ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి క్రీడా రంగంలో ఓ చరిత్రాత్మక మైలురాయిని చేరుకోనుంది. దేశంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా వెలుగొందబోతున్న ఈ ప్రాజెక్టుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని తెలుస్తోంది. మొత్తం 1.32 లక్షల సీటింగ్ సామర్థ్యం గల ఈ భారీ స్టేడియం అమరావతిలోని 200 ఎకరాల స్పోర్ట్స్ సిటీ భాగంగా నిర్మితమవుతుంది. నరేంద్ర మోడీ స్టేడియంతో సమానంగా ఉండే ఈ స్టేడియం భారత క్రికెట్ చరిత్రలో మరో ఘట్టాన్ని ప్రారంభించనుంది.
ఈ ప్రాజెక్టును ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ACA) ప్రతిపాదించగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తి మద్దతు ఇచ్చారు. రాష్ట్ర యువతలో క్రికెట్ అభిమానం పెంచడంతో పాటు, దేశవిదేశాల నుంచి ఆడగాళ్లను ఆకర్షించేలా ఈ స్టేడియాన్ని రూపొందించనున్నారు. ఐపీఎల్, టీ20 వరల్డ్ కప్ వంటి మెగా ఈవెంట్లను అమరావతిలో నిర్వహించే లక్ష్యంతో ఈ నిర్మాణం సాగనుంది. అమరావతిని స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దే ప్రయత్నాల్లో ఇది కీలక అడుగుగా చెప్పవచ్చు.
స్టేడియానికి సరిపడే విధంగా రవాణా, పార్కింగ్, హోటల్స్, ట్రైనింగ్ అకాడెమీలు, రెసిడెన్షియల్ ఫెసిలిటీస్ వంటి మౌలిక వసతుల నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం సమాంతరంగా చేపట్టనుంది. ఇప్పటికే ఐసీసీ చైర్మన్ జై షా ఈ ప్రాజెక్టుకు అంగీకారం తెలపడం రాష్ట్రానికి ప్రతిష్ఠను తీసుకురానుంది. ఇక త్వరలోనే భూమి పూజ జరిపి నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నారు.
ఇదే సమయంలో విశాఖలోని స్టేడియాన్ని ఐపీఎల్ ప్రమాణాలకు తగినట్టు అభివృద్ధి చేయడం, మంగళగిరిలో రంజీ స్థాయి మ్యాచ్‌లకు వేదిక సిద్ధం చేయడం, కడప, విజయవాడ, విజయనగరం, అరకు, కుప్పం, కళ్యాణదుర్గం వంటి ప్రాంతాల్లో క్రికెట్ అకాడమీలను ఏర్పాటు చేయడమూ ఏసీఏ ప్రణాళికలో భాగంగా ఉన్నాయి. దీంతో రాష్ట్రం అంతటా క్రికెట్ దిశగా ఆసక్తి పెరుగుతుంది. ఈ క్రికెట్ స్టేడియం నిర్మాణంతో అమరావతి ఒక జాతీయ స్థాయి క్రికెట్ కేంద్రంగా మారనుంది.
This post was last modified on March 25, 2025 3:59 pm
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…