Trends

మృగాడికి జీవిత ఖైదు…హంతకురాలికి మరణ దండన

భారత న్యాయ వ్యవస్థలో సోమవారానికి ఓ ప్రత్యేక గుర్తింపు ఉందని చెప్పాలి. సోమవారం ఒకే రోజు రెండు కీలక కేసుల్లో దేశ కోర్టుల నుంచి సంచలన తీర్పులు వెలువడ్డాయి. వీటిలో యావత్తు దేశాన్ని ఓ కుదుపు కుదిపేసిన కోల్ కతా ఆర్డీ ఖర్ ఆసుపత్రి వైద్యురాలిపై జరిగిన హత్యాచార కేసు కాగా… మరొకటి కేరళలో ప్రేమించిన యువకుడిని వంచించి అతడిపై విష ప్రయోగానికి పాల్పడి అతడిని దారుణంగా అంతమొందించిన ప్రియురాలి కేసు మరొకటి. ఈ రెండు కేసుల్లో కోల్ కతా మృగాడికి అక్కడి కోర్టు… జీవిత ఖైదు విధించగా… కేరళ హంతకురాలికి మరణ దండనను విధిస్తూ కేరళ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.

కోల్ కతా ఆర్జీ ఖర్ ఆసుపత్రిలో హౌస్ సర్జన్ గా పనిచేస్తున్న బాధితురాలిపై కన్నేసిన సంజయ్ రాయ్ అనే నిందితుడు… ఒకానొక రోజు ఆమెపై ఆసుపత్రిలోనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డ మృగాడు ఆ తర్వాత ఆమెను హత్య చేశాడు. ఈ ఘటన యావత్తు దేశాన్ని కుదిపేసింది. ఈ ఘటనకు నిరసనగా… కోల్ కతాతో పాటు దేశవ్యాప్తంగా వైద్యులు, ఆసుపత్రుల సిబ్బంది, సామాన్య జనం రోజుల తరబడి నిరసనలకు దిగారు. ఈ కేసులో ఆసుపత్రి యాజమాన్యం సహకరించని దారుణ విషయాలు వెలుగు చూశాయి. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ పనితీరుపై భారీ విమర్శలు చెలరేగాయి. చివరకు రంగంలోకి దిగిన సీబీఐ కేసును ఓ కొలిక్కి తీసుకువచ్చింది. నిందితుడిని అరెస్ట్ చేసింది.

ఈ కేసు విచారణను చేపట్టిన స్థానిక కోర్టు… నిందితుడికి వ్యతిరేకంగా అన్ని ఆధారాలను పరిశీలించి.. అతడు నేరానికి పాల్పడినట్లుగా తేల్చింది. ఈ మేరకు శనివారం తీర్పుచెప్పిన కోర్టు.. సోమవారం శిక్షను ఖరారు చేయనున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో తప్పు చేసిన తన కుమారుడికి ఉరి శిక్ష పడాలంటూ నిందితుడి తల్లిదండ్రులు కోర్టును కోరారు. నిందితుడికి ఉరే సరైనశిక్ష అంటూ కోల్ కతా యువతతో పాటు యావత్తు దేశ యువత నినదించింది. అయితే కోర్టు మాత్రం నిందితుడికి యావజ్జీవ ఖైదుతో సరిపెట్టింది. అంతేకాకుండా రూ.50 వేల జరిమానాను విధించింది. నిందితుడు చనిపోయేదాకా జైలు శిక్ష అనుభవించాల్సిందేనని కోర్టు తన తీర్పులో పేర్కొంది.

ఇక రెండో కేసు విషయానికి వస్తే… కేరళకు చెందిన గ్రీష్మ… కన్యాకుమారిలో విద్యనభ్యసిస్తున్న క్రమలంో శరణ్ రాజ్ అనే సహ విద్యార్థితో ప్రేమలో పడింది. ఇద్దరూ ఏడాదికి పైగా కలిసి మెలిసి తిరిగారు. అయితే ఆ తర్వాత తన కుటుంబం ఎంపిక చేసిన యువకుడిని వివాహం చేసుకునేందుకు సిద్ధపడిన గ్రీష్మ.. శరణ్ ను అంతమొందించేందుకు నిర్ణయించుకుంది. తల్లి, మరో దగ్గరి బంధువుతో కలిసి ఓ పథకం ప్రకారం.. శరణ్ ను తన ఇంటికి రప్పించి…విషం కలిపిన ద్రావణాన్ని (స్లో పాయిజన్)ను ఇచ్చింది. దానిని సేవించిన శరణ్…ఆ తర్వాత కొంత కాలానికి అనారోగ్యం బారిన పడి అతి తక్కువ సమయలోనే వరుసగా అవయవాలు విఫలమై చివరకు ప్రాణాలు విడిచాడు.

ఈ ఘటనపై బాధితుడి కుటుంబ న్యాయ పోరాటం చేయగా… సమగ్ర దర్యాప్తునకు కోర్టులు ఆదేశాలు జారీ చేశాయి. పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. గ్రీష్మ పథకం ప్రకారమే శరణ్ ను మట్టుబెట్టిందని పోలీసులు నిర్ధారించారు. ఈ క్రమంలో గ్రీష్మను అరెస్ట్ చేయగా… చాలా కాలం పాటు జైలులో ఉన్న ఆమె ఆ తర్వాత హైకోర్టు నుంచి బెయిల్ తీసుకుని బయటకు వచ్చింది. ఈ కేసు విచారణలో గ్రీష్మకు వ్యతిరేకంగా పోలీసులు బలమైన సాక్ష్యాలను కోర్టు ముందు ఉంచారు. ఈ ఆధారాలను పరిశీలించిన కోర్టు… గ్రీష్మను దోషిగా తేల్చింది. ప్రేమించిన యువకుడిని నమ్మించి ప్రాణాలు తీసిన ఆమెకు ఉరి శిక్షను విధించింది. అంతేకాకుండా 15 ఏళ్ల పాటు జైలు శిక్షను విధించింది. ఈ నేరంలో గ్రీష్మకు సహకరించిన ఆమె సమీప బంధువుకు 3 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

This post was last modified on January 20, 2025 8:31 pm

Share

Recent Posts

రాకా సెట్లో మంచు లక్ష్మి… వావ్ వావ్ వావ్

అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కొత్త సినిమా ‘రాకా’ మొదలైనపుడే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్లో…

2 hours ago

విశాఖలో విద్యార్థుల లవ్ వార్… హద్దు మీరిపోయారు!

విశాఖపట్నంలో విద్యార్థులు చెలరేగిపోయారు. ప్రేమ వ్యవహారంలో రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలు, రాడ్లు పట్టుకొని రోడ్డెక్కారు. సినిమా తరహాలో నడి…

3 hours ago

చివరి సినిమా టోటల్ కలెక్షన్లు… ఒక్క రోజులోనే ఔట్

మాస్ రాజా రవితేజ నుంచి సరైన సినిమా వస్తే.. పరిస్థితులు కూడా అనుకూలిస్తే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో…

3 hours ago

సందీప్ వెర్సస్ దీపిక… మళ్లీ రాజుకుంది

ప్రభాస్, సందీప్ రెడ్డి వంగల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ సినిమా నుంచి దీపికా పదుకొనేను తప్పించడం మీద ఎప్పుడో…

3 hours ago

చిరు భలే బోల్తా కొట్టించాడుగా

ఏదో ఈవెంట్‌కు వెళ్లి ఏదో మాట్లాడుతూ.. తన కొత్త సినిమాల విశేషాలను లీక్ చేసేయడం మెగాస్టార్ చిరంజీవికి అలవాటు. కొన్నిసార్లు…

5 hours ago

సాలిడ్ కంటెంట్ పడితే రవితేజ స్టామినా ఇది

టాలీవుడ్ థియేటర్ల దగ్గర ఇరుముడి సందడి ఓ రేంజ్ లో ఉంది. సెకండ్ షోలు సైతం టికెట్ ముక్క దొరకనంతగా…

5 hours ago