విదేశాల్లో ఉద్యోగం పేరుతో వెళ్లిన ఓ భారతీయ మహిళకు అక్కడే మరణశిక్ష అమలవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన షెహజాది ఖాన్ అనే మహిళ యూఏఈలో హత్య కేసులో దోషిగా తేలడంతో ఆమెకు అక్కడి ప్రభుత్వం మరణశిక్ష విధించింది. ఫిబ్రవరి 15న ఈ శిక్షను అమలు చేయగా, తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
కుమార్తెను కాపాడాలని ఆమె కుటుంబం ఎంతగా ప్రయత్నించినా, చివరకు ఫలితం లేకుండానే ఆమె ప్రాణాలు కోల్పోయింది. మరణశిక్ష అమలుకు ముందు, షెహజాదికి తన చివరి కోరికను తెలియజేయాలని జైలు అధికారులు అనుమతించారు. దీంతో ఆమె తన కుటుంబ సభ్యులతో చివరిసారి మాట్లాడింది. నిర్దోషినని చెప్పుకుంటూనే కన్నీటిపర్యంతమైంది. కానీ, ఆ అశ్రువులు ఏమీ చేయలేకపోయాయి.
ఈ ఘటన వెనుక షెహజాది జీవితం మలుపులు తిరిగిన కథ కూడా ఉంది. 2020లో యూపీలోని తన గ్రామంలో ఓ అగ్నిప్రమాదంలో గాయపడిన ఆమె, కోలుకున్నాక జీవితం మెరుగుపడుతుందని భావించి ఒక వ్యక్తి మాటలు నమ్మి యూఏఈ వెళ్లింది. అయితే, అక్కడ పని కల్పిస్తానని నమ్మించి ఆమెను ఒక కుటుంబానికి విక్రయించారు. షెహజాది ఫైజ్, నాడియా అనే దంపతుల ఇల్లు చేరింది. అక్రమ మానవ రవాణా కేసులో ఆ దంపతులపై కూడా కేసు నమోదైంది.
అయితే మరో ఆశ్చర్యకరమైన ఘటన ఆ ఫ్యామిలీలోనే చోటు చేసుకుంది. మొదట దంపతులు వారి చిన్నారి సంరక్షణ బాధ్యత ఆమెకు అప్పగించారు. అనుకోకుండా ఆ చిన్నారి మృతి చెందింది. దీంతో షెహజాదిపై హత్య ఆరోపణలు మోపి, ఆమెను నేరస్తూరాలిగా నిలిపారు. తాను క్షేమంగానే చిన్నారిని చూసుకునేదాన్నని, కానీ ఆ దంపతుల వల్లే పాప చనిపోయినట్లు ఆమె తెలిపింది.
మెడిసిన్ విషయంలో నిర్లక్ష్యం వహించారని కోర్టుకు తెలుపగా, కోర్టు మాత్రం ఆమె వాదనను అంగీకరించలేదు. అక్కడి దర్యాప్తు బృందాలు ఆమెపై తీవ్ర ఆరోపణలు మోపడంతో, చివరకు మరణశిక్ష విధించారు. యూపీలోని షెహజాది తండ్రి ప్రభుత్వాన్ని ఆశ్రయించినా, ఆమెను కాపాడే అవకాశం లేకుండా పోయింది. షెహజాదికి మరణశిక్ష అమలవగా, ఈ ఘటన ఇప్పుడు భారతదేశంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
This post was last modified on March 4, 2025 4:57 am
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…