విమాన ప్రయాణికులకు ఎయిర్ ఇండియా అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. విమాన ప్రయాణంలో విరామం లేకుండా ఇంటర్నెట్ సేవలను అందించే సౌకర్యం ప్రవేశపెట్టనుంది. దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాల్లో ఎయిర్ ఇండియా వైఫై సేవలను ప్రారంభించబోతుండగా, ఈ సేవలు అందిస్తున్న భారతీయ విమానయాన సంస్థగా చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించనుంది. ఈ సేవలతో ప్రయాణికులు గగనతలంలో కూడా తమ డిజిటల్ అవసరాలను తీర్చుకోవడానికి వీలుంటుంది.
వైఫై సేవల వల్ల ప్రయాణికులు విమానంలోనే వర్క్ ఫ్రం ఎయిర్ ట్రెండ్ ను కొనసాగించవచ్చు. 10 వేల అడుగుల ఎత్తులో కూడా ఇంటర్నెట్‌తో కనెక్ట్ అవ్వడం ఈ సదుపాయం ప్రత్యేకతగా చెప్పవచ్చు. ఈ సేవలు శాటిలైట్ కనెక్టివిటీ ఆధారంగా పనిచేస్తుండగా, విమానం ప్రయాణించే మార్గం, ప్రభుత్వ ఆమోదం వంటి అంశాలు సేవల అందుబాటుకు ప్రభావం చూపుతాయి. మొదటగా ఈ సేవలను న్యూయార్క్, లండన్, పారిస్, సింగపూర్ వంటి గమ్యస్థానాలకు వెళ్ళే ఎయిర్‌బస్ ఏ350, ఏ321 నియో, బోయింగ్ 787-9 విమానాల్లో ప్రవేశపెడతారు.
విదేశీ ప్రయాణాల అనంతరం దేశీయ రూట్లలో కూడా ఈ సేవలు దశలవారీగా అందుబాటులోకి తీసుకురావాలని ఎయిర్ ఇండియా యోచిస్తోంది. ఈ ఆవిష్కరణతో ప్రయాణికులకు తక్కువ సమయంలో ఎక్కువ పనులు పూర్తి చేసుకునే అవకాశాలు పెరుగుతాయి. ముఖ్యంగా, బిజినెస్ ట్రిప్‌లలో ఉన్నవారు, కుటుంబంతో సంబంధాలు కొనసాగించేవారు, లేదా సోషల్ మీడియాలో ఆక్టివ్‌గా ఉండే వాళ్లకు ఈ సదుపాయం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
వైఫై సేవలు ప్రవేశపెట్టడం ఎయిర్ ఇండియా విస్తరణలో ముఖ్యమైన అడుగుగా చెప్పవచ్చు. ఈ చర్య విమానయాన రంగంలో పోటీని పెంచడమే కాకుండా, ప్రయాణికుల అనుభవాన్ని మెరుగుపరుస్తుంది. త్వరలోనే ఈ సేవలు మరింత విస్తృతంగా అందుబాటులోకి రావడం ద్వారా భారతీయ విమానయాన రంగం సాంకేతికంగా మరో మెట్టు ఎక్కనుంది.
This post was last modified on January 2, 2025 11:11 am
వైసీపీ హయాంలో జగన్ విద్యార్థులకు గోరుముద్ద నుంచి అమ్మఒడి వరకు అన్నీ ఇచ్చారని వైసీపీ నేతలు గొప్పలు చెప్పుకున్న సంగతి…
పుష్ప 2 ది రూల్ థియేట్రికల్ రన్ ముగింపుకి దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తున్నా రికార్డులు మాత్రం ఆగడం లేదు. డిసెంబర్…
జనవరి 14 విడుదల కాబోతున్న సంక్రాంతికి వస్తున్నాం ప్రమోషన్లకు సంబంధించిన ఏ అవకాశాన్ని వెంకటేష్, అనిల్ రావిపూడి వదలడం లేదు.…
అసలు శతదినోత్సవం అనే మాటే సినీ పరిశ్రమ ఎప్పుడో మర్చిపోయింది. మూడు నాలుగు వారాలకు బ్రేక్ ఈవెన్ అయితే అదే…
ఈ రోజు సాయంత్రం జరగబోయే గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాజమండ్రి సిద్ధమయ్యింది. సుమారు లక్షన్నర మందికి…
డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ప్రభావం ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి ఒక్కరి జీవనశైలి సామాజిక మాధ్యమాలతో…