Trends

ఇంగ్లండ్‌పై భారత్ విజృంభణ.. సిరీస్‌ పట్టేసిన టీమ్ ఇండియా

భారత్ మరోసారి టీ20 క్రికెట్‌లో తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 3-1 తేడాతో కైవసం చేసుకుంది. పుణెలో జరిగిన నాలుగో మ్యాచ్‌లో 15 పరుగుల తేడాతో గెలిచి, మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్‌ను తన ఖాతాలో వేసుకుంది.

182 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ జట్టు గెలిచే క్రమంలో చివరలో మ్యాచ్ ను చేజార్చుకుంది. ఇక 19.4 ఓవర్లలో 166 పరుగులకే ఆలౌటైంది. ఇంగ్లీష్ బ్యాట్స్ మెన్ లలో హ్యారీ బ్రూక్ మాత్రమే మధ్యలో గెలుపుపై ఆశలు చిగురించాడు.

అతను 51 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడినా, జట్టుకు విజయం అందించలేకపోయాడు. ముఖ్యంగా భారత బౌలర్లు ఈ విజయానికి కారణమయ్యారు. హర్షిత్ రాణా వేసిన మొదటి ఓవర్ లొనే డేంజరస్ బ్యాట్స్ మెన్ లివింగ్ స్టన్ ను ఔట్ చేసి ఇంగ్లండ్ ను గట్టి దెబ్బ కొట్టాడు. హర్షిత్, రవి బిష్ణోయ్ చెరో మూడు వికెట్లు తీయగా వరుణ్ చక్రవర్తి రెండు వికెట్లు తీసి, ప్రత్యర్థి మిడిల్ ఆర్డర్‌ను దెబ్బతీశాడు. అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్ ఒక్కో వికెట్ తీశారు.

మ్యాచ్ ప్రారంభంలో ఫిలిప్ సాల్ట్ (23), డకెట్ (39) దూకుడుగా ఆడినా, రవి బిష్ణోయ్ బౌలింగ్‌తో ఈ భాగస్వామ్యాన్ని బ్రేక్ చేయడంతో భారత్ మళ్లీ కంట్రోల్‌లోకి వచ్చింది. అయితే భారత బ్యాటింగ్‌లో టాప్ ఆర్డర్ మరోసారి నిరాశపరిచింది. సంజు శాంసన్ (1), అభిషేక్ శర్మ (29) తక్కువ పరుగులకే ఔటవ్వగా, తిలక్ వర్మ (0), సూర్యకుమార్ యాదవ్ (0) డకౌట్ అయ్యారు. మహ్మూద్ ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసి భారత్‌ను కష్టాల్లో పడేశాడు.

కానీ రింకు సింగ్ ఆటతో ఇంగ్లండ్ దూకుడుకు బ్రేక్ వేశాడు, ఆల్‌రౌండర్లు శివమ్ ధూబే (53) మరియు హార్దిక్ పాండ్య (53) అద్భుతమైన అర్ధశతకాలు సాధించి జట్టును గట్టెక్కించారు. ఈ విజయంతో టీమ్ ఇండియా మరో సిరీస్‌ను గెలుచుకొని తమ ఫామ్‌ను కొనసాగించింది.

ఇంగ్లండ్‌పై టీ20 క్రికెట్‌లో భారత్ హవా కొనసాగుతూనే ఉంది. చివరి మ్యాచ్ ఫలితం సంబంధం లేకపోయినా, భారత్ అది కూడా గెలిచి 4-1 తేడాతో సిరీస్ ముగించాలని చూస్తోంది. ఇక ఆ మ్యాచ్ లో బెంచ్ పైన ఉన్న ఆటగాళ్లకు అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది.

This post was last modified on January 31, 2025 11:06 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

బిగ్ బ్రేకింగ్: అంబటి రాంబాబు అరెస్ట్!

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై అనుచిత వ్యాఖలు చేసిన అంబటి రాంబాబును, గుంటూరులోని తన నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత…

6 minutes ago

ఆఖరి పోరులో కివీస్‌ను చిత్తు చేసిన టీమిండియా!

న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…

12 minutes ago

అంబటికి సినిమా చూపిస్తామన్న పెమ్మసాని

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…

2 hours ago

సిట్ నోటీసులను లాజిక్ తో కొట్టిన కేసీఆర్

ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్‌ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…

3 hours ago

ఆంధ్రా యువత ఎదురుచూపు… ఉగాదికి ముహూర్తం?

ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మ‌ధ్య జ‌రిగే తెలుగు సంవ‌త్స‌రాది ఉగాది ప‌ర్వ‌దినానికి భారీ ప్ర‌క‌ట‌న చేసేందుకు ఏపీ మంత్రి నారా…

3 hours ago

లోకేశ్ పై జోగి వివాదాస్పద కామెంట్లు

కల్తీ మద్యం కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ అరెస్టై 84 రోజుల పాటు జైల్లో ఉన్న…

4 hours ago