మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తన చిన్ననాటి అనుభవాలను పంచుకుంటూ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. యవ్వనంలో అమ్మాయిల కోసం ఓ పొరపాటు కూడా చేసినట్లు ఒపెన్ గా వివరించడం వైరల్ అవుతోంది. ఇక తన బాల్యంలో ఎదుర్కొన్న సమస్యలు, ప్రయోగాత్మక ఆలోచనల గురించి ఓ పుస్తకంలో వివరించారు. ‘సోర్స్ కోడ్ – మై బిగినింగ్స్’ పేరుతో రాసిన ఈ పుస్తకం ఫిబ్రవరి 4న విడుదల కానుంది. ఈ పుస్తకంలో గేట్స్ చిన్నతనంలో ఎదుర్కొన్న ఆటిజం, విద్యా జీవితంలోని కీలక సంఘటనలు, వ్యక్తిగత ప్రయోగాలను వివరించారు.
తన బాల్యంలో ఆటిజంతో బాధపడ్డానని, ఆ సమస్యతో తన తల్లిదండ్రులు ఎంతో ఇబ్బంది పడ్డారని గేట్స్ తెలిపారు. చిన్నప్పటి నుంచి ఇతర పిల్లలతో పోలిస్తే తాను భిన్నంగా ఉంటానని, అయితే తన తల్లిదండ్రులు తనను సాధారణ బాలుడిగా తీర్చిదిద్దేందుకు అనేక ప్రయత్నాలు చేశారని పేర్కొన్నారు. విద్యా జీవితంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నానని, మానసికంగా మెరుగుపడటానికి ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతానని చెప్పారు.
అంతేకాకుండా, తన యవ్వన దశలో కొన్ని ప్రయోగాలు చేసినట్లు బిల్ గేట్స్ స్పష్టం చేశారు. ముఖ్యంగా, అమ్మాయిలను ఆకట్టుకోవడానికి నిషేధిత ఎల్ఎస్‌డీ (LSD) డ్రగ్‌ని ఉపయోగించిన అనుభవాన్ని పంచుకున్నారు. యవ్వనంలో అనేక అంశాలను పరిశీలించాల్సిన అవసరం ఉంటుందని, కొన్ని సందర్భాల్లో పొరపాట్లు జరగవచ్చని, కానీ వాటి నుంచి నేర్చుకోవడం ముఖ్యం అని తెలిపారు.
ఈ పుస్తకం మూడు భాగాలుగా రాబోతుందని, ప్రస్తుత వాల్యూమ్‌లో తన చిన్ననాటి అనుభవాలను మాత్రమే ప్రస్తావించారని గేట్స్ చెప్పారు. మైక్రోసాఫ్ట్ స్థాపన, వ్యాపార ప్రయాణం, మెలిందా గేట్స్‌తో వివాహం, దాతృత్వ కార్యక్రమాలకు సంబంధించి మరిన్ని విశేషాలు భవిష్యత్ వాల్యూమ్‌లలో వెల్లడించనున్నట్లు చెప్పారు.
ఇప్పటికే ఈ పుస్తకం పలు అంతర్జాతీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. గేట్స్ జీవితంలో తను ఎదుర్కొన్న మలుపులు, ప్రత్యేకించి, ఆటిజంపై చేసిన పోరాటం పాఠకులకు ప్రేరణ కలిగించే అంశంగా మారుతుందని పుస్తక విశ్లేషకులు చెబుతున్నారు. ఫిబ్రవరి 4 తర్వాత పుస్తకం మార్కెట్లోకి రానుండటంతో టెక్, విజ్ఞాన రంగాల్లో ఆసక్తి కలిగిన వారు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
This post was last modified on January 30, 2025 8:45 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…