ప్రపంచ వాణిజ్య విఫణిలో భారత దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ సత్తా చాటింది. గతంలో ఏ ఒక్క బారత కంపెనీకి దక్కని కీర్తి ప్రతిష్ఠలను ఒడిసిపట్టేసిన రిలయన్స్ ఇండస్ట్రీస్… టాప్ బ్రాండింగ్ కంపెనీల్లో రెండో స్థానంలో నిలిచి భారతీయులకు గర్వ కారణంగా నిలిచింది. నిజంగానే రిలయన్స్ సాధించిన ఈ ఘనతతో ప్రతి భారతీయుడి ఛాతీ ఉప్పొంగిపోయిందని చెప్పక తప్పదు. నిన్నటిదాకా బ్రాండింగ్ లో తొలి స్థానంలో ఉన్న అమెరికా దిగ్గజం ఆపిల్ ను మించిన బ్రాండ్ గా రిలయన్స్ ఎదిగింది. ఈ మేరకు ఫ్యూచర్ బ్రాండ్ ఇండెక్స్ 2024 పేరిట విడుదలైన జాబితాలో రిలయన్స్ రెండో స్థానంలో నిలిచింది.
ఏటా ప్రపంచంలోని టాప్ 100 కంపెనీల బ్రాండ్లు, వాటికి దక్కుతున్న ఆదరణ, కంపెనీ ఎదుగుతున్న తీరు, కంపెనీ నెట్ వర్త్ లను పరిగణనలోకి తీసుకునే ఫ్యూచర్ బ్రాండ్ ఇండెక్స్ ఓ జాబితాను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది ఇదే జాబితాలో రిలయన్స్ ఏకంగా 13 స్థానంలో నిలిచింది. అదే సమయంలో ఆపిల్ టాప్ ప్లేస్ లో నిలిచింది. అయితే కేవలం ఏడాది వ్యవధిలోనే సత్తా చాటిన రిలయన్స్ 13వ స్థానం నుంచి ఒకేసారి రెండో స్థానానికి ఎగబాకింది. నిరుడు ఫస్ట్ ప్లేస్ లో ఉన్న ఆపిల్… రిలయన్స్ తర్వాతి స్థానమైన థర్డ్ ప్టేస్ తో సరిపెట్టుకుంది.
ఫ్యూచర్ బ్రాండ్ ఇండెక్స్ 2024 జాబితాలో ఈ ఏడాది కొరియాకు చెందిన కంపెనీ శాంసంగ్ తొలి స్థానంలో నిలిచింది. శాంసంగ్ తర్వాత రిలయన్స్ రెండో స్తానంలో నిలవగా… ఆ తర్వాతి స్థానాల్లో ఆపిల్, నైక్, వాల్డ్ డిస్నీ, నెట్ ఫ్లిక్స్, మైక్రోసాఫ్ట్, ఇంటెల్, టయోటాలు నిలిచాయి. ఇదిలా ఉంటే… ఈ జాబితాలో బారత్ నుంచి ఒక్క రిలయన్స్ కు మాత్రమే చోటు దక్కింది. మరే ఇతర భారత కంపెనీలకు ఈ జాబితాలో చోటే దక్కలేదు. ఈ జాబితాలో చోటు దక్కించుకున్నఒకే ఒక్క ఇండియన్ కంపెనీగా నిలిచిన రిలయన్స్ ఏకంగా రెండో స్థానంలో నిలవడం గమనార్హం.
This post was last modified on February 17, 2025 10:55 pm
గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…
బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…
నేను క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి ఎక్కడికివెళ్లినా అక్కడ కూడా పెట్టుబడుల మీద ఒప్పందాల గురించి చర్చిస్తుంటాను. ఒక టీ 20…
గతంలో అంటే.. 2012 నాటి పరిస్థితులను గమనిస్తే.. జగన్‌కు పెద్ద మైనస్ అనే చెప్పాలి. అప్పట్లో ఆయనపై అక్రమాస్తుల కేసులు…
గత ఎన్నికల్లో ఓడిపోయిన ఒకరిద్దరు టీడీపీ అభ్యర్థులు పట్టు బిగిస్తున్నారు. తమకు మంత్రి నారా లోకేషే ఆదర్శమని కూడా చెబుతున్నారు.…
రాజకీయాల్లో కీలక స్థానాల్లో ఉండే వారి నుంచి వచ్చే మాటల వెనుక ఊహకు అందని లెక్కలు.. సమీకరణాలు ఉంటాయి. అందునా..…