Trends

రోహిత్ – కోహ్లీ: టెన్షన్ పెట్టిన ఐసీసీ

భారత క్రికెట్ అభిమానులను కుదిపేసే విషయం ఒకటి వైరల్ అవుతోంది. అదేమిటంటే.. ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి పేర్లు ఎక్కడా లేవు. కేవలం టాప్ 10 నుంచి తప్పించడమే కాదు, టాప్ 100లో కూడా లేకపోవడం అందరినీ ఆశ్చర్యంలో ముంచేసింది. ఇటీవలే రోహిత్ రెండో స్థానంలో, కోహ్లి నాల్గవ స్థానంలో ఉండగా, ఒక్కరాత్రిలోనే ఈ మార్పు రావడంతో సోషల్ మీడియాలో “రిటైర్మెంట్ ఎప్పుడు ఇచ్చారు?” అంటూ అభిమానులు సందేహాలు వ్యక్తం చేశారు.

ఇప్పటికే టెస్ట్, టీ20 ఫార్మాట్ కు వీడ్కోలు పలికిన ఈ ఇద్దరు వచ్చే వరల్డ్ కప్ వరకు కొనసాగుతారు అనే ఊహాగానాలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఐసీసీ లిస్ట్ బిగ్ షాక్ ఇచ్చింది. గత వారం బాబర్ ఆజమ్ సిరీస్‌లో విఫలమైన తర్వాత రోహిత్ రెండో స్థానానికి ఎగబాకాడు. కోహ్లి మాత్రం నాల్గో స్థానంలో నిలిచాడు.

కానీ, తాజా అప్‌డేట్‌లో ఇద్దరి పేర్లూ మాయం కావడంతో ఊహాగానాలు తారాస్థాయికి చేరాయి. “ఇద్దరూ వన్డేలకూ గుడ్‌బై చెప్పారా?” అనే ప్రశ్నలు మొదలయ్యాయి. అయితే, ఈ పరిణామంపై ఐసీసీ త్వరగానే క్లారిటీ ఇచ్చింది. ఇది సాంకేతిక లోపం కారణంగా తలెత్తిన సమస్య మాత్రమేనని, ఇద్దరి స్థానాలు అలాగే ఉన్నాయని వెల్లడించింది.

తర్వాత అప్‌డేట్‌లో రోహిత్ రెండో స్థానంలో, కోహ్లి నాల్గో స్థానంలో తిరిగి కనిపించారు. అయినప్పటికీ, ఈ చిన్న తప్పిదం అభిమానుల హృదయాల్లో పెద్ద కలకలం రేపింది. ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత జట్టు గెలుపులో రోహిత్ కోహ్లి కీలక పాత్ర పోషించారు. అనుభవజ్ఞులైన ఈ ద్వయం ఇంకా వన్డే క్రికెట్‌లో జట్టుకు అవసరమే అని అందరూ భావిస్తున్నారు. కానీ, వయస్సు పెరుగుతున్న తరుణంలో కొత్త తరం ఆటగాళ్లకు మార్గం ఇవ్వాలనే చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి.

This post was last modified on August 20, 2025 6:53 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

45 minutes ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

1 hour ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

2 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

3 hours ago

ట్రెండీ కామెడీతో నవ్వించే మురారి

​సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…

4 hours ago

సమంతలో పెళ్ళి తెచ్చిన కళ

ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…

5 hours ago