గయ్యాళి అత్తలు.. మెతకైన కోడళ్ల వివాదాలు తెలిసిందే. అదనపు కట్నం కోసం వేధించిన అత్తలు.. మగ పిల్లల కోసం తపించిన తపించిన అత్తలు.. కోడళ్లను ఆరళ్లు పెట్టిన కేసులు కోకొల్లలు. ఈ నేపథ్యంలోనే అత్తలు, మెట్టినింటి వారి ఆరళ్ల నుంచి తప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం గతంలో గృహ హింస వ్యతిరేక చట్టం తీసుకువచ్చింది. 2006-07 మధ్య వచ్చిన ఈ చట్టం కోడళ్ల ఉసురు తీసే అత్తలకు, మెట్టినింటి వారికి సింహ స్వప్నంగా మారింది.
అయితే.. ఈ గృహ హింస చట్టంలోని 498 సెక్షన్ దుర్వినియోగం అవుతూ వస్తోందన్న వార్తలు కూడా తెలిసిందే. తనను బ్యూటీపార్లర్ వెళ్లనివ్వకుండా అడ్డుకున్న అత్తపైనా.. భర్తపైనా గృహ హింస చట్టం కింద కేసులు పెట్టిన వారు ఉన్నారు. తన లవర్‌తో మాట్లాడకుండా ఫోన్ లాక్కున్న భర్తపైనా కేసులు పెట్టిన భార్యలు ఉన్నారు. ఈ నేపథ్యంలో సెక్షన్ 498 దుర్వినియోగం అవుతోందని కోర్టులు సైతం వ్యాఖ్యానించాయి. కానీ, దీనిలో మార్పు రాలేదు.
అయితే.. కాలం మారింది. ఇప్పుడు ఉద్యోగాలు చేసుకునే కోడళ్లు వచ్చారు. దీంతో కథ రివర్స్ అయింది. కోడళ్లే అత్తలపై తిరగబడుతున్న, వేధిస్తున్న కేసులు పెరుగుతున్నాయి. తాజాగా ఓ అత్తను ఢిల్లీలో కోడలు ఈడ్చి ఈడ్చి కొట్టిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. అదేవిదంగా.. అన్నం పెట్టకుండా మామను వేధించిన కోడలు గురించి కూడా.. సభ్యసమాజం ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా అలహాబాద్ హైకోర్టు సంచలన ఉత్తర్వులు జారీ చేసింది.
గృహ హింస నిరోధక లేదా వ్యతిరేక చట్టం కేవలం కోడళ్లకే కాదని.. అది అత్తలు, మామలకు కూడా వర్తిస్తుందని తేల్చి చెప్పింది. కోడళ్ల ఆగడాలకు బలవుతున్న అత్తలు ఈ చట్టం కింద కేసులు పెట్టుకునే వెసులుబాటు ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు దాఖలైన ఓ కేసులో .. అత్తను వేధించిన కోడలిపై ఎఫ్ ఐఆర్ నమోదు చేయాలని.. ఆమెను అరెస్టు చేయాలని కూడా ఆదేశించడం గమనార్హం.
This post was last modified on April 18, 2025 3:40 pm
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…