Trends

యూట్యూబ్ ఆదాయానికి కోత‌… సంచ‌ల‌న నిర్ణ‌యం?

అమెరికాకు చెందిన ప్ర‌ముఖ సోష‌ల్ మీడియా మాధ్య‌మం యూట్యూబ్‌.. సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకునే దిశ‌గా అడుగులు వేస్తోంది. అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప‌గ్గాలు చేప‌ట్టిన త‌ర్వాత‌.. అన్ని దేశాల‌పై సుంకాలు వేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో సొంత దేశానికి చెందిన యూట్యూబ్ ద్వారా.. విదేశీయులు.. భారీ ఎత్తున సొమ్ములు సంపాయిస్తున్నార‌ని.. త‌ద్వారా.. అమెరికాను అడ్డుపెట్టుకుని సంపాదిస్తున్నార‌ని.. ఆయ‌న వ్యాఖ్యానిస్తున్నారు. 

“ప్ర‌పంచ వ్యాప్తంగా నిరుద్యోగాన్ని త‌గ్గించ‌డంలో అమెరికా ప్ర‌త్యామ్నాయ పాత్ర పోషిస్తోంది. మ‌న యూట్యూబ్ ద్వారా.. ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను విదేశీయులు సంపాయిస్తున్నారు“ అని ఇటీవ‌ల మిస్సిసిపీలో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే.. స‌హ‌జంగా ఎవ‌రైనా.. ఇలాంటివి వ్యాఖ్యానిస్తార‌ని అను కుంటారు. కానీ, ఈ విష‌యంలోనూ.. అమెరికా అధినేత‌.. కీల‌క నిర్ణ‌యం తీసుకునేందుకు సిద్ధ‌మ‌య్యారు. యూట్యూబ్ కార్య‌కలాపాల‌పై ఆయ‌న త‌న స‌ల‌హాదారుల నుంచి వివ‌రాలు తీసుకున్నారు. 

ఈ క్ర‌మంలో యూట్యూబ్ లావాదేవీలు.. వ్యాపారం.. ప్ర‌క‌ట‌న‌లు.. స‌బ్‌స్క్రిప్ష‌న్లు.. చానెళ్లు.. వంటి ఆదాయ వ్య‌యాల‌పై ట్రంప్‌కు స‌మ‌గ్ర స‌మాచారం అందింది. దీంతో ఆయ‌న వీటిపై నేరుగా సుంకాలు వేసే అవ‌కాశం లేద‌ని భావించి.. యూట్యూబ్‌పైనే ప‌న్నులు చెల్లించేలా కొత్త వ్య‌వ‌స్థ‌కు శ్రీకారం చుడుతున్నారు. త‌ద్వారా.. చానెళ్లు ఆధారంగా యూట్యూబ్ ఇక నుంచి అమెరికాలో ప‌న్నులు చెల్లించాల్సి ఉంటుంది. ఇదే జ‌రిగితే.. యూట్యూబ్‌కు ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న ప‌న్నుల వెసులుబాటు పోతుంది.

ఇక‌, ఈ ప్ర‌భావం స‌హ‌జంగానే.. యూట్యూబ్‌ను ఆధారంగా చేసుకుని అంతో ఇంతో సంపాయించుకుంటున్న వారికి ఆదాయం త‌గ్గ‌నుంది. వారిపై ఎలాంటి ప‌న్నులు ఉండ‌వు. కానీ.. ప్ర‌స్తుతం ఇస్తున్న వీవ‌ర్స్ బేస్డ్ ఇన్‌క‌మ్ విధానంలో యూట్యూబ్ భారీ మార్పులు చేయ‌నుంది. వీవ‌ర్స్ సంఖ్యను పెంచ‌డంతోపాటు.. నిడివి విష‌యంలోనూకీల‌క‌నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంద‌ని.. స్పాట్ లైట్ జ‌ర్న‌ల్ పేర్కొంది. మ‌రి ఈ ప్ర‌భావం భార‌త్‌పైనా ఎక్కువ‌గా ఉంటుంద‌ని అంటున్నారు టెక్ నిపుణులు. 

This post was last modified on April 24, 2025 9:53 pm

Share

Recent Posts

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

5 hours ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

6 hours ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

6 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

7 hours ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

7 hours ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

7 hours ago