Trends

ధోని ముందు వైభవ్.. కిక్కిచ్చే మ్యాచ్!

ఐపీఎల్ 2025లో ప్లేఆఫ్స్ ఆశలు కోల్పోయినా చెన్నై, రాజస్థాన్ మధ్య నేడు జరగనున్న మ్యాచ్‌కి ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంది. మ్యాచ్‌ రిజల్ట్‌ కంటే, ఎంఎస్ ధోనీ కెప్టెన్సీ స్ట్రాటజీకి, యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ మాస్ బ్యాటింగ్‌కు మధ్య ఎదురుపోరే అసలైన హైలైట్. 43 ఏళ్ల ‘తల’ మైదానంలో ఎంత కూల్ గా ఉంటాడు, ఇక 14 ఏళ్ల హిట్టింగ్ యంగ్ స్టార్ అమాయకంగా కనిపిస్తూనే బ్యాటింగ్ తో బీభత్సం సృష్టించగలడు. దీంతో అందరి ఫోకస్ వీరిపైనే ఉంది.

ఇక ధోని ఈ కుర్రాడిని ఎలా కట్టడి చేస్తాడు అనేది మరో హాట్ టాపిక్. అసలే చెన్నై బౌలింగ్ బలహీనంగా ఉంది. దీంతో వైభవ్ ధోని వలలో పడతాడా లేదా అన్నది చూడాలి. ఈ సీజన్‌లో వచ్చిన మూడు గెలుపులతో చెన్నై ఇప్పటికే నాకౌట్ పటలంపై వెలుపలే ఉంది. అయినా టీమ్‌ను ఎలా గౌరవంగా నిలబెట్టాలో ధోనీకి బాగా తెలుసు. గత మ్యాచ్‌ల్లో పరిస్థితులు ఎంత క్లిష్టంగా ఉన్నా, చివరి ఓవర్లలో బౌలింగ్ మార్పులతో, ఫీల్డింగ్ సెటప్‌తో గేమ్‌ను సాగదీసే ధోనీ మాస్టర్ ప్లాన్స్‌కు ప్రత్యర్థి కెప్టెన్లు సమాధానం లేక నిస్సహంగా నిలిచారు.

ఇవాళ అతడి ప్లాన్‌కు ఎదురే యువ ప్లేయర్ వైభవ్. వైభవ్ సూర్యవంశీ… 14 ఏళ్ల వయసులోనే 219 స్ట్రైక్‌రేట్‌తో పరుగుల వరద పారించిన ఆటగాడు. 6 మ్యాచుల్లో సెంచరీ కూడా చేసిన ఈ యంగ్ స్టారే రాజస్థాన్‌కు ఒదిగిన భవిష్యత్ హోప్. ఇవాళ ధోనీ ఫీల్డ్ సెట్టింగ్స్‌ను ఛేదించగలిగితే, ఈ బాలుడి పేరు ఇంకెక్కడికో పోతుంది. అదే సమయంలో, ధోనీ ఈ యువ బ్యాట్స్‌మన్‌ను చదవడం ద్వారా మళ్లీ తన టెంప్లేట్‌ను చాటవచ్చు.

ఇంకా ఒక ఆసక్తికరమైన కోణంలో ఇదే ధోనీకి చివరి మ్యాచ్ అయ్యే అవకాశం ఉందా? అనే ప్రశ్న రాగా, మాజీ ఆటగాళ్లు మాత్రం కాదు అంటున్నారు. “అతను భవిష్యత్తుపై తొందరగా నిర్ణయం తీసుకోడు. శరీరం సహకరిస్తే ధోనీ 2026లోనూ కనిపిస్తాడు” అని వరుణ్ ఆరోన్ అభిప్రాయపడ్డాడు. ఆకాశ్ చోప్రా కూడా ధోనీ రాబోయే సీజన్‌కి సిద్ధమవుతాడన్న నమ్మకమే వ్యక్తం చేశాడు. ఇక ధోనీ మాస్టర్ మైండ్‌కి, వైభవ్ పవర్ హిట్టింగ్‌కి మధ్య నేటి ఢిల్లీ పోరు… ఫ్యాన్స్‌కి ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించబోతోంది.

This post was last modified on May 20, 2025 10:59 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ఏం జరిగితే బంగారం ధరలు తగ్గుతాయి?

​బంగారం అంటే భారతీయులకు కేవలం ఆభరణం మాత్రమే కాదు, అదొక సురక్షితమైన పెట్టుబడి. అయితే ఈ పసిడి ధరలు ఎందుకు…

1 hour ago

సంక్రాంతి హిట్… ఇంతలోనే

ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమా చూడాలని ప్రతి చిత్ర బృందం కోరుకుంటుంది. ఆ దిశగా విన్నపాలు చేస్తుంది. కానీ తీరా…

4 hours ago

ఏప్రిల్… బాబుకి బలమైన సెంటిమెంట్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో ఏప్రిల్ నెలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నెలలో విడుదలైన…

4 hours ago

భార్య అందం చూసి భర్తకు పదవి ఇచ్చిన ట్రంప్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గురించి ప్రపంచ దేశాలకు పరిచయం అక్కర్లేదు. మహిళలపై నోరుపారేసుకునే నేతగా, స్త్రీలోలుడిగా ట్రంప్ నకు చెడ్డపేరుంది.…

5 hours ago

‘సంక్రాంతికి వస్తున్నాం’ తర్వాత ఏదో ఆశిస్తే..

గత ఏడాది టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్లలో ‘సంక్రాంతికి వస్తున్నాం’. సంక్రాంతి పండక్కి విడుదలైన ఈ మిడ్ రేంజ్ మూవీ.. ఎవ్వరూ…

5 hours ago

జనసేనకు అన్యాయం జరుగుతోందన్న బొలిశెట్టి

2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల కలయికలో ఏర్పడి ఎన్డీఏ కూటమి ఏపీలో ఘన విజయం సాధించింది. పార్టీ బలాబలాలు,…

6 hours ago