Trends

రోహిత్, కోహ్లి… నిరాశలో ఫ్యాన్స్!

బుమ్రా ఎప్పట్లాగే అదరగొట్టాడు. మిగతా బౌలర్లూ రాణించారు. తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి అద్భుత శతకం సాధించాడు. యశస్వి జైస్వాల్ పోరాడాడు. కానీ ఏం లాభం? ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టులో భారత జట్టుకు ఓటమి తప్పలేదు. 340 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ ఇండియా.. 155 పరుగులకే కుప్పకూలింది.

ఓపెనర్ యశస్వి జైస్వాల్ (84) గొప్పగా పోరాడాడు. కానీ రిషబ్ పంత్ (30) తప్ప ఎవ్వరూ అతడికి సహకరించలేదు. వీళ్లిద్దరి పోరాటంతో ఒక దశలో భారత్ 121/3తో మెరుగైన స్థితిలో కనిపించింది. దీంతో మెల్‌బోర్న్‌లో అద్భుతం ఏమైనా జరుగుతుందేమో అనే ఆశలు కలిగాయి. కానీ పంత్ ఔటవ్వగానే భారత బ్యాటింగ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైపోయింది. 24 పరుగుల తేడాలో 7 వికెట్లు కోల్పోయి పరాజయం చవిచూసింది. ఈ ఓటమితో భారత్‌కు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ అవకాశాలు దాదాపుగా చేజారినట్లే.

ఇప్పటికే దక్షిణాఫ్రికా ఫైనల్ చేరగా.. ఈ విజయంతో ఆసీస్‌కు కూడా బెర్తు ఖరారైనట్లే. భారత్‌కు ఈ మ్యాచ్‌లో గెలిచే అవకాశాలు వచ్చాయి. నాలుగో రోజు 91 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియాను త్వరగా ఆలౌట్ చేస్తే గెలిచే ఛాన్స్ ఉండేది. కానీ బౌలర్లు పట్టువదిలేశారు. ఇక చివరి రోజు బ్యాట్స్‌మెన్ పట్టుదలతో పోరాడితే కనీసం డ్రా చేసుకునే ఛాన్స్ అయినా ఉండేది. కానీ ప్రధాన బ్యాటర్ల వైఫల్యం జట్టు కొంపముంచింది.

ఈ ఓటమికి ప్రధాన బాధ్యత వహించాల్సింది సీనియర్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలే అని వారి అభిమానులు సైతం నిరాశ వ్యక్తపరుస్తున్నారు. సిరీస్‌లో పేలవ ప్రదర్శనను కొనసాగిస్తూ రోహిత్ మరోసారి డబుల్ డిజిట్ లేకుండా 9 పరుగులకే ఔటైపోయాడు. కోహ్లి 5 పరుగులకే చేతులెత్తేశాడు. తొలి టెస్టులో అనుకూల పరిస్థితుల్లో సాధించిన సెంచరీ మినహాయిస్తే కోహ్లి పెద్దగా సాధించిదేమీ లేదు.

ఈసారైనా గట్టి కంబ్యాక్ ఇస్తాడనుకున్న రోహిత్ కూడా పూర్తి నిరాశనే మిగిల్చాడూ . 3, 6, 10, 3, 9.. ఇవీ సిరీస్‌లో అతడి స్కోర్లు. ఇప్పటికే రోహిత్ రిటైర్మెంట్ ఇవ్వబోతున్నట్టు వార్తలు వెలువడ్డాయి .. ఇప్పుడవి మరింత ఊపందుకున్నాయి. కోహ్లి కూడా జట్టుకు భారంగా మారాడని.. అతను కూడా నిష్క్రమించాల్సిన సమయం ఆసన్నమైందని పలు అభిమానుల నుండి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సిరీస్ తర్వాత టెస్టుల నుండి వేరు నిజంగానే రిటైర్ అవుతారో లేదో అని ఫ్యాన్స్ డైలమా లో పడిపోయారు.

This post was last modified on December 30, 2024 4:48 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

హింసను ఇష్టపడుతున్న 5జి ప్రేక్షకులు

ఇప్పుడంతా ఇంటర్ నెట్ ప్రపంచం. కొన్ని నిముషాలు మొబైల్ డేటా లేకపోయినా, ఇంట్లో వైఫై పనిచేయకపోయినా ఏదో భూమి బద్దలైపోయి…

7 minutes ago

మహేష్ – రాజమౌళి : ఇది కూడా రహస్యమేనా జక్కన్నా…

ఈ సోషల్ మీడియా కాలంలో పెద్ద పెద్ద సినిమాలకు సంబంధించి కూడా ఆన్ లొకేషన్ ఫొటోలు, వీడియోలు లీక్ అయిపోతుంటాయి.…

2 hours ago

రిలీజ్ డేట్స్ తో కొత్త సినిమాల తంటాలు !

ముందో విడుదల తేదీ అనుకుని పోటీ వల్ల వెనుకడుగు వేసి ఇప్పుడు కొత్త డేట్ పట్టుకునేందుకు కిందా మీద పడుతున్న…

2 hours ago

రాజకీయాన్ని మార్చబోయే ‘గేమ్ ఛేంజర్’ ఆట!

https://youtu.be/zHiKFSBO_JE?si=HDSpx4GNEhcOje0y కొత్త సంవత్సరం తొలి ప్యాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ జనవరి 10 విడుదల కాబోతున్న నేపథ్యంలో అందరి…

3 hours ago

భారీ కుంభకోణంలో చిక్కుకున్న భారత యువ క్రికెటర్లు!

టీమిండియా స్టార్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌తో పాటు యువ క్రికెటర్లు సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియా, మోహిత్ శర్మలు ఓ…

3 hours ago