ఇండోర్ నగరంలో తాజాగా చోటుచేసుకున్న ఘటన ఇప్పుడు అందరిలోనూ చర్చనీయాంశంగా మారింది. అక్కడి బైక్ వాహనదారులకు ‘నో హెల్మెట్.. నో పెట్రోల్’ నిబంధన తప్పనిసరిగా అమలవుతోంది. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తూ ఓ వ్యక్తి చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. హెల్మెట్ లేకుండా పెట్రోల్ బంక్‌కు వచ్చిన ఒక పాల వ్యాపారి, పాల క్యాన్ మూతను తలపై పెట్టుకొని హెల్మెట్‌ను మాయ చేశాడు.
పెట్రోల్ బంక్ సిబ్బంది కూడా అతని తతంగాన్ని పట్టించుకోకుండా పెట్రోల్ పోశారు. ఈ వీడియో నెటిజన్ల దృష్టిలో పడ్డ వెంటనే అధికారుల కంటపడింది. ఇలాంటి అవగాహనలేని చర్యల వల్ల పెట్రోల్ బంక్‌పై విచారణ ప్రారంభమైంది. అధికారుల పరిశీలన తర్వాత నిబంధనలను ఉల్లంఘించినందుకు సంబంధిత పెట్రోల్ బంక్‌ను తాత్కాలికంగా సీజ్ చేశారు. బంక్ నిర్వాహకులు బాధ్యత కలిగి ఉండాలని అధికారులు హెచ్చరించారు.
ఇండోర్‌లో ఆగస్టు 1 నుంచి కొత్త నిబంధన అమల్లోకి వచ్చింది. ఇకపై హెల్మెట్ లేకుండా పెట్రోల్ డిపో వద్దకు వచ్చేవారికి ఇంధనం ఇవ్వకూడదని ఆదేశించారు. ఇలా చేయని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఏడాది జైలు శిక్ష లేదా రూ.5వేల జరిమానా విధించవచ్చని హెచ్చరించారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వెల్లువెత్తాయి. కొంత మంది వినూత్న కామెడిగా చూస్తే, మరికొందరు నిబంధనల దౌర్భాగ్యాన్ని విమర్శించారు.
ప్రజలు ఇలా ఆడుకుంటే ప్రమాదానికి గురవుతారనే విషయాన్ని గుర్తు చేశారు. మొత్తంగా, హెల్మెట్‌కు బదులు పాల క్యాన్ మూత వేసుకొని వచ్చిన వ్యాపారి చేసిన పని పెట్రోల్ బంక్‌ను మూయించేసింది. రూల్స్‌ను ఖచ్చితంగా పాటించకపోతే ఇలాంటి ఫలితాలు తప్పవని ఈ సంఘటన మరోసారి తేల్చిచెప్పింది.
This post was last modified on August 7, 2025 9:18 am
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…