టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇటీవల సర్కారు వారి పాట పేరిట ఓ సినిమా వచ్చింది. ఇందులో బ్యాంకుల్లో జరుగుతున్న లెక్కలేనన్నిఅక్రమాలు, ఈఎంఐల పేరిట జనంపై జరుగుతున్న వేధింపులు… సంపన్నులు ఎగవేస్తున్న రుణాలు, ఆ రుణాలను మిడిల్ క్లాస్ ఈఎంఐల ద్వారానే వసూలు చేస్తున్న వైనాన్ని ఆసక్తిగా చూపారు. జనం నుంచి ఈ సినిమాకు మంచి అప్లాజ్ దక్కింది. బ్యాంకుల్లో మనకు తెలియకుండా ఇంత జరుగుతోందా? అంటూ ఈ సినిమాను చూసినవారంతా నోరెళ్లబెట్టారు.
ఈ సినిమా మొత్తానికి ఓ సీన్ హైలెట్ గా నిలుస్తుంది.రిటైర్ అయినా కూడా ఇంటి రుణానికి సంబంధించిన వాయిదాలు చెల్లించేందుకు ఓ పెద్దాయన సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ ఉంటాడు. క్రమం తప్పకుండా ఈఎంఐలు చెల్లిస్తూ ఉంటారు. అయితే తన సతీమణి అనారోగ్యంతో ఓ నెల వాయిదాను ఆయన చెల్లించరు. దీంతో ఆయన ఇంటికి వచ్చిన రికవరీ ఏజెంట్లు ఆయనను అభాసుపాలు చేసే యత్నం చేస్తారు. ఈ టైంలోనే హీరో వస్తాడు. వారి ఆట కట్టిస్తాడు.అదంతా సినిమా. నిజ జీవితంలో అలా కుదరదు కదా.
నిజమే.. సినిమాల్లో మాదిరిగా నిజ జీవితంలో అలాంటి అవమానాలకు అడ్డే ఉండదు, ఫలితంగా ఆతహత్యలు జరుగుతూ ఉంటాయి. సరిగ్గా ఇలాంటి ఘటనే ఇప్పుడు కృష్ణా జిల్లా గుడివాడలో చోటుచేసుకుంది. ఫైనాన్స్ సంస్థల నిర్వాకానికి ఓ ఆటో డ్రైవర్ తన కుటుంబాన్ని దిక్కులేని దానిని చేసి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో బాధితుడు తనను వేధించిన ఫైనాన్స్ సంస్థ పేరు, ఇతరత్రా వివరాలు వెల్లడించి మరీ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఏపీలో ఇప్పుడు కలకలం రేపుతోంది.
ఈ ఘటన వివరాల్లోకి వెళితే… గుడివాడకు చెందిన రావి సత్తిబాబు ఆటో డ్రైవర్. తన అవసరాల నిమిత్తం విస్తార్ ఫైనాన్స్ అనే సంస్థ నుంచి రూ.7.8 లక్షల రుణాన్ని తీసుకున్నారు. ఇప్పటిదాకా క్రమం తప్పకుండా ఈఎంఐలు చెల్లిస్తూనే ఉన్నాడు. అయితే గత నెలలో ఆయన సతీమణి అనారోగ్యంతో ఈఎంఐ చెల్లించలేకపోయాడు. దీంతో విస్లార్ ఏజెంట్లు అతడి ఇంటికి వచ్చి పరువు తీసేలా వ్యవహరించారు. ఈ అవమాన భారాన్ని తట్టుకోలేక సత్తిబాబు ఆత్మహత్య చేసుకున్నాడు.
This post was last modified on January 31, 2025 12:29 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…