ఆసియా కప్ 2025లో పాక్ తో దుబాయ్ వేదికగా జరిగిన పోరులో టీమిండియా ఘన విజయాన్ని అందుకుంది. అయితే, ఈ విజయానంతరం చోటుచేసుకున్న ఒక సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. మ్యాచ్ తర్వాత సాధారణంగా ఇరుజట్ల ఆటగాళ్లు ఒకరికొకరు హ్యాండ్‌షేక్ చేసుకుంటారు. కానీ ఈసారి మాత్రం భారత ఆటగాళ్లు డైరెక్ట్ గా డ్రెస్సింగ్ రూమ్ తలుపులు మూసుకుని లోపలికి వెళ్లిపోవడం గమనార్హం.
మ్యాచ్ జరుగుతున్న సమయంలో టీమిండియా ప్లేయర్స్ ఎక్కడా కూడా పాక్ ఆటగాళ్లతో మాట్లాడలేదు. గతంలో అయితే ఏదో ఒక మాట సాగేది. కానీ ఈసారి ఎవరు కూడా కనీసం చూపు కూడా కలవినవ్వలేదు. ఇక మ్యాచ్ అనంతరం పాకిస్థాన్ ఆటగాళ్లు హ్యాండ్‌షేక్ కోసం ఎదురు చూసినా అది జరగలేదు. సూర్యకుమార్ యాదవ్ బౌండరీతో విన్నింగ్ షాట్ కొట్టేసి నేరుగా పెవిలియన్‌లోకి వెళ్లిపోయాడు.
మిగతా ఆటగాళ్లు కూడా అదే తరహాలో లోపలికి వెళ్లిపోవడంతో, మ్యాచ్ అనంతరం ఇరుజట్ల మధ్య ఎలాంటి హ్యాండ్‌షేక్ జరగలేదు. పైగా అందరూ ఒకేసారి డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లి డోర్స్ క్లోజ్ చేసుకున్నారు. ఈ నిర్ణయం వెనుక ఆటగాళ్లు క్లారిటీతో ఉన్నట్లు అర్ధమయ్యింది. అభిమానులు మాత్రం దీన్ని పాక్‌కు ఇచ్చిన స్పష్టమైన కౌంటర్‌గా భావిస్తున్నారు.
ఇప్పటికే పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాక్‌తో సంబంధాలు తెంచుకోవాలని డిమాండ్లు వస్తున్నాయి. సోషల్ మీడియాలో బీసీసీఐను కూడా టార్గెట్ చేస్తూ విమర్శలు వెల్లువెత్తాయి. కానీ ICC ట్రోపి కావడంతో బీసీసీఐ వెనక్కి తగ్గలేని పరిస్థితి ఏర్పడింది. ఇక మైదానంలో టీమిండియా ఆటగాళ్లు గెలుపుతోనే, కౌంటర్ ఇవ్వాలని చూపించారు. ఇక డోర్స్ మూసుకోవడం, హ్యాండ్‌షేక్‌ను తిరస్కరించడం అభిమానులకు బాగా నచ్చింది.
క్రీడల ద్వారా స్నేహం, సఖ్యత అనే విషయాలు తరచూ ప్రస్తావనకు వస్తాయి. కానీ ఉగ్రదాడులు, సరిహద్దు ఉద్రిక్తతలతో పాకిస్తాన్ విషం కక్కుతూనే ఉంది. దానికి తోడు పాకిస్థాన్ ఆటగాళ్లలో కొందరు వెటకారంగా భారత్ పై కామెంట్స్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి అలాంటి వాళ్లకు ఇలా జరగాల్సిందే అనే కామెంట్స్ వస్తున్నాయి. ఇక సైలెంట్ గా SKY సేన మ్యాచ్ ఫీనిషింగ్ టచ్ తో కౌంటర్ ఇచ్చి వచ్చేసింది. అయితే ఈ ఏషియా కప్ లో పాక్ మెరుగ్గా ఆడితే మళ్ళీ ఫైనల్ లో టీమిండియాకు ఎదురొచ్చే అవకాశం ఉంది. మరి అది జరుగుతుందో లేదో చూడాలి.
This post was last modified on September 15, 2025 6:28 am
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…