Trends

అమెరికా వెళుతున్నారా?.. తస్మాత్ జాగ్రత్త!

అగ్రరాజ్యం అమెరికా అంటే అందరికీ క్రేజే. చదువుకోవడానికి అయినా, ఉద్యోగం చేయడానికి అయినా.. చివరికి టూర్లకైనా కూడా మన తొలి ప్రాధాన్యం అమెరికాకే. ఆర్థిక పరిస్థితి సహకరించకపోతే తప్పించి.. ఈ భావనలో మార్పు ఉండదని చెప్పొచ్చు. ఆ దేశానికి ఉన్న క్రేజ్ అది. అయితే ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత అమెరికా వైపు చూడాలంటేనే అందరూ హడలిపోతున్నారు. ఇలాంటి వేళ… అమెరికాకు ఏ కారణంతో అయినా వెళ్లాలనుకునే వారు ఇకపై మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే… ఆ దేశంలో తనిఖీలు మరింత కఠినమైపోయాయి. నిత్యావసరాలుగా మారిన మన మొబైళ్లు, ల్యాప్ టాప్ లను అక్కడి పోలీసులు తనిఖీ చేస్తారు. అవసరమనుకుంటే సీజ్ చేస్తారు కూడా.

నిజమే..ఈ వార్తలు అక్షర సత్యమే. ఇకపై అమెరికాలో కాలుపెట్టే వారిపై తనిఖీలు మరింత ముమ్మరం కానున్నాయి. అలాంటి వారిలో గ్రీన్ కార్డ్ హోల్డర్లు అయినా, ఆ దేశ పౌరులు అయినా, సాధారణ విదేశీ ప్రయాణికులైనా కూడా తనిఖీల్లో ఎలాంటి తేడాలు ఉండవట. అయితే అమెరికా పౌరులు, గ్రీన్ కార్డ్ హోల్డర్లకు తనిఖీల్లో ఏదైనా తప్పు తేలితే.. వాటిపై పోరాటం చేసేందుకు హక్కు ఉంటుంది. ఇతరత్రా సాధారణ విదేశీయులకు మాత్రం ఆ హక్కు కూడా ఉండదట. వెరసి కొత్తగా అమలులోకి రానున్న తనిఖీలతో అమెరికాకు వెళ్లే ప్రయాణికులు మరింత జాగరూకతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా అమెరికా వెళ్లే సందర్భంగా మన వ్యక్తిగత సమాచారం ఉన్న డిజిటల్ పరికరాలను తీసుకోకుండా వెళితేనే సేఫ్ అని కూడా నిపుణులు సూచిస్తున్నారు.

యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) అధికారులు ఇకపై విమానాశ్రాయాల్లో తనిఖీలను ముమ్మరం చేయనున్నారట. ఇందులో భాగంగా ప్రయాణికుల వద్ద ఉండే మొబైల్, ల్యాప్ టాప్, ట్యాబ్ తదితర ఎలక్ట్రానిక్ పరికరాలను తనిఖీ చేస్తారట. ఈ తనిఖీలకు అందరూ సమ్మతించాల్సిందేనట. తనిఖీల సందర్బంగా మరింత పరిశీలన అవసరం అనిపిస్తే… ఆయా వ్యక్తుల డిజిటల్ పరికరాలను అదికారులను సీజ్ చేస్తారట. నిర్దేశిత గడువు 5 రోజుల పాటు ఆ పరికరాలను వారి వద్దే ఉంచుకుంటారట. ఆ తర్వాత కూడా మరింత పరిశీలన అవసరం అయితే..మరో 7రోజుల పాటు వాటిని అదికారులు తమ వద్దే ఉంచుకునే అివకాశం లేకపోలేదట. ఇలా ఈ వాయిదాలను మరింతగా పెంచే ప్రమాదం లేకపోలేదట. అంతిమంగా మన పరికరాలు మన చేతికి వచ్చినా.. దానిలోని సమాచారం ఏ మేరకు సేఫ్ అన్నదే ఇప్పుడు అసలు సిసలు ప్రశ్నగా మారింది.

మన వ్యక్తిగత సమాచారాన్ని భద్రంగా ఉంచుకోవాలంటే… అమెరికా వెళ్లే సమయంలో మనం నిత్యం వినియోగించే డిజిటల్ పరికరాలను కాకుండా కేవలం టూర్ నిమిత్తం వినియోగించే పరికరాలను మాత్రమే వెంట తీసుకెళితే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. వీటిలోనూ మన లాగిన్ ను డిజేబుల్ చేయాలని కూడా సూచిస్తున్నారు. మన కీలక సమాచారం ఉన్న వాటి పాస్ వర్డ్ లు, ఇతరత్రా అకౌంట్ల వివరాలు లేని వస్తువులను తీసుకెళ్లడం మంచిదని సలహా ఇస్తున్నారు. ఇక అమెరికాలో అదికారులు మన వస్తువులను సీజ్ చేస్తే… దానికి సంబంధించిన పత్రాలను తప్పనిసరిగా తీసుకోవాలని, ఆయా వస్తువులను తిరిగి మన చేతికి రాగానే వాటి పాస్ వర్డ్ లను మార్చుకోవాలని చెబుతున్నారు. మొత్తంగా ఇకపై అమెరికా టూర్ కు వెళ్లే ముందు చాలా జాగ్రత్తలు తీసుకోవాలన్నది సర్వత్రా వినిపిస్తున్నమాట.

This post was last modified on April 18, 2025 2:09 pm

Share

Recent Posts

బోయపాటికి ఎస్ చెప్పే హీరో ఎవరు

అఖండ 2 తాండవం వచ్చి తొమ్మిది నెలలు అయిపోయాయి. సీక్వెల్ అందులోనూ బ్లాక్ బస్టర్ కొనసాగింపు కాబట్టి బాలయ్య మరోసారి…

3 minutes ago

పిఠాపురం ఆడ‌ప‌డుచుల‌కు ప‌వ‌న్ రాఖీలు!

తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి జిల్లాలోని పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంతో ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌త్యేక అనుబంధాన్ని…

28 minutes ago

సుమంత్ సరైన దారిలో వెళ్తున్నట్టే

ఒకప్పుడు సత్యం, గోదావరి, గౌరీ లాంటి హిట్లతో మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో సుమంత్ తర్వాత వరస ఫ్లాపుల దెబ్బకు…

32 minutes ago

దారిన ప‌డుతున్న నేత‌లు… `వైసీపీకి నో ఛాన్స్‌!`

స్థానిక ఎన్నిక‌ల్లో కూట‌మి పార్టీల మ‌ధ్య చిరాకులు, ప‌రాకుల‌కు అవ‌కాశం ఉంటుంద‌ని.. త‌మ‌కు అది మేలు చేస్తుంద‌ని భావిస్తున్న వైసీపీకి…

1 hour ago

ట్రంప్ తుంట‌రి నిర్ణ‌యం… తిట్టిపోస్తున్న నెటిజ‌న్లు!

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణ‌యాలు విస్మ‌యానికి గురి చేస్తున్నాయి. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఇరాన్‌పై ఒంటికాలిపై లేచిన…

3 hours ago

పులివెందులకు రమ్మంటావా… తాడేపల్లికి రమ్మంటావా

డీఎస్సీ నియమకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ కు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్…

3 hours ago