Trends

RCB: ఏంట్రా.. ఇలా తగులుకున్నారు(MI)?

2025 ఐపీఎల్ సీజన్ ప్లే ఆఫ్స్ దశకి చేరేసరికి అసలు కథ మొదలైంది. GT, RCB, PBKS ముందుగానే టాప్ స్థానాల్లోనే టికెట్ బుక్ చేసుకున్నప్పటికీ, ముంబై ఇండియన్స్ చివర్లో స్పీడ్ పెంచి టైటిల్ రేసులో కూడా టెన్షన్ పెట్టేస్తోంది. లీగ్ మొదట్లో వరుస పరాజయాలతో వెనుకబడిన ముంబై, ఆఖర్లో వరుస విజయాలతో అభిమానులకు హోప్స్ ఇచ్చింది. ఆరో సారి కూడా టైటిల్ టార్గెట్‌గా వెళ్లే ముంబైకు ఇప్పుడు పక్కా ఫామ్ రావడంతో ఫైనల్స్ వేదికపై పెద్ద హంగామా జరుగుతుందనే టాక్ వినిపిస్తోంది.

దీనితో పాటు, మరోవైపు RCB స్టోరీ అయితే ఎమోషన్‌తో నిండిపోయింది. కోహ్లీ అభిమానులు ఈసారి టైటిల్ మనదే అనే నమ్మకంతో ఎదురుచూస్తున్నారు. గతంలో రెండుసార్లు ఫైనల్స్ దాకా వెళ్లిన RCB ప్రతి సారి చివర్లో తడబడింది. కానీ ఈసారి కప్పు దక్కేలా ఆడుతున్నామని వారు భావిస్తున్నారు. స్కోర్లు, స్ట్రైక్ రేట్‌లు అన్నీ మంచి ఫామ్ లో ఉన్నా, ఒక్క మిస్ చేస్తే ప్లాన్ మొత్తం తారుమారు అయ్యే అవకాశం ఉండటంతో టెన్షన్ కూడా తగ్గడం లేదు.

అయితే ముంబై ఇప్పుడున్న ఫామ్ చూస్తే.. “ఇలా అయితే కప్ మళ్లీ వాళ్లదే” అనే భయం ఇతర జట్లకు తప్పకుండా ఉంది. టాప్ ఫోర్‌లోకి వచ్చేసరికి ఏదైనా జరగొచ్చు. కోహ్లీకి ఇది లాస్ట్ ఛాన్స్ కావొచ్చునని భావిస్తున్న కొందరు నెటిజన్లు “RCB కు ఈసారి అయినా కప్ ఇవ్వండి భగవంతుడా” అని సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేస్తుండగా, మరికొందరు మాత్రం “ఎప్పుడూ అదే కథ” అని ట్రోల్ చేస్తున్నారు.

ఇక పంజాబ్ కింగ్స్ పరిస్థితి కూడా RCBతో సమానంగా ఉంది. ఇప్పటివరకు టైటిల్ గెలవని జట్లలో వారూ ఒకరు. కానీ ఇప్పుడు వారి ఫామ్, జట్టులోని బ్యాలెన్స్ బాగున్నప్పటికీ ముంబై ఫాస్ట్ ట్రాక్ లో ఉండడంతో వారు ఆగిపోతారేమోననే భయం ఉంది. GT మాత్రం స్టెడీగా ఆడుతోంది. ఈ జట్టు ఒకసారి కప్ గెలిచింది. దీంతో రెండోసారి సురక్షితంగా ఫైనల్ రేసులో ఉండాలని చూస్తోంది. కానీ ముంబైని తట్టుకోవడం ఈ జట్టుకు కూడా అంత ఈజీ కాదు.

నేటిజన్లు అయితే ఇప్పటికే మీమ్స్‌తో తెగ రచ్చ చేస్తున్నారు. ముఖ్యంగా బ్రహ్మానందం – అదుర్స్ సీన్‌ను జోడించి, “ఏంట్రా ఇలా తగులుకున్నారు..?” అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఇక ఈ సారి టైటిల్ ఎవరిది అనేది చెప్పడం కష్టం. కానీ RCB ఫ్యాన్స్ మాత్రం చివరి వరకు ఆ నమ్మకాన్ని వదలడం లేదు. చూడాలి మరి.. ఏం జరుగుతుందో?

This post was last modified on May 22, 2025 6:45 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయితే రచ్చే

రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…

57 minutes ago

ప్రతిచోట చీపురు పట్టుకొని పవన్ ఊడవాలా?

పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…

4 hours ago

విమర్శకులను పనితీరుతో కొడుతున్న లోకేష్..!

తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…

5 hours ago

రండి.. కూర్చుని మాట్లాడుకుందాం: ఏపీకి రేవంత్ రెడ్డి పిలుపు

ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…

5 hours ago

షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?

టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…

6 hours ago

‘వైసీపీ చేసిన పాపాలను కడుగుతున్నాం’

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…

14 hours ago