భారత క్రికెట్లో అత్యంత విజయవంతమైన జోడీల్లో సచిన్ టెండూల్కర్-వీరేంద్ర సెహ్వాగ్‌లది ఒకటి. గంగూలీతో కలిసి చరిత్రాత్మక భాగస్వామ్యాలు ఎన్నో నెలకొల్పి, రికార్డుల మోత మోగించాక.. సచిన్ వీరూతో జత కలిశాడు. సచిన్ స్ఫూర్తితో క్రికెట్లోకి వచ్చి, సచిన్‌ను అనుకరిస్తూ బ్యాటింగ్ చేస్తూ ఆకట్టుకున్న వీరూ.. ఆ తర్వాత తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పరుచుకున్నాడు.
సచిన్ కెరీర్ ఆరంభంలో ఎలా దూకుడుగా ఆడేవాడో.. అదే స్థాయిలో కెరీర్ ఆద్యంతం విధ్వసంక రీతిలో ఆడుతూ ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే మోస్ట్ డేరింగ్ అండ్ డాషింగ్ బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడతను. వీరూ అంటేనే విధ్వసం అనే పేరు వచ్చింది.
తాజాగా వీరూ 42వ పుట్టిన రోజు జరుపుకున్నాడు. ఈ సందర్భంగా వీరూ ‘గాడ్’గా పిలుచుకునే సచిన్ అతడికి తనదైన శైలిలో పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాడు.
వీరూకు ఇప్పుడు 42 ఏళ్లు వచ్చాయని.. 4, 2 కలిపితే 6 అవుతుందని.. కెరీర్లో ఎప్పుడూ వీరూ 4, 6లతోనే డీల్ చేశాడని పేర్కొంటూ.. అతను వందేళ్లు వర్ధిల్లాని ఆశిస్తూ హిందీలో జన్మదిన శుభాకాంక్షలు చెప్పాడు సచిన్.
దీనికి వీరూ కూడా తనదైన శైలిలో బదులిచ్చాడు. సచిన్‌కు 47 ఏళ్లొచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ.. 4, 7 కలిపితే 11 అవుతుందని.. కానీ సచిన్ మాత్రం కెరీర్ ఆద్యంతం సెంచరీలతోనే డీల్ చేశాడని.. ఆటకు సచిన్ చేసిన సేవలను అభివర్ణించడానికి ఏ నంబర్ల కాంబినేషన్ కూడా సరిపోదని వీరూ పేర్కొన్నాడు. తనకు స్ఫూర్తిగా నిలిచినందుకు, జన్మదిన శుభాకాంక్షలు చెప్పినందుకు వీరూ సచిన్‌కు ధన్యవాదాలు చెప్పాడు.
క్రికెట్ కెరీర్లో ఆద్యంతం ఎలా అయితే డాషింగ్ బ్యాటింగ్‌తో అభిమానులను అలరించాడో.. ట్విట్టర్లో సైతం వీరూ అలాగే సరదా పోస్టులతో వినోదాన్నందిస్తుంటాడు. అందుకే సచిన్ కూడా వీరూకు ఫన్నీగా విష్ చేస్తే.. అతను తనదైన శైలిలో మాస్టర్‌కు బదులిచ్చాడు.
This post was last modified on October 21, 2020 10:26 am
ఒకప్పుడు బాక్సాఫీస్ దగ్గర ఆశించిన ఫలితాలు అందుకోలేకపోయిన కొన్ని సినిమాలు దశాబ్దాల తర్వాత రీ రిలీజైతే వాటిని సెలబ్రేషన్ లా…
ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశంలో చాలా మార్పులు చేర్పులు వస్తున్నాయి. అప్పటిదాకా వచ్చిన…
నారా చంద్రబాబునాయుడు.. దేశంలోనే సీనియర్ మోస్ట్ నేతగానే కాదు.. ఏ విషయంలో ఎంతదాకా స్పందించాలో తెలిసిన నేత. ఏ విషయంలో…
కాంగ్రెస్ పాలనలో కేవలం ఏడాది కాలంలో తెలంగాణ రాష్ట్రానికి, ప్రజలకు ఎంతో చేశామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. గణతంత్ర…
భాగ్యనగరి హైదరాబాద్ లో ఆదివారం రాత్రి ఘోర ప్రమాదం సంభవించింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో జరిగిన ఈ ప్రమాదంలో…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. భారత గణతంత్ర దినోత్సవాన తన పార్టీ శ్రేణులకు కొత్త మార్గదర్శకాలు…