ఉపేంద్ర యుఐ కోసం అయిదు రోజులు ఆగి విడుదలవుతున్న సినిమా మ్యాక్స్. ఈగతో మనకు విలన్ గా పరిచయమై బాహుబలి, సైరా నరసింహారెడ్డి లాంటి టాలీవుడ్ స్ట్రెయిట్ మూవీస్ చేసిన కిచ్చ సుదీప్ ఇందులో హీరోగా నటించాడు. కన్నడ, తమిళ వెర్షన్లు ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చినప్పటికే తెలుగు డబ్బింగ్ కొంత ఆలస్యంగా ఎల్లుండి డిసెంబర్ 27 రిలీజవుతోంది. ట్రైలర్ చూశాక యాక్షన్ లవర్స్ కోరుకునే కంటెంట్ లాగే అనిపించింది. సునీల్, వరలక్ష్మి శరత్ కుమార్ లాంటి మనకూ పరిచయమున్న అరిస్టులు ఉండటంతో ఇక్కడి జనాల్లోనూ కాసింత ఆసక్తి రేగింది. ఇంతకీ ఖైదీ కనెక్షన్ ఏంటో చూద్దాం.
కార్తీకి, లోకేష్ కనగరాజ్ కు అతి పెద్ద బ్రేక్ గా నిలిచిన ఖైదీ కేవలం ఒక రాత్రిలో జరిగే సంఘటనల ఆధారంగా తీసిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ మ్యాక్స్ లో కూడా ఇదే ఫార్ములా ఉంటుంది. కాకపోతే స్టోరీ లైన్, ట్రీట్ మెంట్ వేరు. సస్పెండ్ అయిన ఒక పోలీస్ ఆఫీసర్ ఇద్దరు రాజకీయ నాయకుల మధ్య కలిగిన వైరం కారణంగా తన స్టేషన్ ని కాపాడుకునే బాధ్యత తీసుకుంటాడు. ఈ క్రమంలో మాఫియా ఎంట్రీ, మినిస్టర్ కొడుకుల హత్య , షూటవుట్లు, పరస్పర దాడులు, తుపాకులు,బుల్లెట్లు ఇలా బోలెడు వ్యవహారాలు చోటు చేసుకుంటాయి. అసలు మ్యాక్స్ మిషన్ ఏంటనేది తెరమీద చూస్తేనే కిక్కని ఎర్లీ రిపోర్ట్స్.
కన్నడ రివ్యూలు మ్యాక్స్ కు సానుకూలంగా ఉన్నాయి. మన దగ్గర ఎలాంటి తీర్పు వస్తుందో రెండు రోజులు ఆగితే కానీ క్లారిటీ రాదు. విరూపాక్ష ఫేమ్ అజనీష్ లోకనాథ్ సంగీతం ప్రధాన ఆకర్షణగా చెబుతున్న మ్యాక్స్ కోసం సుదీప్ చాలా ప్రమోషన్లు చేశాడు. గత చిత్రం విక్రాంత్ రోనా ఇతర భాషల్లోనూ డీసెంట్ గా ఆడిన నేపథ్యంలో మ్యాక్స్ కు అంతకు మించిన ఫలితాన్ని ఆశిస్తున్నాడు. ఎలాగూ క్రిస్మస్ పండక్కు సరైన కమర్షియల్ సినిమా లేదని ఫీలవుతున్న మూవీ లవర్స్ కొరత ఇదేమైనా తీరుస్తుందేమో చూడాలి. దీంతో పాటు 27 వస్తున్న డ్రింకర్ సాయి పూర్తిగా యూత్ ని లక్ష్యంగా పెట్టుకుని ప్రమోట్ చేసుకుంటోంది.
This post was last modified on December 25, 2024 2:59 pm
విక్టరీ వెంకటేష్ మొట్టమొదటి వెబ్ సిరీస్ గా 2023 మార్చిలో విడుదలైన రానా నాయుడు భారీ స్థాయిలో మిలియన్ల కొద్దీ…
ఊరిపేరు భైరవకోనతో ట్రాక్ లో పడ్డ యూత్ హీరో సందీప్ కిషన్ ఈ నెలలో మజాకాతో పలకరించబోతున్నాడు. త్రినాధరావు నక్కిన…
లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం ప్రధాన పాత్ర పోషించిన బ్రహ్మ ఆనందం ఫిబ్రవరి 14 విడుదల కానుంది. మాములుగా అయితే విశ్వక్…
బాలీవుడ్ లో బేబీ జాన్ తో అడుగు పెట్టిన కీర్తి సురేష్ కి తొలి సినిమానే డిజాస్టర్ కావడం నిరాశపరిచేదే…
అనుకున్నంతా అయ్యింది. అధికార పార్టీ టీడీపీ వ్యూహాల ముందు విపక్ష వైసీపీ వ్యూహాలు ఫలించలేదు. రాజకీయాలకు కొత్తే అయినా గుంటూరు…
పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారం తినిపించడం ఈ రోజుల్లో పెద్ద సవాళుగా మారింది. తల్లిదండ్రులు ఎన్ని ప్రయత్నాలు చేసినా, పిల్లలు తమ…