Trends

ధోనీకి ఎందుకింత మొండితనం?

అన్నీ కలిసొస్తున్నపుడు ఏం చేసినా చెల్లిపోతుంది. కానీ పరిస్థితులు తిరగబడ్డపుడే నిర్ణయాలు కొంచెం ఆచితూచి తీసుకోవాల్సి ఉంటుంది. మహేంద్రసింగ్ ధోనీకి ఈ విషయం ఇప్పుడు బాగానే బోధపడుతూ ఉంటుంది. ఐపీఎల్‌లో ఇంతకుముందు చెన్నై జట్టు ఎలా ఉన్నా సరే బాగా ఆడేది. టోర్నీలో ఒడుదొడుకులు ఎదురైనా సరే.. పుంజుకునేది.

డాడీస్ ఆర్మీ అని కౌంటర్లు పడ్డా సరే.. వయసు మళ్లిన ఆటగాళ్లనే నమ్ముకుని ధోనీ అద్భుతాలు చేశాడు ఆ జట్టుతో. స్వయంగా బాగా ఆడేవాడు, సహచరులూ పూర్తి స్థాయిలో రాణించేవాళ్లు. కానీ ఈసారి మాత్రం మొత్తం తిరగబడింది. ధోని ఆడట్లేదు. అతడి కెప్టెన్సీ పని చేయట్లేదు. ఆటగాళ్లు అంచనాలను అందుకోవట్లేదు. మొత్తంగా ఆ జట్టు కథ లీగ్ దశలోనే ముగియడం ఖాయంగా కనిపిస్తోంది.

ఐతే ఈ క్రమంలో ఎన్నడూ లేనంతగా ధోని కెప్టెన్సీ చర్చనీయాంశం అవుతోంది. ముఖ్యంగా తుది జట్టు ఎంపికలో ధోని తీసుకున్న నిర్ణయాలు ఎవ్వరికీ అంతుబట్టడం లేదు. ఒక ఆటగాడు బాగా ఆడట్లేదు, ఆడే అవకాశం కూడా లేదని స్పష్టంగా కనిపిస్తున్నా అతణ్ని పట్టుబట్టి జట్టులో కొనసాగించడం అంతుబట్టని విషయం. ఆ ఆటగాడు కేదార్ జాదవ్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ఐపీఎల్‌లో జాదవ్ లాగా విమర్శలెదుర్కొన్న, సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కొన్న ఆటగాడు మరొకరు కనిపించరు.

8 మ్యాచుల్లో అతను చేసింది కేవలం 62 పరుగులు. బ్యాటింగ్ దారుణంగా ఉంది. బౌలింగ్ చేయట్లేదు. ఫీల్డింగ్ అంతంతమాత్రం. కానీ ఎందుకతను జట్టులో ఉన్నాడో ఎవరికీ అర్థం కావడం లేదు. కోల్‌కతాతో మ్యాచ్‌లో దారుణమైన బ్యాటింగ్‌తో తీవ్ర స్థాయిలో విమర్శలెదుర్కొన్నాడు జాదవ్. దీంతో రెండు మ్యాచ్‌‌లకు అతణ్ని తప్పించారు.

కానీ తర్వాత మళ్లీ జట్టులోకి తీసుకొచ్చేశాడు ధోని. వచ్చాక అతణ్ని బ్యాటింగ్ ఆర్డర్లో ముందు పంపి నిరూపించుకునే అవకాశం ఇవ్వలేదు. ఎక్కడో ఏడో స్థానంలో దించారు. రాజస్థాన్‌తో తాజా మ్యాచ్‌లోనూ జాదవ్ పేలవంగానే ఆడాడు. ఏడు బంతుల్లో 4 పరుగులే చేశాడు. దీంతో అతడి మీద విరుచుకుపడుతున్నారు నెటిజన్లు. విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది. భారీగా మీమ్స్ పడుతున్నాయి. అసలు ధోని ఎందుకు అతణ్ని జట్టులో ఆడిస్తున్నాడన్న ప్రశ్నలే ఎటు చూసినా. ఆటగాళ్లపై నమ్మకం పెట్టి మళ్లీ మళ్లీ అవకాశాలిస్తాడని ధోనీకి పేరుంది. కానీ మిగతా ఆటగాళ్ల సంగతేమో కానీ.. జాదవ్ ఇంత పూర్ ఫామ్‌లో ఉన్నా, ఇంతగా విమర్శలు వస్తున్నా ఎవరో చెబితే అతణ్ని పక్కన పెట్టేదేంటి అన్నట్లుగా ధోని పంతం పట్టి అతణ్ని ఆడిస్తుండటమే విడ్డూరం.

This post was last modified on October 20, 2020 12:18 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

చంద్ర‌బాబుకు ఊపిరి పోసిన అమిత్ షా!

టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు.. బిగ్ బ్రేక్ వ‌చ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు కేంద్రంలోని పెద్ద‌లు ఎవ‌రూ.. ముఖ్యంగా బీజేపీ అగ్ర‌నాయ‌కులుగా ఉన్న‌వారు…

3 hours ago

ఏపీ డీజీపీ బ‌దిలీ : ఈసీ యాక్ష‌న్‌

ఏపీలో సంచ‌ల‌నం చోటు చేసుకుంది. ఎన్నిక‌ల వేళ అధికార పార్టీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న ఆరోప‌ణల నేప‌థ్యంలో ఇప్ప‌టికే చాలా మంది…

4 hours ago

కుటుంబాల్లో పొలిటిక‌ల్‌ క‌ల్లోలం!

ఏపీలో ఎన్నిక‌ల‌కు మ‌రో వారం రోజులు మాత్ర‌మే గ‌డువు ఉంది. ఈ నెల 13న అంటే వ‌చ్చే సోమ‌వారం.. ఎన్నిక‌ల…

4 hours ago

ఇండియన్-2 ఫిక్స్.. గేమ్‌చేంజర్‌కు భయం లేదు

‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మెగా పవర్ స్టార్ ఆలస్యం చేయకుండా శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ చేంజర్’ మొదలుపెట్టేశాడని చాలా సంతోషించారు మెగా…

6 hours ago

జ‌గ‌న్ రాముడిని అవ‌మానించాడు.. అమిత్ షా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

కేంద్ర మంత్రి, బీజేపీ అగ్ర‌నేత‌.. అమిత్ షా.. ఏపీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశా రు.…

7 hours ago

పుష్ప గొంతు విప్పాడు

ఈ ఏడాది పాన్ ఇండియా స్థాయిలో మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ‘పుష్ప: ది రూల్’ ఒకటి. ‘పుష్ప: ది రైజ్’తో…

8 hours ago