ఇండియన్ ప్రిమియర్ లీగ్‌లో పేరు గొప్ప ఊరు దిబ్బ అనిపించిన ప్లేయర్లు చాలామందే ఉన్నారు. భారీ రేటు పెట్టి తమను సొంతం చేసుకున్న ఫ్రాంఛైజీలను వాళ్లు దారుణంగా దెబ్బ కొట్టారు. ఐపీఎల్ చరిత్రలోనే రికార్డు రేటు పెట్టి కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫ్రాంఛైజీ దక్కించుకున్న ప్యాట్ కమిన్స్ ఎలా తుస్సుమనిపించాడో తెలిసిందే. ఈ కోవలో చాలామందే ఉన్నారు.
ఐతే ఐపీఎల్‌లో సరిగా ఆడని ఆటగాళ్లు.. జాతీయ జట్టు తరఫున మెరుస్తుండటం ఇప్పుడు ఆశ్చర్యానికి గురి చేస్తోంది. నిన్నటి ఇండియా-ఆస్ట్రేలియా మ్యాచే ఇందుకు నిదర్శనం. ఐపీఎల్‌లో కోహ్లి నాయకత్వం వహించే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఓపెనర్‌గా ఆరోన్ ఫించ్ ఎంత పేలవ ప్రదర్శన చేశాడో తెలిసిందే. ఆ వైఫల్యాలు చూసి అతను ఫామ్‌లో లేడని అంతా అనుకున్నారు.
కానీ ఆస్ట్రేలియాకు వన్డే, టీ20 జట్లలో కెప్టెన్ అయిన ఫించ్.. అంతర్జాతీయ మ్యాచ్ అనగానే ఎక్కడ లేని బాధ్యతతో ఆడేశాడు. భారత్‌తో తొలి వన్డేలో ఎంతో నిలకడగా ఆడి సెంచరీ సాధించాడు. 114 పరుగులతో టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. ఇక ఇదే మ్యాచ్‌లో గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఎలా చెలరేగిపోయాడో తెలిసిందే. కేవలం 19 బంతుల్లో అతను 45 పరుగులు చేశాడు. చివర్లో అతడి మెరుపులే ఆస్ట్రేలియాకు రికార్డు స్కోరు సాధించి పెట్టాయి. ఐతే ఈ మ్యాక్స్‌వెల్ ఐపీఎల్‌లో పంజాబ్ తరఫున దారుణమైన ప్రదర్శన చేశాడు. టోర్నీ మొత్తంలో అతను ఒక్క అర్ధశతకం కూడా చేయలేదు. ఒక్కటంటే ఒక్క సిక్సర్ కూడా కొట్టలేదు. ఇండియా మీద మాత్రం ఆడిన 19 బంతుల్లోనే మూడు సిక్సర్లు బాదాడు.
మరోవైపు పంజాబ్ ఆటగాడే అయిన జిమ్మీ నీషమ్.. శుక్రవారం న్యూజిలాండ్ తరఫున చెలరేగి ఆడాడు. వెస్టిండీస్‌తో 24 బంతుల్లోనే 48 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. ఐపీఎల్‌లో ఫెయిలైన ఆటగాళ్లు జాతీయ జట్ల తరఫున ఇలా చెలరేగిపోవడంపై సోషల్ మీడియాలో బోలెడన్ని మీమ్స్ వస్తున్నాయి. బ్రహ్మిని వాడుకుని మనోళ్లు చేస్తున్న కామెడీ చూస్తే కడుపు చెక్కలవ్వాల్సిందే.
This post was last modified on November 28, 2020 5:13 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…