Trends

కోహ్లీ రెస్టారెంట్‌పై కేసు: ఏం జరిగిందంటే?

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరు మీద బెంగళూరులోని వన్8 కమ్యూన్ రెస్టారెంట్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. స్పోర్ట్స్ మేనియా మాత్రమే కాదు, కోహ్లీ బిజినెస్ ఆంగిల్ కూడా హాట్ టాపిక్ అవుతోంది. కానీ, ఈసారి మాత్రం పోజిటివ్ విషయంతో కాదు. ఆయన రెస్టారెంట్‌పై స్థానిక పోలీసులు సీటీబీ చట్ట ఉల్లంఘనకు సంబంధించి కేసు నమోదు చేశారు. 

ఊహించని పరిణామంతో మీడియాలో హైలైట్ అయిపోయింది. వివరాల్లోకి వెళితే, బెంగళూరులోని కస్తూర్బా రోడ్‌లో ఉన్న వన్8 కమ్యూన్ పబ్‌లో ఇటీవల పోలీసులు అకస్మత్ తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో, అక్కడ స్మోకింగ్ కోసం ప్రత్యేకంగా కేటాయించిన ఏరియా లేదని గుర్తించారు. ఇది కోట్పా (COTPA) చట్టాన్ని ఉల్లంఘించినట్లే కావడంతో, మేనేజ్‌మెంట్‌పై చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నారు. 

కబ్బన్ పార్క్ స్టేషన్ పరిధిలోని ఈ పబ్‌పై సెక్షన్ 4, 21 కింద కేసులు నమోదయ్యాయి. పబ్ మేనేజర్‌తో పాటు అక్కడ పని చేస్తున్న కొంతమంది సిబ్బందిపై కూడా అధికారులు కేసులు పెట్టారు. పోలీస్ ఎస్సై మీడియాతో మాట్లాడుతూ, “ప్రతి కమర్షియల్ స్థలంలో స్మోకింగ్ జోన్ తప్పనిసరి. ఇది ప్రజా ఆరోగ్యాన్ని కాపాడే చట్టం. సదరు పబ్ నిబంధనలను పాటించకపోవడంతోనే కేసు నమోదు చేశాం” అని స్పష్టం చేశారు. చట్ట ప్రకారం ఈ నిర్లక్ష్యం జరిమానా లేదా మరింత కఠిన చర్యలకు దారితీయొచ్చు. అయితే ఘటనపై ఇప్పటివరకు కోహ్లీ ఎక్కడ స్పందించలేదు. ఇక RCB ఐపీఎల్ ఫైనల్ లో పంజాబ్ తో తలపడనున్న విషయం తెలిసిందే.

This post was last modified on June 2, 2025 2:42 pm

Share

Recent Posts

‘రణబాలి’ నేర్చుకున్న ‘ప్యారడైజ్’ పాఠం

నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల క్రేజీ కాంబినేషన్లో వచ్చిన ‘ది ప్యారడైజ్’ సినిమాకు రిలీజ్ ముందు రోజు రాత్రి…

27 minutes ago

ఖైదీకి గోల్డ్ మెడల్.. జైల్లోనే చదివి డిగ్రీలో టాప్‌!

కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న వ్యక్తికి విద్యపై ఆసక్తి, పట్టుదల తోడైంది. దీంతో చదువులో అత్యుత్తమ ఫలితాలను సాధించి ఇతర ఖైదీలకు…

1 hour ago

చీరలో పరిగెత్తి చరిత్ర సృష్టించిన కవిత

జీవితం అన్నీ నేర్పిస్తుంది. కష్టాలు ఎలా జీవించాలో నేర్పిస్థాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ కవిత కుమారి. జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లా,…

2 hours ago

ఈసారి అంత ఈజీ కాదు శ్రీకాంత్

మొత్తానికి ‘ది ప్యారడైజ్’ సినిమా థియేట్రికల్ రన్ చివరికి వచ్చేసింది. ఈ సినిమా రెండో వీకెండ్‌కు వచ్చేసరికి సరైన సినిమాలు…

6 hours ago

కరెంటు లేని కాలం కావాలంటున్న డైరెక్టర్

ఇప్పుడు డబ్బుతో పాటు అన్ని సౌకర్యాలూ ఉన్నా సరే.. ఏమీ లేని ఒకప్పటి రోజులే బాగున్నాయి అనుకునేవాళ్లు చాలామందే ఉంటారు.…

7 hours ago

విశ్వక్ సేన్ నిర్ణయం ఎటువైపు ఉంటుందో

ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కేవలం వెంకటేష్ అభిమానులకే కాదు ఇతర హీరోలు, నిర్మాతలకు కూడా సంకటంగా…

9 hours ago