అహ్మదాబాద్ లో ఘోర ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానం.. ఎయిర్ పోర్టు దాటగానే కుప్పకూలిపోవడానికి గల కారణాలేమిటన్న దానిపై విచారణ జరుగుతోంది. ఇప్పటికే విమానం బ్లాక్ బాక్స్ ను స్వాధీనం చేసుకున్న దర్యాప్తు బృందాలు అందులో దాగి ఉన్న వివరాలను డీకోడ్ చేసే పనిలో ఉన్నాయి. ప్రస్తుతానికి విమానం కూలిపోవడానికి ముందు విమానం పైలట్ సుమిత్ సభర్వాల్ చెప్పిన మాటలు వెలుగులోకి వచ్చాయి. సుమిత్ మాటలు విమానం ప్రమాదాన్ని ఇక నిలువరించడానికి సాధ్యం కాదని తేల్చి చెప్పేశాయి.
బ్లాక్ బాక్స్ ను పరిశీలించిన దర్యాప్తు అధికారులు… అందులో చివరి 5 సెకన్లలో పైలట్ సుమిత్ సభర్వాల్… ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)తో కొన్ని మాటలు చెప్పారు. ‘మేడే, మేడే, మేడే’ అంటూ వరుసగా మూడు సార్లు చెప్పిన సుమిత్… ఆ తర్వాత వెనువెంటనే ‘నో పవర్, నో థ్రస్ట్, గోయింగ్ డౌన్’ అంటూ కీలక పదాలను వినియోగించారు. అంటే… ఇక విమానం తన స్వాధీనంలో లేదని, విమానం కూలిపోవడం ఖాయమని కూడా ఆయన చెప్పకనే చెప్పేశారు.
సాధారణంగా విమానాల్లో రెండు ఇంజిన్లు ఉంటాయి. ఒక ఇంజిన్ ఫెయిల్ అయినా…మరో ఇంజిన్ తో విమానం ఎంచక్కా గమ్యస్థానం చేరుకుంటుంది. అయితే అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ఇంజిన్ ఫెయిల్ అన్న మాటే లేదు. పవర్ స్థంభించడంతోనే ప్రమాదం జరిగినట్లుగా భావిస్తున్నారు. పవర్ లేకుండా రెండు ఇంజిన్లు ఉన్నా ప్రయోజనం లేదు కదా. పవర్ లేని కారణంగా విమానం ముందుకు కదిలే పరిస్థితి లేదని, ఈ కారణంగా విమానం నేలకు దిగుతోందని సుమిత్ చెప్పారు. సుమిత్ ఈ విషయాలు చెప్పిన తర్వాత ఏటీసీ స్పందించేలోగానే విమానం కుప్పకూలిపోయింది.
This post was last modified on June 14, 2025 7:29 pm
ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…
మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…
రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…
హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…