Trends

2009 – 2024 కాలంలో ఎంతమంది భారతీయులను బహిష్కరించారో తెలుసా?

అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులను వెనక్కి పంపే ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా, 104 మంది భారతీయులను బహిష్కరించిన అమెరికా, ప్రత్యేక మిలిటరీ విమానం ద్వారా వారిని పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు తరలించింది. ఈ నేపథ్యంలో, కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ రాజ్యసభలో ఈ అంశంపై వివరాలు వెల్లడించారు.

2009 నుంచి ఇప్పటివరకు మొత్తం 15,668 మంది భారతీయులను అమెరికా బహిష్కరించినట్టు మంత్రి తెలిపారు. ప్రతిపక్షాలు దీనిపై ఆందోళన వ్యక్తం చేయగా, అక్రమ వలసదారుల దేశ బహిష్కరణ కొత్తేమీ కాదని, ఇది గత కొన్నేళ్లుగా కొనసాగుతోందని జైశంకర్ స్పష్టం చేశారు. ఈ ప్రక్రియలో భారతీయులు మాత్రమే కాకుండా, పలు దేశాల వలసదారులను కూడా అమెరికా వెనక్కి పంపిస్తోందని వివరించారు.

2009 నుంచి 2024 వరకు అమెరికా బహిష్కరించిన భారతీయుల సంఖ్య:

2009 – 734

2010 – 799

2011 – 597

2012 – 530

2013 – 515

2014 – 591

2015 – 708

2016 – 1,303

2017 – 1,024

2018 – 1,180

2019 – 2,042 (అత్యధికంగా)

2020 – 1,889

2021 – 805

2022 – 862

2023 – 617

2024 – 1,368 (ఇప్పటివరకు)

అమెరికా ప్రభుత్వం తమ దేశ భద్రతా విధానాల్లో భాగంగా వలస నియంత్రణ చర్యలను కఠినతరం చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. ఇందులో మహిళలు, చిన్నారులు లేరని, ప్రస్తుతం బహిష్కరించబడిన వారంతా పురుషులేనని అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) సంస్థ భారత ప్రభుత్వానికి స్పష్టం చేసిందని ఆయన తెలిపారు.

ఈ తరలింపు వ్యవహారం పెరుగుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం కూడా అప్రమత్తమై, విదేశాల్లో అక్రమంగా నివసిస్తున్న భారతీయుల భద్రతను పరిగణనలోకి తీసుకుని, వారికి అవసరమైన సహాయాన్ని అందించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిసింది. అక్రమ వలసల సమస్యను సమర్థవంతంగా పరిష్కరించేందుకు కఠినమైన నిబంధనలను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది.

This post was last modified on February 7, 2025 10:08 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ఈ ఐదుగురు బాబును మించిన పనిమంతులు

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఏది చేసినా పక్షపాతం అన్నది కనిపించదు. చివరకు ఆ విషయం…

18 minutes ago

రూ.99తో హైదరాబాద్ నుంచి విజయవాడకు…!

హైదరాబాద్ నుంచి విజయవాడకు రూ.99తో విజయవాడకు వెళ్ళొచ్చా? నిజంగానా? అని ఆశ్యర్యపడాల్సిన పని లేదు. ఎందుకంటే.. ఈటీఓ మోటార్స్ ఈ…

25 minutes ago

ఏమిటో నితిన్ ధైర్యం?

అంతా అనుకున్న‌ట్లు జ‌రిగితే నితిన్ కొత్త చిత్రం రాబిన్ హుడ్ ఎప్పుడో రిలీజైపోయి ఉండాలి క్రిస్మ‌స్‌కు అనుకున్న ఆ చిత్రం…

2 hours ago

పంచ సూత్రాలు.. చంద్ర‌బాబుకు క‌లిసి వ‌స్తున్న‌వివే..!

అధికారంలో ఉన్న‌వారికి కొన్ని ఇబ్బందులు స‌హ‌జం. ఎంత బాగా పాల‌న చేశామ‌ని చెప్పుకొన్నా.. ఎంత విజ‌న్‌తో దూసుకుపోతున్నామ‌ని చెప్పుకొన్నా.. ఎక్క‌డో…

2 hours ago

బిగ్ డే : తండేల్ మీదే అందరి కళ్ళు

నాగ చైతన్య కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కిన తండేల్ థియేటర్లకు వచ్చేసింది. గత ఏడాది డిసెంబర్…

4 hours ago

‘పట్టు’ లేదని ముందే తెలుసుకున్నారా

ఈ మధ్య కాలంలో అజిత్ లాంటి స్టార్ ఉన్న పెద్ద సినిమా బజ్ లేకుండా విడుదలయ్యిందంటే అది పట్టుదల మాత్రమే.…

11 hours ago