టీమిండియా స్టార్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌తో పాటు యువ క్రికెటర్లు సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియా, మోహిత్ శర్మలు ఓ భారీ కుంభకోణంలో ఇరుక్కుపోయినట్టు గుజరాత్ సీఐడీ నిర్ధారించింది. గుజరాత్‌లో సంచలనం రేపిన రూ. 450 కోట్ల పోంజీ స్కాంలో ఈ నలుగురు క్రికెటర్లు పెట్టుబడులు పెట్టినట్టు వెల్లడైంది. బీజెడ్ ఫైనాన్షియల్ సర్వీస్ అనే సంస్థ ప్రజలను అధిక వడ్డీ ఆశ చూపి మోసం చేసింది.
ఈ కేసులో బీజెడ్ గ్రూప్ సీఈవో భూపేంద్ర సింగ్ ఝులాను సీఐడీ అరెస్ట్ చేయగా, ఈ స్కామ్‌లో క్రికెటర్ల పాత్రపై విచారణ జరుగుతోంది. గిల్, సుదర్శన్, తెవాటియా, మోహిత్‌లు ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గిల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ఈ జట్టుకు చెందిన ప్లేయర్లపై స్కాంలో పెట్టుబడులు పెట్టారన్న ఆరోపణలు రావడం అభిమానులకు షాక్ ఇచ్చింది.
అహ్మదాబాద్ మిర్రర్ కథనం ప్రకారం, గిల్ బీజెడ్ ఫైనాన్షియల్ సర్వీస్‌లో రూ. 1.95 కోట్లు పెట్టుబడి పెట్టగా, మిగతా ప్లేయర్లు రూ. 10 లక్షల నుంచి రూ. కోటి వరకు ఇన్వెస్ట్ చేసినట్టు సమాచారం. సీఐడీ వారి నుంచి మరిన్ని వివరాలు సేకరించేందుకు సిద్ధమవుతోంది. గిల్ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆడుతున్నాడు. సిరీస్ ముగిసిన తర్వాత భారత్‌కు రానున్న గిల్‌పై విచారణ జరగనుంది. మిగతా ప్లేయర్లను కూడా సీఐడీ త్వరలో విచారణకు పిలవనుంది.
ఈ వ్యవహారం సామాన్య ప్రజలను మాత్రమే కాదు, క్రికెట్ అభిమానులను కూడా కలచివేసింది. ప్రముఖ క్రికెటర్లు ఇలాంటి స్కాంలో ఇరుక్కుపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేసు విచారణ పూర్తి అయ్యేవరకు సీఐడీ ఇంకా పలు విషయాలను బయటపెట్టనుందని తెలుస్తోంది.
This post was last modified on January 2, 2025 4:18 pm
గత రెండేళ్ల నుంచి తెలుగులో రీ రిలీజ్‌ల హంగామా ఎలా నడుస్తోందో తెలిసిందే. పాత సినిమాలను రీ రిలీజ్ చేయడం…
రాజమండ్రిలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ప్రసంగంలో…
టాలీవుడ్లో చాలామంది దర్శకులు మేకింగ్ విషయంలో బాగా టైం తీసుకునేవాళ్లే. స్క్రిప్టు పక్కాగా సిద్ధం చేసుకోకపోవడం, సరైన ప్రణాళికలతో షూటింగ్‌కు…
పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ మధ్య ఉన్న బాండింగ్ గురించి అభిమానులకు కొత్తగా చెప్పేందుకు ఏం లేదు కానీ పబ్లిక్…
చాలామంది సినీ నటుల నట జీవితాన్ని వారు నటించిన సినిమాలను లెక్క చూపించి.. దానికి ముందు.. దాని తర్వాత అంటూ…
అన్నయ్య చిరంజీవి అంటే పవన్ కళ్యాణ్ కు ఎంత ప్రేమో ఇప్పటికే లెక్కలేనన్ని సందర్భాల్లో బయటపడినా ప్రతిసారి కొత్తగా అనిపించడం…