లేదు. కానీ కేంద్ర హోం మంత్రి అమిత్ షా కొడుకు అనే అర్హతతో అతను అనూహ్యంగా బీసీసీఐలోకి వచ్చి చక్రం తిప్పాడు.
బీసీసీఐ కార్యదర్శిగా నాలుగేళ్లు పని చేశాడు. కొన్ని నెలల కిందటే ఐసీసీ ఛైర్మన్ కూడా అయ్యాడు. ప్రతిభ లేకున్నా హోం మంత్రి కొడుకు కావడం వల్లే అతనీ స్థాయిలో ఉన్నాడన్నది బహిరంగ రహస్యం. ఇక తన పబ్లిసిటీ పిచ్చి గురించి అందరికీ తెలిసిందే. కొన్ని నెలల కిందట దక్షిణాఫ్రికా జట్టు ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ గెలిస్తే.. విన్నింగ్ సెలబ్రేషన్స్‌కు సంబంధించి ఐసీసీ నుంచి ఒక వీడియో బయటికి వచ్చింది. అందులో గెలిచిన జట్టు కంటే జై షానే హైలైట్ అయ్యాడు. జట్టు అద్భుత ప్రదర్శనతో సగర్వంగా కప్పును అందుకోబోతున్న సమయంలో హర్మన్.. ఇలాంటి నేపథ్యం ఉన్న వ్యక్తి కాళ్లు మొక్కే ప్రయత్నం చేయడం క్రికెట్ అభిమానులకు ఏమాత్రం రుచించడం లేదు.
This post was last modified on November 3, 2025 5:25 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…