ఉద్యోగం అంటే సాధారణంగా డిగ్రీలు, అనుభవం, స్కిల్స్ ఇలా అనేక అర్హతలు అవసరమవుతాయి. అయితే, బెంగళూరుకు చెందిన ఓ స్టార్టప్ సంస్థ ఇచ్చిన ఉద్యోగ ప్రకటన మాత్రం ఊహించని విధంగా ఉంది. మెంటరింగ్, కన్సల్టింగ్ ప్లాట్‌ఫారమ్ టాప్‌మేట్ సంస్థ ‘చీఫ్ డేటింగ్ ఆఫీసర్’ (CDO) హోదాకు ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. ప్రేమ, డేటింగ్ ప్రపంచాన్ని పూర్తిగా అర్థం చేసుకుని, ఆధునిక డేటింగ్ ట్రెండ్స్‌పై అవగాహన ఉన్నవారిని మాత్రమే ఈ ఉద్యోగానికి ఆహ్వానిస్తున్నారు.
ఈ ఉద్యోగానికి అప్లై చేయాలంటే ఓ ప్రత్యేకమైన అర్హతలు అవసరం. కనీసం ఒకసారి బ్రేకప్ అనుభవం ఉండాలి. రెండు ‘సిట్యుయేషన్‌షిప్స్’ (సాధారణ డేటింగ్ కంటే ముందుండే సంబంధాలు) లో ఉన్న అనుభవం ఉండాలి. మూడు డేట్స్ చేసిన అనుభవం ఉండాలి. డేటింగ్ యాప్స్ ఎలా పనిచేస్తాయో తెలిసి ఉండాలి. కనీసం రెండు లేదా మూడు డేటింగ్ యాప్స్‌లో అనుభవం ఉండాలి. గోస్టింగ్, బ్రెడ్‌క్రంబింగ్ లాంటి కొత్త డేటింగ్ ట్రెండ్స్ గురించి తెలుసుకోవడంతో పాటు, కొత్త ట్రెండ్‌లను క్రియేట్ చేయగల శక్తి ఉండాలి.
టాప్‌మేట్ సంస్థ మూడోపాయింట్‌లో ఆసక్తికరమైన విషయం స్పష్టం చేసింది. “డేటింగ్ సలహా ఇచ్చే వ్యక్తి మీ స్నేహితుల్లో ఉంటే, మీకోసం ఇది బెస్ట్ ఉద్యోగం. డేటింగ్ సంస్కృతిని అర్థం చేసుకోవడమే కాకుండా, కొత్త టెర్మ్స్‌ను రూపొందించగల మేచ్ మేకర్స్‌ను మేం వెతుకుతున్నాం” అని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ పోస్టుకు భారీ స్పందన వచ్చింది. కొందరు జోక్‌గా చూసినా, మరికొందరు ఆసక్తిగా నిజంగానే అప్లై చేయాలని భావిస్తున్నారు.
ఇటీవల కాలంలో డేటింగ్ యాప్స్ విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ తరహా ఉద్యోగాలు భవిష్యత్తులో మరింత ప్రాచుర్యం పొందే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ ప్రేమ, సంబంధాల గురించి లోతుగా అర్థం చేసుకుని, కొత్త ట్రెండ్స్‌ను సృష్టించే టాలెంట్ ఉంటే, ఇది మీకో అవకాశం కావొచ్చు! మరి, ఈ ఉద్యోగానికి నిజంగా ఎవరైనా అప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నారా?
This post was last modified on January 30, 2025 7:54 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…