భారత ఆర్థిక వ్యవస్థలో కీలకమైన మార్పులు రాబోతున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగబోతోంది. ఈసారి ప్రధాన ఎజెండా.. జీఎస్టీ స్లాబ్‌లను సరళీకరించడం. ఇప్పటివరకు ఉన్న 5%, 12%, 18%, 28% స్లాబ్‌ల బదులుగా కేవలం రెండు రేట్లే ఉండేలా ప్రతిపాదన వచ్చింది. అంటే, 5% – 18% మాత్రమే ఉండి, ఎక్కువ శాతం వస్తువులు ఈ రెండు కేటగిరీల్లోకి వస్తాయి.
ఇకపోతే, ఇప్పటివరకు 28% పన్ను వేసిన 90% వస్తువులు 18% స్లాబ్‌కి మారబోతున్నాయి. అలాగే, 12% ఉన్న వస్తువులలో కొంత భాగం 5%కి వచ్చే అవకాశముంది. దీంతో, ముఖ్యంగా మధ్యతరగతి వినియోగదారులపై భారమయ్యే పన్నులు తగ్గుతాయి. రోజువారీ అవసరాల వస్తువులు చవక అవుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రభుత్వం ఈ మార్పుల వల్ల దాదాపు రూ.50,000 కోట్లు ఆదాయ నష్టం చూడాల్సి ఉంటుందని అంచనా.
ఈ కొత్త మార్పులతో జీవన బీమా, ఆరోగ్య బీమా వంటి రంగాలను కూడా జీఎస్టీ నుంచి మినహాయించాలన్న ప్రతిపాదన ఉంది. ప్రస్తుతం ఇవి 18% పన్ను కిందకి వస్తున్నాయి. మరోవైపు, తంబాకు, లగ్జరీ కార్లు, మద్యం వంటి వాటిపై 40% ‘సిన్ ట్యాక్స్’ పెట్టాలని భావిస్తున్నారు. ఆరోగ్య సెస్, గ్రీన్ ఎనర్జీ సెస్ రూపంలో కొత్త పన్నులు కూడా చర్చకు రానున్నాయి.
ఈ మార్పులు ట్రంప్ విధించిన 50% టారిఫ్ ప్రభావాన్ని కొంతవరకు తగ్గిస్తాయని నిపుణుల అంచనా. అమెరికాకు భారతదేశం నుంచి ఎగుమతి అవుతున్న $48 బిలియన్ విలువైన వస్తువులపై ఈ టారిఫ్‌లు పెద్ద సమస్యగా మారుతున్నాయి. ఇకపోతే జీఎస్టీ రీఫార్మ్స్, ఆదాయ పన్ను తగ్గింపులు కలిపి వినియోగాన్ని రూ.5.31 లక్షల కోట్ల వరకూ పెంచుతాయని ఎస్బీఐ రీసెర్చ్ రిపోర్ట్ చెబుతోంది. ఇది జీడీపీపై 1.6% ప్రభావం చూపనుంది.
అయితే ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు మాత్రం జీఎస్టీ స్లాబ్ మార్పులను సానుకూలంగా చూడడం లేదు. పన్ను ఆదాయం తగ్గుతుందని, దానికి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. తమిళనాడు, పంజాబ్, బెంగాల్ రాష్ట్ర ఆర్థిక మంత్రులు ఈ విషయంపై స్పష్టమైన ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. మొత్తానికి, వినియోగదారులకు ఊరట కలిగించే ఈ కొత్త రూల్స్ ప్రభుత్వానికి ఆర్థిక సవాళ్లు తెచ్చిపెట్టబోతున్నాయనే సంకేతాలు వస్తున్నాయి.
This post was last modified on September 3, 2025 3:31 pm
వైసీపీ ఖాళీ అవుతుంది.. ఈ మాటలు తరచుగా వినిపిస్తున్నాయి. అయితే.. పోయే వారిని పోనీ.. అన్నట్టుగానే పార్టీ అధినేత జగన్…
అర్జున్ రెడ్డితో విజయ్ దేవరకొండ సంపాదించుకున్న యూత్ ఫాలోయింగ్ కి అదనంగా ఫ్యామిలీ ఆడియన్స్ ని జోడించిన బ్లాక్ బస్టర్…
"హలో... ఐ యామ్ చిట్టి. స్పీడ్ వన్ టెరా హెర్ట్జ్, మెమరీ వన్ జెట్టా బైట్!" రజనీకాంత్ రోబో సినిమాలో…
మొన్నటిదాకా వరస డిజాస్టర్లతో మార్కెట్ రిస్క్ లో పడేసుకున్న సూర్య మాములు కంబ్యాక్ ఇవ్వలేదు. అసలు పెద్దగా అంచనాలు లేకుండా…
టాలీవుడ్ స్టార్ హీరోల కొడుకులకు చిన్నతనంలోనే సినిమా పురుగు కుట్టేస్తుంది. బాల నటుడిగానే అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు. ఆ కోవలోనే…
మహిళలు మీసాలు పెంచలేరని.. పురుషులు గర్భాన్ని దాల్చలేరని సామెత!. అయితే.. ఇటీవల కాలంలో రష్యాకు చెందిన ఓ మహిళ మీసాలు…