Trends

జై షా ఉన్నా ఐసీసీ లెక్క చేయలేదా?

టెస్ట్ క్రికెట్‌కు గర్వకారణమైన డబ్ల్యూటీసీ ఫైనల్స్ నిర్వహణపై భారత్ కలలు మరోసారి నెరవేరకుండానే ఆగిపోయాయి. ఐసీసీ కొత్త ఛైర్మన్‌గా బీసీసీఐ కార్యదర్శి జై షా బాధ్యతలు చేపట్టినప్పటికీ, రాబోయే మూడు వరుస టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌కు భారత్‌కు ఆతిథ్య హక్కులు దక్కలేదు. బీసీసీఐ నూతన శక్తితో అధికారంలోకి వచ్చిన ఈ సమయంలోనూ, ప్రపంచ టెస్ట్ పోటీలకు లార్డ్స్ వేదికగా నిర్ణయించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.

ఇప్పటికే 2021, 2023, 2025 డబ్ల్యూటీసీ ఫైనల్స్‌ ఇంగ్లండ్‌లో జరిగాయి. తాజా సమాచారం ప్రకారం, 2027 వరకూ ఈ సంప్రదాయం అలానే కొనసాగనుంది. ఐసీసీ సింగపూర్‌లో జరగనున్న వార్షిక సమావేశంలో లార్డ్స్‌తోపాటు ఇతర ఇంగ్లండ్ వేదికలకు అధికారికంగా ఆతిథ్య హక్కులు అప్పగించనున్నారు. ఇది భారత్‌కు పెద్ద దెబ్బే.

జై షా ఐసీసీ ఛైర్మన్ కావడంతో, క్రికెట్ ప్రియులు టెస్ట్ ఫైనల్స్‌కు భారత గడ్డపై వేదికలపై ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ తాజా నిర్ణయం ఆ కలలను కుదిపేసింది. భారత్‌ వేదికలు, మౌలిక సదుపాయాల పరంగా ప్రపంచంలోనే అత్యుత్తమమైనవిగా పేరు తెచ్చుకున్నా, వాతావరణం, ప్రయాణ సౌలభ్యం పేరుతో భారత్‌కు అవమానంగా వేదికలు దక్కకుండా చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇంగ్లండ్‌లో వర్షం తక్కువగా ఉండే జూన్ సీజన్, లార్డ్స్ మైదానానికి ఉన్న చారిత్రక నేపథ్యం, గ్లోబల్ కనెక్టివిటీ వంటివి ఈ నిర్ణయానికి కారణాలుగా చెబుతున్నారు. అయితే ఇందులో రాజకీయ కారణాలు లేకపోవచ్చని చెప్పలేరు. ఐసీసీ పగ్గాలు జై షా చేతుల్లో ఉన్నా, భారత్‌ను ప్రధాన వేదికగా నిలబెట్టేందుకు ఆయన చొరవ చూపలేదన్న వాదన బయటకు వస్తోంది.

క్రికెట్‌లో భారత్ ప్రాభవం పెరుగుతున్న తరుణంలో కూడా ఈవెంట్‌లకు ఆతిథ్య దక్కకపోవడంపై బీసీసీఐ ఆవేదన వ్యక్తం చేస్తోంది. టెస్ట్ ఫార్మాట్‌కు భారతదేశం ఇచ్చే ప్రాధాన్యం, ఆర్థిక స్థిరత, అభిమానుల ఆదరణ చూస్తే.. కనీసం ఒక ఫైనల్ అయినా భారత్‌లో జరగాల్సింది. కానీ తాజా పరిణామాలు చూస్తే, ఆ గౌరవం కోసం భారత్ ఇంకా కాసేపు ఎదురు చూడాల్సిందేనని అనిపిస్తోంది.

This post was last modified on June 14, 2025 2:36 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

పరకామణి దొంగను వెనకేసుకొచ్చిన జగన్!

చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…

43 minutes ago

‘కూటమి బలంగా ఉండాలంటే మినీ యుద్ధాలు చేయాల్సిందే’

2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…

2 hours ago

ప్రీమియర్లు క్యాన్సిల్… ఫ్యాన్స్ గుండెల్లో పిడుగు

ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…

2 hours ago

‘పరదాల్లో పవన్’ అన్న వైసీపీ ఇప్పుడేమంటుందో?

ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…

4 hours ago

చైతూ వివాహ వార్షికోత్సవం… దర్శకుడి పోస్టు వైరల్

ఏడాది కిందట అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళల పెళ్లి జరిగింది. సన్నిహితుల మధ్య కొంచెం సింపుల్‌‌గా పెళ్లి చేసుకుంది ఈ…

4 hours ago

కోహ్లీ… 2,462 రోజుల సెంటిమెంట్ బ్రేక్

విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడంటే టీమిండియా గెలిచినట్టే అని ఒక నమ్మకం ఉంది. కానీ రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో…

4 hours ago