ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న రంజీ మ్యాచ్ కు ఫ్యాన్స్ ఏ స్థాయిలో తరలి వచ్చారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఫ్రీ ఎంట్రీ కావడంతో కేవలం విరాట్ కోహ్లీ కోసమే వేలాది మంది గ్రౌండ్ లో ప్రత్యక్షమైన విధానం ఆశ్చర్యాన్ని కలిగించింది. మ్యాచ్ మొదలవ్వడానికి ముందు స్టేడియం ముందు కీలో మీటర్ల మేర క్యూ లైన్స్ దర్శనమిచ్చాయి. కాస్త తొక్కిసలాట కూడా జరిగింది. దీంతో కొంతమంది ఫ్యాన్స్ గాయపడ్డారు.
ఇక విరాట్ కోహ్లీ 12 ఏళ్ల విరామం తర్వాత రంజీ ట్రోఫీలో ఆడేందుకు మైదానంలో అడుగుపెట్టడంతో పక్కా పవర్ఫుల్ కమ్ బ్యాక్ ఇస్తాడాని అందరూ అనుకున్నారు. చాలా కాలంగా విరాట్ ఫామ్ లోకి రావడానికి సతమతమవుతున్నాడు. అతని ఆట తీరులో పట్టు తగ్గిందనే కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఇక అరుణ్ జైట్లీ స్టేడియంలో రైల్వేస్ జట్టుతో ఢిల్లీ తలపడుతుండగా, కోహ్లీ ప్రత్యేకంగా తన ఫామ్‌ను పునరుద్ధరించుకునేందుకు ఈ మ్యాచ్‌లో పాల్గొన్నాడు.
కానీ అభిమానుల అంచనాలను నిలబెట్టలేకపోయాడు. క్రీజులోకి వచ్చిన కోహ్లీ తక్కువ స్కోరుకే ఔటవడంతో అభిమానులు నిరాశ చెందారు. 15 బంతులు మాత్రమే ఆడిన కోహ్లీ, కేవలం 6 పరుగులకే బౌల్డ్ అయ్యాడు. రైల్వేస్ బౌలర్ సాంగ్వాన్ వేసిన అద్భుతమైన బంతికి క్లీన్ బౌల్డ్ కావడం, స్టేడియంలో ఉన్న అభిమానులను ఆశ్చర్యపరిచింది. కోహ్లీ బ్యాటింగ్ కోసం ఎదురుచూసినవారికి ఇది నిరాశ కలిగించింది.
దీంతో ఒక్కసారిగా భారీ స్థాయిలో ఫ్యాన్స్ స్టేడియం నుంచి బయటకు వెళ్లిపోయారు. అందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎగబడి తొక్కిసలాట ప్రమాదంను దాటి మరి వచ్చిన ఫ్యాన్స్ కు కోహ్లీ ఏమాత్రం కిక్కివ్వల్లేదు. అందుకే త్వరగానే స్టేడియం నుంచి బయటకు క్యూ కట్టారు.
ఇక ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన రైల్వేస్ జట్టు 241 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం ఢిల్లీ బ్యాటింగ్ ప్రారంభించగా, 97 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయింది. కోహ్లీపై భారీ ఆశలు పెట్టుకున్న ఢిల్లీ జట్టు, అతని వికెట్ త్వరగా పడిపోవడంతో కష్టాల్లో పడింది.
This post was last modified on January 31, 2025 11:58 am
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…