ప్రపంచాన్ని వణికించేస్తున్న కరోనా వైరస్ మహమ్మారికి విరుగుడు టీకా మనదేశానికి వచ్చేసింది. రష్యా డెవలప్ చేసిన స్పుత్నిక్-వి వ్యాక్సిన బుధవారం భారత్ కు చేరుకుంది. రష్యాలోని గమలేయా నేషనల్ రీసెర్చి ఇన్ స్టిట్యూట్ ఎపిడమియాలజీ అండ్ మైక్రో బయాలజీ సంస్ధతో కలిసి భారత్ లోని రెడ్డీ ల్యాబరేటరీస్ కరోనా టీకా రెడీ చేస్తున్న విషయం తెలిసిందే. అందుకనే స్పుత్నిక్-వి వ్యాక్సిన్ను రెడ్డీ ల్యాబరేటరీస్ అందుకుంది. ఇదే వ్యాక్సిన్ను రష్యాలోని 42 వేలమందిపై క్లినికల్ ట్రయల్స్ గా ప్రయోగిచింది.
దేశంలోని సుమారు 2 వేల మందికి క్లినికల్ ట్రయల్స్ కోసం ఈ వ్యాక్సిన్ను వేయటానికి రెడ్డీ ల్యాబరేటరీస్ ఏర్పాట్లు చేసుకుంటోంది. రష్యా డెవలప్ చేసిన స్పుత్నిక్-వి వ్యాక్సిన్ను మనదేశంలో రెండు, మూడో స్టేజి క్లినికల్ ట్రయల్స్ రూపంలో ప్రయోగించబోతున్నారు. ఈ నెల 15వ తేదీ క్లినికల్ ట్రయల్స్ విషయంలో రెడ్డీ ల్యాబరేటరీస్ యాజమాన్యం అందుబాటులోకి తెస్తోంది.
ఈ క్లినికల్ ట్రయల్స్ ప్రభావం రోగులపై ఏ విధంగా పనిచేస్తుందనే విషయాన్ని రెడ్డీ ల్యాబరేటరీస్ సంస్ధ మానిటర్ చేస్తుంది. ఇప్పటికే తమ వ్యాక్సిన సక్సెస్ రేటు 92 శాతం ఉన్నట్లుగా రష్యా ఫార్మా కంపెనీ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి భారత్ లో కూడా తమ క్లినికల్ ట్రయల్స్ విజయవంతం అవుతాయని సదరు సంస్ధ భావిస్తోంది. క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను ల్యాబరేటరీస్ యాజమాన్యం ఎప్పటికప్పుడు కేంద్రప్రభుత్వానికి అందచేయబోతోంది.
మొత్తం నివేదిక అందిన తర్వాత కేంద్రప్రభుత్వ ఔషధ నియంత్రణ మండలి సమీక్ష చేసి ఓ నివేదిక తయారు చేస్తుంది. ఇక్కడ గనుక క్లినికల్ ట్రయల్స్ సక్సెస్ అయితే బహుశా రష్యా ఫార్మా కంపెనీ భాగస్వామ్యంతో భారత్ లో రెడ్డీ ల్యాబరేటరీస్ ఆధ్వర్యంలో పూర్తిస్ధాయి వ్యాక్సిన్ రెడీ అవుతుంది. వ్యాక్సిన్ సక్సెస్ అయితే రెడ్డీ ల్యాబరేటరీస్ 10 కోట్ల డోసులు తయారు చేయటానికి రెడీ అవుతోంది.
This post was last modified on November 12, 2020 3:42 pm
కేంద్ర ప్రభుత్వం వద్ద వివిధ రాష్ట్రాలకు సంబంధించిన చాలా అంశాలు పెండింగ్ లో అలా ఏళ్ల తరబడి ఉంటూనే ఉంటాయి.…
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీకి సంబంధించిన ఒక ముఖ్యమైన అనౌన్స్ మెంట్…
మిరపకాయ్ కాంబినేషన్ రిపీట్ అవుతుందని అభిమానులు బోలెడు ఆశలు పెట్టుకున్న మిస్టర్ బచ్చన్ గత ఏడాది తీవ్రంగా నిరాశ పరచడం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు మంగళవారం నిజంగానే ఓ విచిత్ర అనుభవాన్ని మిగిల్చింది. మంగళవారం…
ఈ రోజు అల్లు అర్జున్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా అట్లీ దర్శకత్వంలో అతను చేయబోయే మెగా మూవీకి సంబంధించిన…
సింగపూర్ లో సోమవారం ఉదయం జరిగిన అగ్ని ప్రమాదం భారీదేనని చెప్పాలి. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్…