ముంబై పేలుళ్లు, భారత పార్లమెంటుపై ఉగ్రవాద దాడులను లైవ్‌లో పర్యవేక్షించినట్టు ఆరోపణలు ఉన్న.. మోస్ట్ వాంటెడ్ ఐసిసి ఉగ్రవాది.. ఇస్లామిక్ స్టేట్ ప్రపంచ స్థాయి కార్యక్రమాల అధినేత అబ్దులా మక్కీని అమెరికా దారుణంగా హత మార్చింది. నడిరోడ్డుపై ఆయన ప్రయాణిస్తున్న కారుపై క్షిపణిని ప్రయోగించి.. ప్రాణాలు తీసింది. దీనికి అమెరికా మిత్ర దేశం.. ఇరాక్ కూడా సహకరించడం గమనార్హం. ఇరాక్-అమెరికా చేపట్టిన సంయుక్త ఆపరేషన్‌లో మక్కీ హతమైనట్టు అగ్రరాజ్యం అధినేత ట్రంప్ ప్రకటించారు.
ఎవరీ మక్కీ?
ప్రపంచంలో ఎక్కడ ఎలాంటి ఉగ్ర కార్యక్రమాలు చేపట్టాలన్నా.. దానికి పక్కా ప్లాన్ వేయడంలోనూ.. అనుకున్నది అనుకున్నట్టు చేయడంలోనూ.. అబ్దుల్లా మక్కీ పేరొందిన ఉగ్రవాది. పాకిస్థాన్, ఇరాక్ దేశాల్లో బలమైన శిబిరాలను ఏర్పాటు చేసి.. యువతకు ఉగ్రకార్యక్రమాల్లోనూ ఈయన శిక్షణ ఇస్తున్నాడు. ముంబై ఉగ్రదాడులు, పార్లమెంటుపై జరిగిన దాడులకు పక్కా స్కెచ్ వేసింది కూడా ఈయనేనని భారత్ ఇప్పటికీ విశ్వసిస్తోంది. గతంలోనే ఈయనను హతమార్చేందుకు ప్రణాళిక వేసిన అమెరికా.. తాజాగా ఆ పని పూర్తి చేసింది.
ఎలా చంపారు?
ఈ నెల 13న అమెరికా-ఇరాక్ సేనలు.. సంయుక్తగా అత్యంత రహస్య ఆపరేషన్ నిర్వహించాయి. మక్కీ కారులో వెళ్తుండగా అమెరికా దళాలు క్షిపణి ప్రయోగించాయి. దీంతో ఘటనాస్థలంలోనే అతను హతమయ్యాడు. అతనితో పాటు మరో ఉగ్రవాది కూడా చనిపోయినట్లు అమెరికా ఇంటెలిజెన్స్ పేర్కొంది. ఈ క్షిపణి దాడి అనంతరం మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు. అయితే.. వారు ముందుగానే తమను తాము పేల్చేసుకునేందుకు సూసైడ్ బాంబులు అమర్చుకున్నట్టు గుర్తించారు.
ఇరాక్‌కు స్వేచ్ఛ
ఇరాక్ సహా చుట్టుపక్కల ముస్లిం దేశాలకు కంట్లో నలుసుగా మారిన మక్కీ.. హత్యతో ఇరాక్‌కు స్వేచ్ఛ లభించిందని ఆ దేశ ప్రధాని ప్రకటించారు. ఇది ఇరాకీ ప్రజలకు.. పండుగ రోజని చెప్పారు. ఇక, అమెరికా కూడా.. ఇరాక్ స్వేచ్ఛగా జీవించవచ్చని పేర్కొంది. మక్కీని హత మార్చడంలో అమెరికా ఎంతో సాహసోపేత విన్యాసం చేసిందని ట్రంప్ పేర్కొనడం గమనార్హం. ఇరాక్‌కు శాంతి, ప్రపంచానికి ప్రశాంతత లభించాయని తెలిపారు.
This post was last modified on March 15, 2025 4:48 pm
ఎన్ని నామినేషన్లు వెళ్లినా, మన వైపు నుంచి పెద్ది ఇరుముడి లాంటి బ్లాక్ బస్టర్లను పంపినా, ఆస్కార్ బరిలో మరాఠి…
నిన్న చెన్నైలో జరిగిన ఒక సినిమా ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సిబి చక్రవర్తి అట్లీని పొగిడే క్రమంలో…
పార్టీ ఏదైనా.. నాయకుడు ఎవరైనా సొంత సామాజిక వర్గం అండ అయితే ఉండాలి. పోనీ.. అది లేకపోతే.. ప్రజాబలం అయినా…
ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…
వైయస్ కుటుంబంలో ఆస్తి తగాదాలు ఇంకా సమసిపోయినట్లు కనిపించడం లేదు. అన్నా చెల్లెళ్ళ మధ్య దూరం తరిగిన సూచనలు కానరావడం…
ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…