అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్‌కు పెద్ద చిక్కే వచ్చిపడిందని అంటున్నారు పరిశీలకులు. వచ్చే నెలలో అగ్రరాజ్యం అధ్యక్ష ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ ఎన్నికల్లోనూ తిరుగులేని విజయం సాధించి.. రెండోసారి అధ్యక్ష పీఠం అధిరోహించాలని ట్రంప్ అనేక ఆశలు పెట్టుకున్నారు. ఈక్రమంలోనే ఆయన ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఉన్న అన్ని మార్గాలను అనుసరిస్తున్నారు. స్థానికతకు పెద్దపీట వేస్తున్న ఆయన గెలుపు గుర్రం ఎక్కే క్రమంలో అందివచ్చిన అవకాశాలను వినియోగించుకుంటున్నారు. అయితే, ప్రస్తుత అధ్యక్షుడి ట్రంప్ వ్యవహరించిన తీరును అమెరికాలో స్థిరపడిన పలు విదేశీయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
అదేసమయంలో ఓ వర్గం అమెరికన్లు కూడా ట్రంప్ తీసుకువచ్చిన విధానాలతో విసిగిపోయారు. పైగా గత ఎన్నికల్లో ట్రంప్ ఇచ్చిన హామీలు నెరవేరకపోవడం, నిరుద్యోగం, కరోనాను కట్టడి చేయలేక పోవడంతో ట్రంప్‌పై అమెరికన్లలో అసమనం పెరిగిపోయిందనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గెలుపు, ఓటములు ప్రభావితం చేసే భారతీయ అమెరికన్ల ఓటర్లపై ట్రంప్ భారీగానే ఆశలు పెట్టుకున్నారు. భారత్‌లో రెండోసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ కార్డును ఆయన ఎన్నికల్లో వినియోగించిన విషయం తెలిసిందే. మోడీ పట్ల భారతీయ అమెరికన్లలో ఉన్న అభిమానాన్ని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ఇప్పటి వరకు అనేక రూపాల్లో ట్రంప్ ప్రయత్నించారు.
ఎన్నికల ర్యాలీల్లో మోడీని ఆకాశానికి ఎత్తేశారు. భారతీయ అమెరికన్లు ఎక్కువగా ఉన్న 12 రాష్ట్రాల్లో మోడీ చిత్రపటంతో ట్రంప్ ప్రచారం చేశారంటే.. ఆయనపై అగ్రరాజ్యాధినేత ఎంతగా ఆశలు పెట్టుకున్నారో ఇట్టే అర్ధమవుతుంది. అంతేకాదు, భారత్‌లో మోడీ తీసుకున్న కొన్ని వివాదాస్పద(భారత్‌లో వ్యతిరేకించారు) జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు, సీఏఏ, ట్రిపుల్ తలాక్ రద్దు.. వంటివాటిని కూడా ట్రంప్ ప్రశంసించారు. ఇవన్నీ ఆయనకుప్లస్ అవుతాయని, 26 లక్షలు ఉన్న భారతీయ అమెరికన్ల ఓట్లన్నీ దాదాపు తనకే పడతాయని ట్రంప్ ఆశలు పెట్టుకున్నారు.
కట్ చేస్తే.. తాజాగా భారతీయ అమెరికన్ల తీరు ఎలా ఉంది? అధ్యక్ష ఎన్నికల రేసులో ఉన్న ట్రంప్, జొబైడెన్లలో వీరు ఎవరికి సానుకూలంగా ఉన్నారు? అనే అంశాలపై హాప్‌కిన్స్ యూనివర్సిటీ నేతృత్వంలో అమెరికన్ యాప్టిట్యూడ్ సర్వే(ఏఏఎస్) చేపట్టారు. దీనిని కేవలం ఇండియన్ అమెరికన్ల మనోభావాలు తెలుసుకునేందుకే నిర్వహించినట్టు యూనివర్సిటీ పేర్కొంది.
ఇక, ఈ సర్వేలో ట్రంప్‌కు అనుకూలంగా 22శాతం మంది ఓట్లేస్తే.. బైడెన్ వైపే 72 శాతం మంది మొగ్గు చూపారు. మరో 6 శాతం మంది తటస్థులుగా ఉన్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఫలితాలు అమెరికా ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపుతాయని.. ఇప్పటి వరకు భారతీయ ఓటర్లపై ట్రంప్ పెట్టుకున్న ఆశలు పటాపంచలవడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on October 15, 2020 11:19 am
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…