1993, మార్చి 12…ముంబై బాంబు పేలుళ్ల ఘటన జరిగి దాదాపు 32 ఏళ్లు కావస్తోంది. అయినా సరే, ఆ పేలుళ్ల గురించి వార్తల్లో వింటే చాలు ఆ పేలుళ్ల బాధితులు, పేలుళ్లలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులు ఉలిక్కి పడతారు. ఒక్క రోజులోనే ముంబైలోని 12 ప్రాంతాల్లో పేలుళ్లకు ముష్కరులు పాల్పడ్డారు. ఆ పేలుళ్లలో మొత్తం 257 మంది చనిపోగా..1400 మంది గాయపడ్డారు. అయితే, వేలాదిమందికి పీడకలగా మిగిలిన ఆ భయానక ఉగ్రదాడి జరగకుండా ఆపే చాన్స్ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కు ఉందా? సంజయ్ దత్ సరైన సమయంలో పోలీసులకు సమాచారం ఇచ్చి ఉంటే ఆ ఉగ్రదాడి జరిగేది కాదా? అంటే అవును అనే సమాధానిస్తున్నారు ప్రముఖ న్యాయవాది, బీజేపీ నేత, రాజ్య సభ సభ్యుడు ఉజ్వల్ నికమ్.
ముంబై పేలుళ్ల ఘటన గురించి ఉజ్వల్ నిక్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. సంజయ్ దత్ తలుచుకుని ఉంటే ఆ పేలుళ్లను ఆపి ఉండేవాడని ఆయన చేసిన కామెంట్లు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. ముంబై పేలుళ్లకు కొద్ది రోజుల ముందు సంజయ్ దత్ ఇంటికి ఆయుధాలతో నిండిన ఓ వ్యాన్ ను దావూద్ ఇబ్రహీం అనుచరుడు అబూ సలేం తీసుకువచ్చాడని ఆయన అన్నారు. ఆ వ్యాన్‌లో ఏకే 47 తుపాకులు, బాంబులు ఉన్నాయని, అందులో నుంచి సంజయ్ దత్ ఒక ఏకే 47 తుపాకీని తీసుకున్నారని చెప్పారు.
ఆ ఆయుధాల వ్యాన్ గురించి పోలీసులకు సంజయ్ దత్ సమాచారం ఇచ్చి ఉంటే ఆ పేలుళ్లు జరిగేవి కావని అభిప్రాయపడ్డారు. సంజయ్ దత్ సరిగ్గా స్పందించి ఉంటే ఆ పేలుళ్లలో అంత మంది చనిపోయి ఉండేవారు కాదని అన్నారు. ముంబై పేలుళ్లతో సంబంధం ఉందన్న కారణంతో సంజయ్ దత్ పై టాడా యాక్ట్ ప్రకారం కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే, ఆ కేసులో సంజయ్ దత్ ను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. అక్రమంగా ఏకే 47 వంటి ఆయుధాలు కలిగి ఉన్నందుకు సంజయ్ దత్ కు కోర్టు ఐదేళ్లు జైలు శిక్ష విధించింది.
This post was last modified on July 15, 2025 3:37 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…