Trends

ఎక్క‌డున్నా గెట్ స్టార్ట్‌.. వ‌చ్చేయండొచ్చేయండి!!

+ “పండ‌క్కి సెల‌వులు పెట్టారు. ఇప్పుడు ఎక్క‌డున్నారు. స‌రే.. ఎక్క‌డున్నా త‌క్ష‌ణ‌మే వ‌చ్చేయండి!“

+ “మీ సెల‌వులు ర‌ద్దు చేస్తున్నాం. వెంట‌నే పెట్టేబేడా స‌ర్దుకుని ప్లేనెక్యేయండి!“

+ “మీ దేశంలో గ‌డిపించి ఇక‌, చాలు వెంట‌నే బ‌య‌లుదేరి రండి“

+ “ఈ నెల 20లోగా మీరిక్క‌డుండాలి. అంతే! మ‌రో మాటే వ‌ద్దు! గెట్ స్టార్ట్‌“

— ఇవీ ఇప్పుడు అమెరికాలో ప‌నిచేస్తున్న విదేశీయుల‌ను ఉద్దేశించి వారి వారి కంపెనీల యాజ‌మాన్య‌లు పెడుతున్న ఈమెయిళ్లు. సందేశాలు. వెంట‌నే తిరిగి వ‌చ్చేయాల‌ని ఆయా యాజ‌మాన్యాలు కోరుతున్నాయి.

దీంతో భార‌త్ స‌హా ఇత‌ర దేశాల‌కు వ‌చ్చిన వారు వెంట‌నే ఫ్లైట్ బాట ప‌ట్టుకుని ప‌రుగులు పెడుతున్నారు. ఎప్పుడెప్పుడు అగ్రరాజ్యంలో అడుగు పెడ‌తామా? అని ఎదురుచూస్తున్నారు.

ఏంటి కార‌ణం?

ఈ నెల 20న అమెరికా అధ్య‌క్షుడుగా డొనాల్డ్ ట్రంప్ ప‌గ్గాలు చేప‌ట్ట‌నున్నారు. ఆయ‌న ప‌గ్గాలు చేప‌ట్టిన వెంట‌నే తీసుకునే తొలి నిర్ణ‌యం విదేశీ ఉద్యోగులు, వీసాల‌పైనే ఉంటుంద‌న్న చ‌ర్చ జోరుగా సాగుతోంది. ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ స్థానికుల‌కు 75 శాతం ఉద్యోగాలు ల‌భించేలా చేస్తాన‌ని ఆయ‌న హామీ ఇచ్చారు.

ఈ హామీ నెర‌వేరాలంటే.. ఆయ‌న వీసాల‌ను ప‌రిమితం చేయాల్సి ఉంటుంద‌ని ట్రంప్ మ‌ద్ద‌తు దారులు చెబుతున్నారు. డిమాండ్ కూడా చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌స్తుతం హెచ్‌-1బీ వీసాల‌పై విదేశాల నుంచి అగ్ర‌రాజ్యానికి వ‌చ్చి ఉద్యోగాలు చేసుకునే వారిపై మ‌రిన్ని ఆంక్ష‌లు విధించే అవ‌కాశం ఉంది. లేదా అస‌లు వీసాల‌ను కూడా ర‌ద్దు చేసే అవ‌కాశం ఉంది.

ఈ నేప‌థ్యంలో ప్ర‌స్తుతం వివిధ కార‌ణాల‌తో త‌మ త‌మ దేశాల‌కు వెళ్లిపోయిన హెచ్‌-1బీ వీసాదారులు ఈ నెల 20 త‌ర్వాత‌.. ఇబ్బందులు ప‌డే అవ‌కాశంఉంద‌ని కంపెనీలు భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో త‌మ వారిని తిరిగి వెంట‌నే అమెరికాకు వ‌చ్చే యాల‌ని ఆదేశాలు, సూచ‌న‌లు చేస్తున్నాయి.

ఈ నెల 20 నాటికి అమెరికాలో ఉంటే.. ట్రంప్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్నా పోరాడేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని.. లేదా 20 త‌ర్వాత‌.. ఇప్పుడున్న వీసాతోనే అమెరికాలోకి అడుగు పెడ‌తామంటే కుద‌ర‌క‌పోవ‌చ్చ‌ని కంపెనీలు చెబుతున్నాయి.

అందుకే రారండో రండో రండ‌ని.. త‌మ వారికి ఈమెయిళ్లు, సందేశాలు పంపిస్తున్నాయి. ప్ర‌పంచవ్యాప్తంగా ఈ వ్య‌వ‌హారం క‌ల‌క‌లం రేపుతుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on January 13, 2025 9:21 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

15 minutes ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

45 minutes ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

2 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

3 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

3 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

5 hours ago