టీమిండియాకు టాస్ విషయంలో బ్యాడ్ లక్ గట్టిగానే వెంటాడుతోంది. 2023 నవంబర్ 19న వరల్డ్ కప్ ఫైనల్ నుంచి ఇప్పటి వరకు వరుసగా 11 వన్డేల్లో టాస్ గెలవలేకపోయింది. ఈ క్రమంలో బంగ్లాదేశ్‌తో ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లో టాస్ ఓడి, నెదర్లాండ్స్ పేరిట ఉన్న చెత్త రికార్డును సమం చేసింది. 2011 నుంచి 2013 మధ్యలో నెదర్లాండ్స్ జట్టు వరుసగా 11 వన్డేల్లో టాస్ ఓడిన రికార్డు చేసింది.
ఇటీవల దక్షిణాఫ్రికా, శ్రీలంక, ఇంగ్లండ్ సిరీస్‌లలోనూ భారత జట్టుకు టాస్ వరుసగా చేజారింది. దక్షిణాఫ్రికాతో మూడు వన్డేలు, ఆపై శ్రీలంకతో మూడు వన్డేలు, స్వదేశంలో ఇంగ్లండ్‌తో మూడు వన్డేలు – అన్ని మ్యాచ్‌ల్లోనూ రోహిత్ శర్మ టాస్‌లో అదృష్టాన్ని వదులుకున్నాడు. చివరికి ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లోనూ టాస్ ఓడి, ఆ దురదృష్టం కొనసాగుతూనే ఉంది.
టాస్ ఓడటం వలన జట్టుపై పెద్దగా ప్రభావం పడకపోయినా, కీలక మ్యాచ్‌లలో ఇలాంటి పరిస్థితులు వ్యూహాలకు ఆటంకం కలిగిస్తాయి. టాస్ గెలవడం వలన ఫస్ట్ బ్యాటింగ్, బౌలింగ్ లాంటి నిర్ణయాలు కండిషన్స్‌ను బట్టి తీసుకోవచ్చు. కానీ వరుసగా 11 సార్లు టాస్ చేజారడం జట్టు పథకాలను కాస్త సంక్లిష్టం చేస్తోంది. ఇక రాబోయే మ్యాచ్ లు దుబాయ్ లోనే ఉండడంతో అక్కడ బ్యాటింగ్ పిచ్ లు టాస్ వలన ప్రమాదంగా మారే అవకాశం ఉంది. న్యూజిలాండ్, పాకిస్తాన్ జట్లతో ఛేజింగ్ కు వెళితే ఓకే కానీ ఫస్ట్ బ్యాటింగ్ ఎదురైతే బౌలర్లు ఒత్తిడిని తట్టుకోవడం కష్టమే. అసలే బుమ్రా లేడు.
ఇక ఇప్పుడు టీమిండియా మరో మ్యాచ్‌లో టాస్ ఓడితే, నెదర్లాండ్స్ రికార్డును అధిగమించి కొత్త రికార్డు నమోదు చేసుకోవడం ఖాయం. ఇది ఒక చెత్త రికార్డు అయినా, క్రికెట్‌లో అటు గెలుపు, ఇటు ఓటమి కేవలం టాస్ మీద ఆధారపడి ఉండదు. కానీ, ఇలా టాస్‌లో నిరంతర పరాజయం ఒక ఆసక్తికరమైన అంశంగా మారింది. మరి, రోహిత్ శర్మ సారథ్యం వహిస్తున్న భారత జట్టు ఈ దురదృష్ట చక్రవ్యూహం నుంచి ఎప్పటికి బయటపడుతుందో చూడాలి.
This post was last modified on February 20, 2025 5:25 pm
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…