భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉంటే.. వన్డేలు, టీ20ల్లో జట్టు వైస్ కెప్టెన్ అయిన రోహిత్ శర్మ ఇండియాలో ఉన్నాడు. అతను గాయం కారణంగా ఆస్ట్రేలియా పర్యటనకు ఇంకా వెళ్లని సంగతి తెలిసిందే. టెస్టు సిరీస్.. అది కూడా చివరి రెండు మ్యాచ్‌ల కోసం వచ్చే నెల అతను ఆస్ట్రేలియాకు వెళ్లే అవకాశముంది. ఇప్పుడైతే గాయం నుంచి కోలుకుని ఫిట్‌నెస్ సాధించే పనిలో ఉన్నాడతను.
ఐతే ఆదివారం భారత జట్టు.. ఆస్ట్రేలియాతో రెండో టీ20 ఆడగా ఆ మ్యాచ్‌లో ఆడిన ఆటగాళ్లు కాదని.. రోహిత్ శర్మ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాడు. అతడి పేరు ఇండియా, వరల్డ్ లెవెల్లో ట్రెండ్ అయింది. అలాగే కెప్టెన్సీ అనే పదం సైతం టాప్ ట్రెండింగ్స్‌లో కనిపించింది. ఇందుకు కారణాలు లేకపోలేదు.
ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్ జట్టుకు ఒకటికి ఐదు ట్రోఫీలు అందించిన ఘనత రోహిత్ శర్మది. ఆ జట్టు బలంగా ఉన్నప్పటికీ.. రోహిత్ కెప్టెన్సీ కూడా జట్టు విజయాల్లో కీలకం అన్నది స్పష్టం. ఐతే ఈ టోర్నీలో కోహ్లి నాయకత్వంలోని బెంగళూరు ఒక్క టైటిల్ కూడా గెలవలేదు. ఇది చూపించే కోహ్లి కంటే రోహిత్ ఉత్తమ కెప్టెన్ అంటుంటారు. ఐతే అంతర్జాతీయ స్థాయిలో కోహ్లి కెప్టెన్సీ రికార్డు బాగానే ఉండటంతో బండి నడిచిపోతోంది. అతను ఫెయిలైనపుడల్లా రోహిత్‌కు కెప్టెన్సీ ఇవ్వాలన్న డిమాండ్ వస్తుంటుంది.
మొన్నటి ఐపీఎల్ టైంలో కోహ్లిని తప్పించి టీ20ల్లో రోహిత్‌కు కెప్టెన్సీ ఇవ్వాలన్న అభిప్రాయం బలంగా వినిపించగా.. ఇప్పుడది మరింత ఊపందుకుంది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా చేతిలో చిత్తవడం, కోహ్లి కెప్టెన్సీ పేలవంగా కనిపించడం.. తొలి మ్యాచ్‌లో విఫలమయ్యాక కూడా తన బెంగళూరు టీమ్ మేట్స్ సైని, చాహల్‌లను కొనసాగించడం.. నటరాజన్, కుల్‌దీప్‌లకు అవకాశం ఇవ్వకపోవడంతో కోహ్లిని తిట్టిపోస్తున్న నెటిజన్లు.. రోహిత్‌కు కెప్టెన్సీ ఇవ్వాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే #rohitsharma.. #captaincy.. హ్యాష్ ట్యాగ్స్ టాప్‌లో ట్రెండ్ అయ్యాయి.
This post was last modified on November 30, 2020 7:19 am
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…