“న్యాయస్థానాలకు రాజ్యాంగపరమైన రక్షణ కల్పించడంతో ఎవరూ ఆయా కోర్టుల తీర్పులపై కామెంట్లు చేసే సాహసం చేయలేక పోతున్నారు. లేకపోతే.. “ అంటూ.. ఇటీవల ప్రముఖ విశ్లేషకుడు ఒకరు జాతీయ మీడియాలో వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఇదే వ్యాఖ్య మరోసారి రిపీట్ అవుతోంది. దీనికి కారణం.. తన భార్యను ఓ వ్యక్తి దారుణంగా `వాడేసుకున్నాడని`.. అసహజ లైంగిక చర్యలతోపాటు.. ఆమెపై అనేక రూపాల్లో శృంగారానికి పాల్పడ్డాడని పేర్కొంటూ.. ఓ భర్త కోర్టును ఆశ్రయించాడు.
సదరు నిందితుడిని అరెస్టు చేయాలని.. కోర్టును అభ్యర్థించాడు. కానీ.. ఘనత వహించిన ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. “ఇది మహా భారత కాలం కాదు.. నీ భార్య నీ ఆస్తే కాదు. భార్యను ఆస్తిగా పరిగణించే భావజాలానికి ఎప్పుడో కాలం చెల్లింది“ అని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. అంతేకాదు.. వివాహేతర సంబంధాన్ని నేరంగానో.. కుట్రగానో చూడాల్సిన అవసరం లేదని.. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉటంకించింది.
అంతేకాదు.. వివాహేతర సంబంధం కేవలం ఇద్దరు వ్యక్తుల నైతికతకు సంబంధించిన విషయమని.. దానిని నేరంగా చూడాల్సిన అవసరం లేదని కోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో సదరు నిందితుడిని అరెస్టు చేయమని కానీ.. కేసు నమోదు చేయాలని కానీ.. కోర్టు ఆదేశించజాలదని పేర్కొన్నారు. అనంతరం.. నిందితుడు దాఖలు చేసిన పిటిషన్‌పై ఉత్తర్వులు జారీ చేసింది. కాగా.. ఈ తీర్పు ఇచ్చిన న్యాయమూర్తి జస్టిస్ నీనా అనే మహిళకావడం గమనార్హం.
This post was last modified on April 19, 2025 4:34 pm
వైసీపీ పాలనా కాలంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 900 డాలర్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తిరుమల…
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…