Trends

విషాదం.. మాజీ సీఎం సహా 242 మంది మృతి

గుజరాత్ వాణిజ్య రాజధాని అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలో గురువారం చోటుచేసుకున్న విమాన ప్రమాదంలో యావత్తు ప్రపంచ దేశాలను హడలెత్తించింది. ఈ ప్రమాదంలో విమానంలోని మొత్తం ప్రయాణికులు, సిబ్బంది కలిసి 242 మంది మృత్యువాత పడ్డారన్న వార్తలు అందరి హృదయాలను కలిచివేస్తున్నాయి. ఈ విషయాన్ని అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ అధికారికంగా ధృవీకరించారు. మృతుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత విజయ్ రూపానీ కూడా ఉన్నారు. లండన్ లోని తన భార్యను తీసుకొచ్చేందుకు బయలుదేరిన ఆయన అహ్మదాబాద్ దాటక ముందే అగ్ని కీలలకు ఆహుతి అయిపోయిన వైనం అందరినీ కంట తడి పెట్టిస్తోంది. 

ఎయిర్ ఇండియాకు చెందిన ఈ విమానం మొత్తం 230 మంది ప్రయాణికులతో లండన్ వెళ్లాల్సి ఉంది. ఢిల్లీ నుంచి గురువారం ఉదయం బయలుదేరిన ఈ విమానం అహ్మదాబాద్ లో విజయ్ రూపానీ సహా మరికొందరినీ ఎక్కించుకుని బయలుదేరింది. విమానంలో పైలట్లు, సహాయక సిబ్బంది మొత్తం 12 మంది ఉన్నారు. ప్రయాణికుల్లో 169 మంది భారతీయులు ఉండగా… 53 మంది బ్రిటిషర్లు, 7 మంది పోర్చుగీస్ వారు, ఓ కెనడియన్ ఉన్నారు. ఇక ప్రయాణికుల్లో ఇద్దరు పసిపిల్లలతో పాటు 12 మంది చిన్నారులు ఉన్నారు. 

అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు నుంచి టేకాఫ్ తీసుకున్న నిమిషాల వ్యవధిలోనే విమానాశ్రయానికి సమీపంలోని జనావాసాలపై విమానం కూలిపోయింది. ఈ ప్రమాదం స్థాయిని గుర్తించిన అధికారులు…విమానంలోని ఏ ఒక్కరు కూడా బ్రతికి బయటపడే అవకాశాలే లేవని ఊహించారు. ఎందుకంటే… విమానంలోని భారీ స్థాయిలోని ఫ్యూయల్ విమానాన్ని, అది కూలిన పరిసరాలను దహించివేసింది. ఫలితంగా విమానంలోని ఒక్కరంటే ఒక్కరు కూడా బయటపడలేకపోయారు. ఇక విమాన ప్రమాదం కారణంగా బయట ఉన్న వారు ఎంతమంది చనిపోయారన్న విషయం ఇంకా తేలాల్సి ఉంది.

విమానంలో భారత్ కాకుండా మూడు దేశాలకు చెందిన పౌరులు ఉండటంతో ఆయా దేశాల నుంచే కాకుండా అంతర్జాతీయంగా కూడా పెద్ద ఎత్తున స్థానిక అధికారులపై ఒత్తిడి వచ్చింది. అసలు ప్రమాదంలో చనిపోయిన వారు ఎందరు? ఎంతమంది బయటపడ్డారు? అంటూ ఆయా దేశాల నుంచి పదే పదే ప్రశ్నలు ఎదురవుతున్న నేపథ్యంలో అసోసియేటెడ్ ప్రెస్ ప్రతినిధికి అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ మృతుల సంఖ్య గురించి వివరిస్తూ… ఈ ప్రమాదంలో విమానంలోని ఒక్కరు కూడా బ్రతకలేదని ఆయన తెలిపారు. ఇదిలా ఉంటే… ఈ ప్రమాదంలో బయట పరిసరాల్లోని చనిపోయినవారి సంఖ్య కూడా కలుపుకుంటే… మృతుల సంఖ్య మరింతగా పెరిగే ప్రమాదం లేకపోలేదు.

This post was last modified on June 12, 2025 8:49 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

1 hour ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

1 hour ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

2 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

3 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

4 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

6 hours ago