పసిడి పరుగులు పెడుతోంది. క్షిపణి వేగాన్ని మించిన ధరలతో దూసుకుపోతోంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. నిన్న మొన్నటి వరకు 10 గ్రాముల ధర రూ.70-80 వేల మధ్య ఉంటే.. గత నాలుగు రోజుల్లోనే ఏకంగా రూ.లక్షకు చేరింది. కీలకమైన అక్షయ తృతీయను పురస్కరించుకుని అంతో ఇంతో బంగారం కొనుగోలు చేయాలని అనుకున్న వారికి ఉసూరు మనిపిస్తూ.. మంగళవారం నాటికి ఇది రూ.102000లకు చేరింది. దీంతో పుత్తడి కొనాలనుకునే వారు పరేషాన్ అవుతున్నారు.
మరి బంగారం ధరలు ఇలా భగభగ మనడానికి కారణాలు ఏంటి? ఎందుకు? అనే విషయాలు ఇప్పుడు ఏ ఇద్దరు కలిసినా చర్చకు వస్తున్నాయి. సాధారణంగా ఏ ఇద్దరు వ్యక్తులు కలిసినా.. రాజకీయాల గురించి చర్చించుకోవడం కామన్.. కానీ ఇప్పుడు మాత్రం ఎవరైనా సరే.. బంగారం ఏంటి బ్రో ఇంత పెరిగిపోయింది? అనే చర్చించుకునే పరిస్థితి వచ్చింది. మార్కెట్ వర్గాలు, నిపుణులు అయితే.. విశ్లేషణలపై విశ్లేషణలు చేస్తూ.. బిజీబిజీగా గడిపేస్తున్నారు..
ఈ నేపథ్యంలో బంగారం ధరల వ్యవహారం ఆసక్తిని పెంచేసింది. ప్రస్తుతం పెరుగుతున్న ధరలకు మూలకారణం ఏంటని ఆలోచిస్తే.. ఒకటి కాదు రెండు మూడు ప్రధాన ప్రపంచ స్థాయి కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. 1) అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుసరిస్తున్న విధానాలు. 2) ప్రపంచ వ్యాప్తంగా బంగారంపై పెరుగుతున్న ఆసక్తి. 3) ప్రభుత్వ రంగ బ్యాంకులు సైతం ఇప్పుడు బంగారాన్ని కొనుగోలు చేస్తుండడం.
దీంతో ప్రపంచ వ్యాప్తంగా కూడాబంగారం డిమాండ్ పెరిగిపోయింది. వాస్తవానికి మన దేశంలో భూములపై పెట్టుబడులు పెడతారు. దక్షిణాదిలో అయితే మరింత ఎక్కువ. కానీ.. ప్రపంచ వ్యాప్తంగా బూములపై కన్నా.. బంగారంపైనే పెట్టుబడులు పెట్టే పరిస్థితి ఉంది.. పైగా ట్రంప్ అనుసరిస్తున్న సుంకాల విధానంతో ఎప్పుడు ఏ ధర ఎలా పెరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. అంతేకాదు.. ఏ రంగం ఎప్పుడు కుప్పకూలుతుందో కూడా తెలియని దుస్థితి ఉంది.
ఎప్పుడు తగ్గొచ్చు?
ఈ నేపథ్యంలోనే పుత్తడిపై పెట్టుబడులు పెరుగుతున్నాయి. దీంతో బంగారం ధరలు మరింత వేగంగా పుంజుకున్నాయని నిపుణులు చెబుతున్నారు. అమెరికా విధానాలు సమీక్షించడం మొదులు పెట్టినా.. ప్రపంచ వ్యాప్తంగా యుద్ధ భయాలు తగ్గినా.. అప్పుడు మాత్రమే బంగారం ధరలు కొంత మేరకు దిగి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
This post was last modified on April 22, 2025 8:31 pm
గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…
బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…
నేను క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి ఎక్కడికివెళ్లినా అక్కడ కూడా పెట్టుబడుల మీద ఒప్పందాల గురించి చర్చిస్తుంటాను. ఒక టీ 20…
గతంలో అంటే.. 2012 నాటి పరిస్థితులను గమనిస్తే.. జగన్‌కు పెద్ద మైనస్ అనే చెప్పాలి. అప్పట్లో ఆయనపై అక్రమాస్తుల కేసులు…
గత ఎన్నికల్లో ఓడిపోయిన ఒకరిద్దరు టీడీపీ అభ్యర్థులు పట్టు బిగిస్తున్నారు. తమకు మంత్రి నారా లోకేషే ఆదర్శమని కూడా చెబుతున్నారు.…
రాజకీయాల్లో కీలక స్థానాల్లో ఉండే వారి నుంచి వచ్చే మాటల వెనుక ఊహకు అందని లెక్కలు.. సమీకరణాలు ఉంటాయి. అందునా..…