తెలంగాణలో ఆశ్చర్యకరమైన వైద్య ఘటన చోటుచేసుకుంది. 26 ఏళ్ల యువకుడి ఊపిరితిత్తుల్లో గత 21 ఏళ్లుగా పెన్ క్యాప్ ఉండిపోయిందని, ఆ సమస్యను గుర్తించి విజయవంతంగా తొలగించారని కొండాపూర్ కిమ్స్ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. నెల రోజులుగా యువకుడు శ్వాస సమస్యలు, బరువు తగ్గడం, నిరంతరమైన దగ్గుతో బాధపడుతున్నాడు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఉన్నట్లు స్థానిక వైద్యులు గుర్తించగా, మెరుగైన చికిత్స కోసం కుటుంబ సభ్యులు అతడిని కిమ్స్ ఆసుపత్రికి తీసుకువచ్చారు.
ఆసుపత్రిలో సీటీ స్కాన్ నిర్వహించగా, ఊపిరితిత్తుల్లో గడ్డలాంటి ఆకారం కనిపించింది. మొదట దాన్ని సాధారణ ఇన్ఫెక్షన్ అని భావించిన వైద్యులు, మరింత లోతుగా పరీక్షించగా ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది. గడ్డలాంటి ఆకారం కాదు, అసలు సమస్య ఊపిరితిత్తుల్లో చిక్కుకుపోయిన పెన్ క్యాప్ అని తెలిసింది. విషయం బయటకురాగానే కుటుంబ సభ్యులను విచారించగా, చిన్నప్పుడు ఆ బాలుడు పెన్ క్యాప్ మింగిన విషయం గుర్తు చేసుకున్నారు. 5 ఏళ్ల వయసులోనే ఇలా జరిగిందని, కానీ అప్పటి వైద్య పరీక్షల్లో ఏమీ తేలలేదని తల్లిదండ్రులు తెలిపారు.
డాక్టర్ శుభకర్ నాదెళ్ల నేతృత్వంలో వైద్య బృందం అత్యంత జాగ్రత్తగా శస్త్రచికిత్స నిర్వహించింది. దాదాపు మూడు గంటల పాటు సాగిన ఆపరేషన్‌లో ఫ్లెక్సిబుల్ బ్రాంకోస్కోపీ సాయంతో ముందుగా క్యాప్ చుట్టూ పేరుకుపోయిన కణజాలాన్ని తొలగించారు. తర్వాత, క్యాప్ ను సురక్షితంగా బయటకు తీశారు. వైద్యులు ఎంతో శ్రమించడంతో ఆ యువకుడు పూర్తి ఆరోగ్యంగా కోలుకున్నాడు.
ఇంతకాలం పెన్ క్యాప్ ఊపిరితిత్తుల్లోనే ఉండిపోవడం, అయినా యువకుడు సాధారణ జీవితం గడపగలగడం ఆశ్చర్యకరమైన విషయం అని వైద్యులు తెలిపారు. చిన్నప్పుడు మింగిన చిన్న వస్తువులు ఈ విధంగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీయొచ్చని, అందుకే తల్లిదండ్రులు పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ ఘటన వైద్య శాస్త్రంలో అరుదైన సందర్భమని, దీని వల్ల భవిష్యత్తులో ఇలాంటి కేసులను త్వరగా గుర్తించే అవకాశం ఉంటుందని వైద్యులు అభిప్రాయపడ్డారు.
This post was last modified on February 20, 2025 1:04 pm
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…
సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…
టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…
సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…
అక్టోబర్ 9 విడుదల కాబోతున్న కామ్రేడ్ కళ్యాణ్ వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ఎదురుగా ఆదర్శ కుటుంబం ఏకె 47…